EPAPER

Bangladesh Protest: 15 ఏళ్ల పాలన ఒక నిర్ణయం తో ఆవిరి!

Bangladesh Protest: 15 ఏళ్ల పాలన ఒక నిర్ణయం తో ఆవిరి!

Bangladesh PM Sheikh Hasina Quits, Army Takes Over Amid Students Protest: బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి బాధ్యతల నుంచి షేక్‌ హసీనా తప్పుకున్నారు. త్వరలో బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అప్పటి వరకు దేశం సైనికుల చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె సేఫ్‌ షెల్టర్‌లో ఉన్నారు. ఇదీ బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ ఉజ్ జమన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. దీనికి కారణాలేంటి? అనే దానిపై కాదు ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. అధికారంలో ఉన్నవాళ్లు అదుపు తప్పితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో దాని గురించి మనం డిస్కస్ చేయబోయేది.


షేక్‌ హసీనా.. చాలా పవర్‌ఫుల్‌ లీడర్.. బంగ్లాదేశ్‌ ఓ ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు పోరాడి. చివరికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి అధ్యక్షుడైన షేక్‌ మురిబుర్ రెహ్మాన్ కూతురు షేక్ హసీనా.. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా పేరు సంపాదించారు ఆమె.. రీసెంట్‌గా ఐదోసారి బంగ్లాదేశ్‌ ప్రధానిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు ఆమె.. వరుసగా నాలుగుసార్లు ప్రమాణస్వీకారం చేశారు ఆమె.. మంచి పాలకురాలిగా కూడా పేరుంది హసీనాకు. అలాంటి హసీనా ప్రస్తుతం దేశం నుంచి వెళ్లిపోవాల్సిన.. కాదు కాదు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లీడర్ నుంచి డిక్టేటర్‌గా మారారన్న పేరు సంపాదించుకుంది. ఎందుకు? దానికి కారణాలేంటి?

ప్రజలు అధికారం ఇచ్చి అందలం ఎక్కించేది ఎందుకు? దేశాన్ని గాడిలో పెడతారని.. ప్రజలందరికి సమన్యాయం చేస్తారని.. కానీ.. అది కాస్త అహంకారాన్ని పెంచితే.. అధికారాన్ని ప్రజల మంచి కోసం కాకుండా.. స్వప్రయోజనాలకు ఉపయోగిస్తే.. ఫలితం ఇలాగే ఉంటుంది. నేను చెప్పిందే వేదం.. రాసిందే చట్టం అంటే కుదరదు కదా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజలు ఊరుకోరు కదా.. ప్రశ్నించే గొంతును నొక్కేస్తానంటే ఎలా? అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే రియాక్షన్ ఇలానే ఉంటుంది.


హసీనా రివేంజ్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరుగా మారారు. దీనికి ఎగ్జాంపుల్ ఆమె హయాంలో ప్రతిపక్షాలపై నమోదైన కేసులు, దాడులు.. ఆమె విపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని చూశారు. ఒకానొక టైమ్‌లో సక్సెస్ అయ్యారు. హసీనా తీరుతో రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీతో పాటు ఏ పార్టీ కూడా పోటీ చేయలేదు.. మూకుమ్మడిగా బహిష్కరించాయి. దీంతో హసీనా పార్టీ అవామీ లీగ్‌ మెజార్టీ సీట్లలో గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. కానీ ఏం లాభం.. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ పర్సంటేజ్‌ 40 మాత్రమే.. గత ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే చాలా మంది ఎన్నికలకు కావాలనే దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. మరి ఈ విషయమైనా హసీనాకు అర్థం కాలేదు.

పోనీ వచ్చిన అధికారాన్నైనా సరిగా ఉపయోగించుకున్నారా అంటే అదీ లేదు. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు చెందిన వారికి ఏకంగా 30 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ ఆదేశాలు బయటికి రాగానే బంగ్లాదేశ్ అగ్నిగుండంగా మారింది. దీనికి రెండు కారణాలు.. మొదటిది.. మాములుగానే తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని యువతలో ఆగ్రహం మొదలైంది. రెండు.. అలా లబ్ధి పొందే వారిలో మెజారిటీ హసీనా పార్టీకి చెందిన వారే కావడం. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలైంది. చిన్నగా మొదలైనా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. పోనీ ఉద్యమాన్ని చూసైనా హసీనా వెనకడుగు వేయలేదు. అధికారం ఉంది కదా అని తన నోటికి పని చెప్పారు. ఉద్యమకారులను రజాకార్లతో పోల్చారు. ఇది అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. న్యాయం కోసం పోరాడుతుంటే.. తమను అవమానిస్తున్నారంటూ మరింత కసిగా ఉద్యమించారు.

Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వని విద్యార్థి ఉద్యమం

హాసీనా చేసిన రెండో తప్పు.. ఉద్యమకారులతో చర్చించే అంశాన్ని కూడా పరిశీలించలేదు. ఇప్పటి వరకు ఏకంగా 300 మంది వరకు విద్యార్థులు చనిపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎంతలా ఉక్కుపాదం మోపారో.. ఇవి నిరసనకారుల్లో భయాన్ని తెప్పిస్తాయనుకున్నారు హసీనా.. కానీ అది కొత్త తెగింపుకు కారణమయ్యాయి. అంతేకాదు వారిని ఉగ్రవాదులతో పోల్చారు. అప్పటికి కూడా హసీనా.. నేను, నా ప్రభుత్వం.. నా అధికారం అనే థాట్‌లో ఉన్నారు తప్ప.. ఈ పదవి శాశ్వతం కాదు.. ప్రజల మనోభావాలను పట్టించుకోవాలన్న ధ్యాస కూడా రాలేదు ఆమెకు.. నిజానికి హసీనా దేశం విడిచి పారిపోవడం.. ఇతర దేశాల్లో ఆశ్రయం పొందడం ఇది మొదటిసారి కాదు.

1975 ఆగస్టు 15న షేక్ హసీనా జీవితంలో మర్చిపోలేని రోజు.. ఆ రోజునే ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్‌తో పాటు.. ఆమె కుంటుంబం మొత్తాన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. కారణం సైనిక తిరుగుబాటు.. అప్పుడు ఆమె బెల్జియంలో ఉన్నారు. వెంటనే ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించింది. తిరిగి ఆమె 1981లో బంగ్లాదేశ్‌కు వెళ్లారు. అప్పుడు ఆమెకు దాదాపు 15 లక్షల మంది ప్రజలు స్వాగతం పలికారు. అధికారర పగ్గాలు అందించారు. ఏకంగా ఐదుసార్లు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఆ ప్రజలే మళ్లీ హసీనాను తరిమారు. ఆ ప్రజల కారణంగానే హసీనా దేశం విడిచి పారిపోయారు. చివరికి ఆమె ఓ ప్రసంగం చేసి వెళ్లిపోదామనుకున్నా ఆ అవకాశం దక్కలేదు ఆమెకు.

ఏ రాజకీయ నేతకైనా.. ఏ ప్రభుత్వ పెద్దకైనా.. హసీనా రాజకీయ జీవిత కథ ఓ హెచ్చరిక లాంటిది. అధికారం ఉందని రెచ్చిపోతే.. అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఇదే గతి పడుతుంది.

Related News

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Chakali Ailamma: తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

Nandigam Suresh: నందిగం సురేష్‌కి.. బిగిస్తున్న ఉచ్చు..

Mahesh Kumar Goud:హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Big Stories

×