EPAPER
Kirrak Couples Episode 1

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Another Former Mla Also Will Join Janasena Along With Balineni Srinivas: ఆ జిల్లాలో ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. అభిమానులు అంతా పెద్దాయన అని పిలుచుకునే ఆ నేత.. ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ పెట్టుకొని.. మళ్లీ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని పావులు కదుపుతున్నారట. ఇంతకు ఆ సీనియర్ లీడర్ ఎవరు ? ఆ పెద్దాయన ప్లాన్స్ ఏంటో.. వాచ్ ధిస్ స్టోరీ


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్ట్ సినియార్ పొల్టిషియన్ క‌రణం బలరామ కృష్ణమూర్తి. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడు. టీడీపీతో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరాం.. అంతకు ముందు కాంగ్రెస్ లోనూ పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం టీడీపీ తరపున అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించి.. వైసీపీ పంచన చేరిపోయారు.

అప్పట్లో కరణం బాలరాంని వైసీపీ లోకి తీసుకెళ్లింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఇప్పుడు బాలినేని జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం రాజకీయాలపై ఫొకస్ పెట్టిన బాలినేని.. సీనియర్ పొలిటికల్ లీడర్ గా ఉన్న కరణం బాలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ను జనసేనలోకి తీసుకువెళ్లేందుకు చర్చలు నడుపుతునట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి జిల్లా వ్యాప్తంగా చీరాల పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.


గత ఎన్నికల్లో కరణం వెంకటేష్ చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపొయారు. దాంతో కొడుకును ఎమ్మెల్యేగా చూడలన్న తండ్రి కరణం బలరాం కల.. కలగానే మిగిలింది. ఈ పరిస్థితుల్లో కరణం కుటుంబం పక్క పార్టీ చూపులు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పార్టీ మార్పు వ్యవహారంలోనే ఆయన ముందు రెండు ప్లాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్లాన్ ఏ ప్రకారం.. కరణం మళ్లీ పాత గుటికి వెళ్తారని గత కొన్నాళ్లుగా చీరాలలో చర్చ జరుగుతోంది. ముందు బలరామ కృష్ణమూర్తి టీడీపీలో చేరి.. ఆ తర్వాత నెమ్మదిగా తన కుమారుడిని తీసుకొస్తారన్న చర్చ జోరందుకుంది. అందుకే ఆయన తన రిజైన్ లెటర్ ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రేపు మాపో కరణం వెళ్లిపోతారని స్థానికంగా కూడా నాయకులు చర్చించుకుంటున్నారు.

మరోవైపు చీరాలలో ప్రస్తుతం కరణం కుటుంబానికి.. వైసీపీ పరాభవం తర్వాత సహకరించే నాయకులు పెద్దగా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు మొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎంతో కాలం ఇక్కడ ఉండి రాజకీయాలు చేయలేమని నిర్ణయించుకున్న కరణం బలరాం.. టీడీపీలో చేరి రాజకీయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

కరణం బలరాం వస్తానన్నా తీసుకునేది లేదన్నట్టుగానే టీడీపీ వ్యవహారం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు పడవలపై కాలేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ.. తీసుకోకూడదని చంద్రబాబు.. కరణం బలరాం సన్నిహితులతో అన్నట్లు చెబుతున్నారు. నిజంగానే చంద్రబాబు ఆ తరహా నిర్ణయం తీసుకుంటే బలరామ కృష్ణమూర్తి టీడీపీలో చేరే ప్రయత్నాలు వృధానే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు లేనట్టే.. కరణం బలరాంని పార్టీలో చేర్చుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.

ఈ ఊహించని పరిస్థితుల్లో బలరాం ప్లాన్ ఏ బెడిసికొట్టి.. టీడీపీలో చేరేందుకు అడ్డంకులు ఎదురైతే.. ప్లాన్ బీ అమలు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి సీనియర్ లీడర్లు అవసరం కాబట్టి.. బలరాంని వైసీపీ లోకి తీసుకొచ్చిన బాలినేని.. ఇప్పుడు ఆయనతో పాటు కుమారుడు వెంకటేష్ ను కూడా జనసేన లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బాలినేని సైతం కరణం బలరాం కుటుంబంతో చర్చలు జరుపుతున్నారని టాక్ ఉంది.

ఇక ఇటీవల బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేశ్ ని నియమించారు. ప్రకటన వచ్చిన వెంటనే వెంకటేశ్ జిల్లా బాధ్యతలు తనకు వద్దంటూ.. సున్నితంగా తిరస్కరించారు. దాంతో మళ్లీ కొత్త జాబితాలో మాజీ మంత్రి మేరుగు నాగార్జునను.. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ వ్యవహారం కూడా కరణం ఫ్యామిలీ పార్టీ మారతారనే ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి నేతలు వరుసగా వలస బాట పడుతున్న తరుణంలో.. సీనియర్ లీడర్ అయిన కరణం బలరామ కృష్ణమూర్తి.. ప్లాన్ ఏ ఫాలో అయ్యి తిరిగి టీడీపీలో చేరతారా ? బాలినేని అండతో జనసేన తీర్ధం పుచ్చుకుంటారా అని చర్చ జోరందుకుంది.

Related News

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Big Stories

×