EPAPER
Kirrak Couples Episode 1

Animals without food : ఆహారం లేకుండా నెలలపాటు జీవించగల ప్రాణులు

Animals without food : ఈ భూమిపై నివసించే ప్రాణులలో మనుషులు సగటున రోజుకు 3 నుంచి 6 మార్లు భోజనం చేస్తారు. కానీ కొన్ని జంతువులు మాత్రం ఆహారం తీసుకోకుండా నెలలు.. సంవత్సరాలపాటు జీవించగలవు. అది వారికి ప్రకృతి వారికి ప్రసాదించిన వరం.

Animals without food : ఆహారం లేకుండా నెలలపాటు జీవించగల ప్రాణులు

Animals without food : ఆహారం తీసుకోవడం వలన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆహారం వలన శరీరంలో రక్తప్రసరణ జరిగి ఎముకలు, కండరాలు, నరాలకు బలం చేకూరుతుంది. సరైన సమయానికి భోజనం చేయకుంటే కోపం, చికాకు, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఈ కారణంగా ప్రతి ప్రాణి జీవించడానికి ఆహారం తప్పనిసరిగా తీసుకుంటుంది.


ఈ భూమిపై నివసించే ప్రాణులలో మనుషులు సగటున రోజుకు 3 నుంచి 6 మార్లు భోజనం చేస్తారు. కానీ కొన్ని జంతువులు మాత్రం ఆహారం తీసుకోకుండా నెలలు.. సంవత్సరాలపాటు జీవించగలవు. అది వారికి ప్రకృతి వారికి ప్రసాదించిన వరం.

పిల్లి – CAT 2 వారాలు


పిల్లులు పెంపుడు జంతువులు. వాటికి ఆహార కొరత అనేది సాధారణంగా ఉండదు. కానీ ఆహారం దొరకని పరిస్థితులలో.. కొద్దిపాట ఆహారంతో పిల్లులు రెండు వారాలపాటు జీవించగలదు.

ఒంటె – Camel 2 నెలలు


ఒంటెలు ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తాయి. అక్కడ వాటికి నీరు తక్కువగా దొరుకుతుంది. ఒంటెల వీపు భాగంలో ఎత్తుగా ఓ ఆకారం ఉంటుంది. అందులో కొవ్వు రూపంలో ఒంటెలు తమ కావల్సిన శక్తిని నిలువచేయగలవు. అలా ఆహారం దొరకని స్థితిలో ఒంటెలు తమ వీపులో ఉన్న కొవ్వుని తమ శరీరానికి శక్తినిచ్చే విధంగా ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియని ఒంటెలు రెండు నెలలపాటు కొనసాగించగలవు.

షార్క్ చేప – Great White Shark 3 నెలలు


ఒక షార్క్ చేప సంవత్సరానికి 11 టన్నుల ఆహారం తినగలదు. అంటే నీటిలో ఉన్న చిన్నచేపలను భారీ సంఖ్యలో షార్క్ చేప తినేస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ చేప ఒకసారి భోజనం చేస్తే.. 3 నెలల వరకు తినకుండా ఉండగలదు.

ఎలుగుబంటి – Bear – 3 నెలలు


ఎలుగుబంటి ఆహారంగా చిన్న సాధు జంతువులను, చేపలను, తేనె లాంటివి తీసుకుంటుంది. ఎలుగుబంటి జాతికి చెందిన గ్రిజ్లీ బేర్, పొలార్ బేర్ ఎలుగుబంటులు చలికాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. ముఖ్యంగా మంచు ప్రాంతాలలో నివసించే పొలార్ బేర్ అయితే అక్కడ చలి తీవ్రంగా ఉండడం వలన కొన్ని నెలలపాటు నిద్ర పోతుంది. ఇలా 3 నెలలపాటు ఏమి తినకుండా, తాగకుండా, మల, మూత్ర విసర్జన చేయకుండా ఇది ఉండగలదు.

పెంగ్విన్ – Penguin – 3 నెలలు

పెంగ్విన్ జంతువులు మంచు ప్రదేశమైన అంటార్క్‌టికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలలో నివసిస్తాయి. పెంగ్విన్‌లలో ఆడ పెంగ్విన్‌లు రెండు నెలలపాటు ఆహారం తీసుకోకుండా ఉండగలవు. ఆడ పెంగ్విన్‌లు గుడ్లు పెడితే వాటిని కాపాడడానికి మగ పెంగ్విన్‌లు కాపాలాగా ఉంటాయి. అలా చలికాలం వస్తే మగ పెంగ్విన్‌లు మూడు నెలలపాటు గుడ్లను కాపాలాగా ఉంటూ ఏమీ తినకుండా ఉంటాయి.

సాలెపురుగులు – Spiders – 4 నెలలు

సాలెపురుగులు ఆహారం కోసం వేటాడుతాయి. అందుకోసం తమ నోటి నుంచి వచ్చే ద్రవ పదార్థంతో సన్నటి దారాన్ని తయారు చేసుకొని దానితో ఒక ఉచ్చులాంటి గూడుని తయారు చేస్తుంది. ఆ గూడులో ఒకవైపు ప్రశాంతంగా నిలబడి ఏదైనా ఈగ, లేదా చిన్న కీటకం వచ్చి చిక్కుకుంటే దానిని చంపేస్తుంది. ఆ తరువాత మెల్లగా దానిని ఆహారం చేసుకొని తింటుంది. కానీ ఒక్కోసారి దాని ఉచ్చులో కీటకం రాకపోతే.. ఆహారం దొరకని స్థితిలో 4 నెలలపాటు జీవించగలదు.

హంప్‌బ్యాక్ వేల్ ‌చేప – Humpback whale — 6 నెలలు

హంప్‌బ్యాక్ వేల్ ‌చేపలు ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి. వీటికి కూడా ఒంటెల లాగా వీపు భాగంలో ఎత్తుగా ఆకారం ఉంటుంది. అందులో ఇవి తీసుకున్న ఆహారాన్ని కొవ్వు లాగా మలుచుకొని నిలవు చేసుకుంటాయి. అలా వేసవి కాలంలో తిన్న ఆహారాన్ని కొవ్వు లా మలుచుకొని తమ వీపు భాగంలో నిలువ చేసుకున్న ఆహారాన్ని హంప్‌బ్యాక్‌ వేల్ చేపలు 6 నెలలపాటు మెల్లగా శరీరానికి కావాల్సిన శక్తిని తీసుకుంటూ చలికాలాన్ని గడుపుతాయి.

కొండచిలువ పాము – Ball Python – 6 నెలలు


పాము జాతికి చెందిన కొండచిలువని అందరూ చూసి ఉంటారు. ఇది విష సర్పము కాదు. కానీ మనిషిని, ఆవు, మేక లాంటి ఆకారం గల పెద్ద ప్రాణులను సైతం పట్టుకొని(చుట్టేసి) మెల్లగా చంపి.. వాటిని పూర్తిగా మింగేస్తుంది. అలా తీసుకున్న ఆహారాన్ని అది మెల్లగా జీర్ణం చేసుకుంటుంది. అందుకే కొండచిలువ పాము ఒకసారి ఆహారం తీసుకున్న తరువాత మళ్లీ కొన్ని రోజుల వరకు ఏమీ తినదు. అలా కొండచిలువ పాములలో బాల్ పైథాన్ అనే జాతికి చెందిన పాము ఆరు నెలలపాటు ఆహారం తీసుకోకుండా జీవించగలదు.

గలపాగోస్ తాబేలు – Galapagos Tortoise – ఒక సంవత్సరం


గలపాగోస్ తాబేలు.. కాళ్లు కలిగిన తాబేలు జాతికి చెందినది. గలపాగోస్ తాబేలుకి పెద్ద ఆకారంలో శరీరం ఉంటుంది. ఇవి తమ శరీరం లోపల నీటిని ఎక్కువ మోతాదులో నిలువ చేసుకోగలవు. అలాగే వీటి జీవక్రియ చాలా మెల్లగా సాగుతుంది. ఈ కారణాల వల్ల గలపాగోస్ తాబేలు ఒక సంవత్సరం పాటు ఆహారం లేకున్నా జీవించగలదు.

తేలు – Scorpion- ఒక సంవత్సరం


తేలు అనే జీవి పురుగు జాతికి చెందినది. ఇది విష జీవి. దీని తోకలో విషం ఉంటుంది. సాధారణంగా ఏదైనా తేలు తన శరీరంలోని మూడో వంతు బరువు ఉన్నంత ఇతర పురుగులను, లేక పెంపుడు తేలు అయితే మాంసాన్ని తినగలదు. అలా అంత మొత్తంలో ఆహారం తిన్న తరువాత ఇది తన జీవక్రియను చాలా మెల్లగా సాగనిస్తుంది. తీసుకున్న ఆహారంలోని పోషక తత్వాలని మెల్లగా జీర్ణం చేసుకుంటుంది. అలా ఒక తేలు ఆహారం లేని పరిస్థితిలో తన ఇంతకు ముందు తిన్న ఆహారం శరీరంలో దాచుకొని దాని పోషకాలతో ఒక సంవత్సర కాలం జీవిస్తుంది.

బర్రోయింగ్ ఫ్రాగ్- Burrowing frog — ఒక సంవత్సరం


బర్రోయింగ్ ఫ్రాగ్ అనే కప్ప చాలా చిన్నగా ఉంటుంది. ఇది బురద లేక తేమగా ఉన్న మట్టిలో ఒక సంవత్సరంపాటు ఆహారం లేకుండా దాగిఉంటుంది. ఈ కప్ప సాధారణంగా చాలా బద్దక జీవి. అందువల్ల ఎక్కువ కాలం మట్టిలోనే ఉంటుంది. అలా ఒక సంవత్సర కాలంపాటు ఇది ఆహారం తీసుకోకుండా జీవించగలదు. ఈ సమయంలో తన శరీరాన్ని ఎక్కువగా కదలకుండా ఉంచుతుంది. అందువల్ల ఈ కప్ప తన శరీరంలోని తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేస్తుంది.

మొసలి – Crocodile — 3 సంవత్సరాలు


మొసలి అనగానే ఒక భయంకర ఆకారం కలిగిన జంతువు. ఇది ఒక ఉభయచర జీవి. నీటి లోపల, బయట రెండు చోట్ల జీవించగలదు. మొసళ్లు ఎక్కువగా తమ శరీరాన్ని కదలకుండా అలా పడుకునే విధంగా ఉంచుతాయి. దీనివల్ల శరీరంలో నుంచి తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఒకసారి బాగా భోజనం చేసిన తరువాత ఒక మొసలి ఆహారం దొరకని స్థితిలో 3 ఏళ్ల పాటు జీవించగలదు.

ఓల్మ్ -Olm -10 సంవత్సరాలు


ఓల్మ్ అనే జీవి సాలామాండర్ జాతికి చెందిన చిన్న జీవి. ఇది సాధారణంగా బల్లి, చిన్నపాటి డ్రాగన్ లాగా ఆకారం కలిగి 12 ఇంచుల పొడవు మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఒక బద్దక జీవి. ఆహారం దొరకని పరిస్థితిలో ఇది శరీరాన్ని కదల్చకుండా జీవక్రియను మెల్లగా సాగదీస్తుంది. తన శరీర కణజాలాన్నే మెల్లగా ఆహారంగా చేసుకొని 10 సంవత్సరాలపాటు కదలకుండా జీవిస్తుంది.

టార్దిగ్రేడ్ Tardigrade — 30 సంవత్సరాలు


టార్దిగ్రేడ్ అనే జీవి మన చేతి వేలు కంటే చిన్నగా ఉంటుంది. ఇది కూడా జీవక్రియను నెమ్మదిగా సాగదీస్తూ.. నిద్రాణ స్థితిలో ఎక్కువ కాలం జీవిస్తుంది. ఆహారం దొరకని స్థితిలో జీవక్రియను 100 శాతం ఉపయోగించకుండా 0.01 శాతం మేరకు మాత్రమే వినియోగిస్తుంది. శరీరంలో నీటిని కేవలం ఒక శాతం మాత్రమే నిలువ చేస్తుంది. అయినా 30 సంవత్సరాల వరకు జీవించగలదు.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×