EPAPER

American Senate slams Social Media: నీళ్లు నమిలిన సోషల్ మీడియా దిగ్గజాలు.. టీనేజర్ల ఆత్మహత్యలపై అమెరికా పార్లమెంటులో రచ్చ

జనవరి 31, 2024న అమెరికన్ పార్లమెంట్ upper house అయిన అమెరికన్ సెనేట్‌లో ప్రజల ముందు ఓ విచారణ జరిగింది. ఆ విచారణలో మెటా.. అంటే ఫేస్ బుక్ CEO MARK ZUCKERBERG ప్రజలందరికీ క్షమాపణలు చెప్పారు. ఆయన ముఖంలో ఒకరకమైన సిగ్గు, భయం

American Senate slams Social Media: నీళ్లు నమిలిన సోషల్ మీడియా దిగ్గజాలు.. టీనేజర్ల ఆత్మహత్యలపై అమెరికా పార్లమెంటులో రచ్చ

American Senate slams Social Media: జనవరి 31, 2024న అమెరికన్ పార్లమెంట్ upper house అయిన అమెరికన్ సెనేట్‌లో ప్రజల ముందు ఓ విచారణ జరిగింది. ఆ విచారణలో మెటా.. అంటే ఫేస్ బుక్ CEO MARK ZUCKERBERG ప్రజలందరికీ క్షమాపణలు చెప్పారు. ఆయన ముఖంలో ఒకరకమైన సిగ్గు, భయం కనిపించింది.


అక్కడ కూర్చున్న వారంతా అమెరికన్ టీనేజర్ల తల్లిదండ్రులు. వారి పిల్లలందరూ సోషల్ మీడియాలో వచ్చే BULLYING, HARRASSMENT అంటే వేధింపులకు గురవుతున్నారు. కొందరి పిల్లలైతే ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.

పిల్లల వేధింపులకు సోషల్ మీడియా అడ్డగా మారిందని.. facebook, twitter, Tiktok, instagram లాంటి సోషల్ మీడియా కంపెనీలు ఇలాంటి ఘటనలు ఆపేందుకు ఏ ప్రయత్నం చేయడం లేదని అమెరికన్ పార్లమెంట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సోషల్ మీడియా ఎంత dangerousగా మారిందనడానికి ఈ సెక్స్ టార్షన్ కేసు ఉదాహరణ.

జోర్డాన్ డిమే అనే 17 ఏళ్ల టీనేజర్ అమెరికా మిచిగాన్ ప్రాంతంలో హై స్కూల్ విద్యార్థి. అతడు స్కూల్‌లో మంచి football player.. Jordanకు మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అతను ఒకే ఒక తప్పు చేశాడు. అదే సోషల్ మీడియాలో ముఖ్యంగా Instagramలో ఒక అమ్మాయితో ప్రేమలో పడడం. ఆ అమ్మాయితో రోజూ చాటింగ్ చేస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఒకరోజు ఆ అమ్మాయి.. జోర్డన్‌ని న్యూడ్ fotos, videos పంపించమని చెప్పింది. ఆ అమ్మాయి కూడా న్యూడ్ fotos పంపింది. దీంతో జోర్డన్ కూడా తన న్యూడ్ fotos పంపించాడు. అంతే మరుసటి రోజు నుంచి జోర్డన్‌కి ఆ అమ్మాయి ఒక మేసేజ్‌ చేసింది. జోర్డన్ న్యూడ్ fotos తన వద్ద ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి జోర్డన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ట్యాగ్ చేస్తానని చెప్పింది. అలా చేయకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు పంపించమని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో జోర్డన్ భయపడిపోయాడు.

తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చాడు. అయినా ఆ బ్లాక్ మెయిలర్ పదే పదే డబ్బులు అడిగే సరికి.. ఏం చేయాలో తోచక డిప్రెషన్‌లో పడిపోయాడు. ఇంట్లో అతని తల్లిదండ్రులకు తన సమస్య గురించి చెప్పుకోలేకపోయాడు. ఒకరోజు ఆ బ్లాక్ మెయిలర్ అమ్మాయి వెంటనే డబ్బులు పంపించమని.. అడిగితే.. తన వద్ద లేవని.. ఇక తాను ఆత్మహత్య చేసుకుంటానని జోర్డన్ చెప్పాడు. దానికి ఆ బ్లాక్ మెయిలర్.. ముందు ఆ పని చేయి. అని చెప్పింది. అంతే ఆ రోజు రాత్రి జోర్డన్ suicide చేసుకున్నాడు.

జోర్డన్ చనిపోయిన తరువాత అతని కేసుని పోలీసులు విచారణ చేశారు. జోర్డన్‌తో ఇన్ని రోజులు ఒక అమ్మాయి లాగా బ్లాక్ మెయిల్ చేసింది.. నైజిరియా దేశానికి చెందిన samuel అనే వ్యక్తి అని తెలిసింది. వీటితో పాటు సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయడం.. అవమానకర కామెంట్స్ పెట్టడం లాంటి బుల్లియింగ్, హరాస్ మెంట్ ఘటనలు కూడా జరుగుతున్నాయి.

జోర్డన్ లాగా ఎన్నో ఆన్ లైన్ వేధింపుల కేసులపై అమెరికా FBI సంస్థ Investigation చేసింది. 2022లో సోషల్ మీడియా ద్వారా sextortionకు గురైన వారి అధికారిక సంఖ్య 7000. కేవలం ఒక సంవత్సరంలో 20 మంది టీనేజర్లు ఆన్ లైన్ sextortion వల్ల చనిపోయారని తెలిసింది. కానీ FBI అధికారుల ప్రకారం లక్షకు పైగా sextortion బాధితులు ఉండవచ్చని.. వారంతా బయటకి చెప్పడంలేదని అన్నారు.

సోషల్ మీడియా వల్లే ఎక్కువ శాతం టీనేజర్ల depression గురై suicide చేసుకుంటున్నారని అమెరికాకు చెందిన Association for Psychological Science చేసిన సర్వేలో తేలింది. 2010 నుంచి 2015 మధ్య అన్ లైన్ social media ట్రెండ్ విపరీతంగా నడిచింది.. ఈ సమయంలోనే ఇలాంటి కేసులు ఎన్నో రెట్లు పెరిగాయని ఈ సర్వేలో తెలిసింది. ఈ సర్వే ప్రకారం.. టీనేజర్లు రోజుకు రెండు గంటలకు పైగా తమ స్మార్ట్ ఫోన్‌లో సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు.

అందుకే ఈ విషయంలో అమెరికా పార్లమెంటులోని సేనేట్ జుడిషియరీ కమిటీ.. సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల ఓనర్లు, ఉన్నతాధికారులను పిలిచి మరీ క్లాస్ పీకారు. ఈ విచారణలో ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రులను కూడా పిలిచారు.

ఈ విచారణలో ఏం జరిగింది?.. .సోషల్ మీడియా కంపెనీలపై ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి?.. ఈ విచారణ వల్ల సామాన్యులపై ఎటువంటి ప్రభావం ఉండొచ్చు? అనేది చూద్దాం.

ముందుగా ఈ విచారణలో ఏ ఏ కంపెనీలు పాల్గొన్నాయో చూద్దాం.

META – మెటా

మెటా– ఇది Facebook, whatsapp and Instagramలకు పేరేంట్ కంపెనీ — 2004లో ప్రారంభమైన Facebook 2012లో ప్రపంచలోనే అతిపెద్ద సోషల్ మీడియా Platformగా ఎదిగింది.
అదే సంవత్సరం.. Facebook.. మరో Image sharing social media tech.. Instagramని కొనేసింది. అది కూడా 100 కోట్ల డాలర్లకు మాత్రమే. అంటే 8300 కోట్ల రూపాయలు.
అలాగే 2014లో Facebook.. మరో సోషల్ మీడియా కంపెనీ whatsappని 19 మిలియన్ డాలర్లకు కొనేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక లక్ష 60 కోట్ల రూపాయలు.

కానీ 2018లో Facebook గురించి cambridge analytica scandal బయటికి వచ్చింది. ఈ scandalలో Facebook తన userల private informationని వారి అనుమతి లేకుండా రాజకీయాల కోసం వినియోగిస్తోందని తెలిసింది. ఈ scandal వల్ల Facebook brand imageకు పెద్ద దెబ్బపడింది. ఆ సమయంలో data privacy గురించి పెద్ద చర్చ కూడా నడిచింది.

ఆ తరువాత facebook.. fake newsని spread చేస్తోందని.. facebook వల్ల పిల్లలకు safety లేకుండా పోతోందని ఆరోపణలు వచ్చాయి.

2021లో facebook కంపెనీ rebranding చేసింది. Meta అనే పెద brand స‌ృష్టించి.. facebook, whatsapp, Instagram కంపెనీలు ఈ Meta groupగా మారిపోయాయి.

ప్రపంచం మొత్తంలో ప్రస్తుతం 300 కోట్ల మంది Meta కంపెనీ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు. ఈ కంపెనీ అతిపెద్ద మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి.

Meta ప్రస్తుత CEO Mark Zuckerberg.

——————-

ఇక తరువాత కంపెనీ X (ఎక్స్) అంటే Twitter.

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌ని.. అక్టోబర్ 2022లో ప్రముఖ అమెరికన్ బిలియనీర్ Elon Musk 3లక్షల 60 వేల కోట్లకు కొన్నారు. ఆ తరువాత ట్విట్టర్ పేరుని ఆయన ‘X’అని మార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 55 కోట్ల యూజర్స్ ఉన్నారు. ట్విట్టర్‌ యూజర్స్ అత్యధికంగా అమెరికాలో ఉన్నారు. ట్విట్టర్‌ ఉపయోగించడంలో భారత్ మూడో స్థానంలో ఉంది.

ప్రస్తుతం ‘X’ CEOగా Linda Yaccarino(లిండా యాకారినో) ఉన్నారు.


సోషల్ మీడియా కంపెనీ నెంబర్ 3 — టిక్ టాక్

టిక్ టాక్ అనేది byte dance అనే కంపెనీకి ఒక branch లాంటిది. 2016లో ప్రారంభమైన టిక్ టాక్.. ఒక short video platform. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది టిక్ టాక్ యూజర్స్ ఉన్నారు. భారత్‌లో కూడా టిక్ టాక్ చాలా ఫేమస్.. కానీ 2022లో భారత ప్రభుత్వం టిక్ టాక్‌ని బ్యాన్ చేసింది. టిక్ టాక్‌.. భారత users informationని చైనాలో లీక్ చేస్తోందనే ఆరోపణలు రావడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూడా అమెరికా సహా కొన్ని యూరోప్ దేశాలలో టిక్ టాక్‌ని బ్యాన్ చేయాలనే వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం టిక్ టాక్‌ CEOగా Shau Xi Chew ఉన్నారు.


కంపెనీ నెంబర్ 4 — SNAP

ఇది PHOTO SHARING APP SNAPCHATకు పేరెంట్ కంపెనీ. 2011 సెప్టెంబర్‌లో దీని ప్రారంభం జరిగింది.

SNAP CEO పేరు EWAN SPIEGEL.


కంపెనీ నెంబర్ 5 — DISCORD

DISCORD ఒక Instant Messaging Platform.. Whatsapp లాంటిదే.

అమెరికాలో చాలామంది ఇది ఉపయోగిస్తున్నారు. DISCORD ceoగా Jason Citron ఉన్నారు.


So ఈ కంపెనీల CEO లను అమెరికన్ ఎంపీలు ఎందుకు పిలిపించారో చర్చిద్దాం.

ఈ సోషల్ మీడియా కంపెనీలన్నీ.. పిల్లలకు చాలా ప్రమాదకరంగా మరాయని.. వీటి ఉపయోగం లైంగిక, మానసిక వేధింపులు, Human traficking కోసం జరుగుతోందని.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కంపెనీలు ప్రయత్నించడం లేదని.. అమెరికన్ సెనేట్ కమిటీ ఆరోపణలు చేసింది.

అంతేకాదు చాలా సార్లు కంపెనీ లాభాల కోసం పిల్లల భద్రతను పట్టించుకోలేదని స్వయంగా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు చెప్పారు.

కొంతమంది పిల్లలు డిప్రెషన్‌తో బాధపడుతుండగా.. మరికొందరు టీనేజర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి బాధితుల కుటుంబాలు సోషల్ మీడియా కంపెనీలపై కేసులు పెట్టారు. తగిన పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అందుకే అమెరికాలో kids online safety అనే చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ప్రభుత్వం.. సోషల్ మీడియా కంపెనీ ప్రతినిధులను పిలిచి.. ఈ విషయంపై సీరియస్ అయింది.

దీనిపై సోషల్ మీడియా కంపెనీలు స్పందిస్తూ.. Parental control, Warning లాంటి features add చేశామని చెప్పాయి. ముఖ్యంగా meta CEO మాట్లాడుతూ.. Instagram, Facebook Messenger appలపై టీనేజర్లకు పరిచయం లేని వ్యక్తులు మెసేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే content moderation కోసం Staff సంఖ్య పెంచామని చెప్పారు.

కానీ వారెంత చెప్పినా.. ఒక అమెరికన్ సెనేటర్ Lindsay Graham తన కోపాన్ని ఆపోకోలేకపోయారు. Meta, Tiktok కంపెనీ CEOలపై విరుచుకుపడ్డారు. ‘మీరందరూ సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులను ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేవలం లాభాలు మాత్రమే చూసుకుంటున్నారు.. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అని అందరిముందు చాలా కోపంగా ప్రశ్నించారు.

ప్రత్యేకంగా Meta CEO Zuckerbergపై మండిపడ్డారు. ”చనిపోయిన పిల్లల రక్తం మీ చేతులకు అంటుకుంది మిస్టర్ జకర్ బర్గ్‌.. మీ వ్యాపారం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి” అని అన్నారు.

”మిమ్మల్ని శిక్షించేందుకు ఎటువంటి చట్టాలు లేవు?.. మీ కంపెనీలకు వ్యతిరేకంగా complaint చేయడానికి ఏ కమిటీలు లేవు? ఏ కోర్టుల్లో మీపై కేసులు పెట్టినా నిలబడవు? ఇలాంటి పరిస్థితి ఇకముందు ఉండదు. దీనికి ముగింపు ఉండాలి. పిల్లలు పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి చట్టాలు తీసుకువస్తాం. మీరు ఇకముందు తప్పించుకోలేరు. ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాల్సిందే. ” అని Graham ఆగ్రహంగా మాట్లాడారు.

మరో సెనేటర్ Josh Hawley కూడా తీవ్ర స్వరంతో Zuckerbergపై మండిపడ్డారు. “మీరు మీ వ్యాపారంతో లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మీ కంపెనీ వల్ల జరిగిన నష్టానికి మీరు బాధ్యత వహించాల్సిందే. పిల్లలు చనిపోతే ఆ కుటుంబాల కోసం మీరేం చేశారు. వారిని అసలు పట్టించుకోలేదు. వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. మీరు ఈ రోజు ఆ పనిచేయాలి.. తప్పకుండా చేసి తీరాలి. మిస్టర్ Zuckerberg” అని అన్నారు.

సెనేటర్ల వేడి వేడి మాటలకు భయంతో Zuckerberg నీళ్లు నమిలిన దృశ్యాలు కూడా కనిపించాయి.

ఈ విచారణ సమయంలో క్రిస్టన్ బ్రైడ్(Kristen Bride) అనే మహిళ కూడా మాట్లాడారు. సోషల్ మీడియా వేధింపుల వల్ల ఆమె 16 ఏళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. SNAP CHAT అనుబంధ యాప్ YOLO వల్లే తన కొడుకు చనిపోయాడని ఆమె చెప్పారు. ప్రజల ప్రాణాలకు భద్రత విషయంలో ఈ కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని.. కేవలం డబ్బుల సంపాదనకే ప్రాముఖ్యం ఇస్తున్నాయని ఆమె అన్నారు.

దీనిపై సోషల్ మీడియా కంపెనీలు సమాధానమేంటో ఒకసారి చూద్దాం..

ముందుగా Zuckerberg మాట్లాడుతూ.. చాలా టీనేజర్లు మా టెక్నాలజీని ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా బాధాకర ఘటనలు జరుగుతున్నాయి. వాళ్లకు ప్రమాదం కలిగించేవారి నుంచి రక్షణ కోసం మేము పిల్లలకు వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ టీనేజర్లకు Online safety ఇవ్వడం అంత easy కాదు. చాలా మంది criminals కొత్త కొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అందుకు తగ్గట్టుగా మేము కూడా వారిని అన్ని విధాలుగా అడ్డుకునేందుకు కొత్త పద్దతులు అనుసరిస్తాం,” అని అన్నారు.

మరోవైపు ట్విట్టర్ X CEO మాట్లాడుతూ.. FREEDOM OF SPEECHతో పాటు PLATFORM SAFETY కూడా చాలా IMPORTANT అన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకునేందుకు X సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ విషయంపై TikTok CEO స్పందిస్తూ.. “నాకు ముగ్గురు పిల్లలున్నారు. ఈ సమస్యల గురించి వింటుంటేనే చాలా భయంగా ఉంది. తల్లిదండ్రుల బాధేంటో నేను అర్థం చేసుకోగలను.”అని అన్నారు.

ఈ అంశంపై అమెరికాలోని ఒహాయో రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చింది. సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని భావించిన ఒహాయో ప్రభుత్వం 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించాలంటే.. తల్లిదండ్రుల పర్యవేక్షణ అంటే parental control తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ చట్టాలు సోషల్ మీడియా కంపెనీలు తప్పు చేస్తే.. వాటిని శిక్షించేందుకు సరిపోవు.

దీంతో సోషల్ మీడియా కంపెనీలపైన కేసులు నమోదు అయినా.. వాటిపై చర్యలు తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోందని నిపుణలు చెబుతున్నారు.

అందుకే దేశ వ్యాప్తంగా అన్ లైన్ వేధింపుల నేరాలను అరికట్టేందుకు అమెరికాలో కొత్త చట్టాలు రాబోతున్నాయి.

భారతదేశంలో కూడా ఇలాంటి అన్ లైన్ మోసాలు, వేధింపులు జరుగుతున్నాయి. కానీ సెక్స్‌టార్షన్ గురించి ప్రజలు బయటికొచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. బాధితులు స్వచ్ఛందగా వచ్చి మాట్లాడితేనే సమాధానం దొరుకుతుంది. సోషల్ మీడియాలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల బాధపడుతూ.. ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. విషయం suicide వరకు చేరుకుంటోంది.

ఈ సమస్యలన్నింటికీ ఒకటే సమాధానం.. పిల్లలు ఏ కష్టం వచ్చినా భయపడకుండా, సిగ్గుపడకుండా తల్లిదండ్రులతో.. మాట్లాడే వాతావరణం కలిగించడం. జీవితంలో ఏదైనా సాధించలేకపోతే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి అని వాళ్లకి చెప్పాలి.

సోషల్ మీడియా కంటే జీవితం చాలా పెద్దది.. అందుకే Last Option suicide ఏ మాత్రం కాదు.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×