EPAPER
Kirrak Couples Episode 1

Alexander the Great : టాప్ 2. అల్గెజాండర్ ది గ్రేట్

Alexander the Great : అల్గెజాండర్ గురించి తెలియని వారుండరు. ప్రపంచాన్నే జయించాలని జీవితమంతా యుద్ధాలు చేసినవాడు అల్గెజాండర్. ప్రపంచాన్ని పూర్తిగా జయించకపోయినా అతనికి విశ్వవిజేత అని బిరుదు ఉంది. అల్గెజాండర్ క్రీస్తు పూర్వం గ్రీస్ దేశంలోని మెసిడోనియా నగరంలో 356 BCలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ 2 336 BCలో హత్య చేయబడడంతో 20 ఏళ్లకే అల్గెజాండర్ కిరీటం ధరించాడు. జీవితమంతా యుద్ధాలు చేసి తన విశాల సామ్రాజ్యన్ని పర్షియా నుంచి భారతదేశం వరకు విస్తరించాడు.

టీనేజర్‌గా ఉన్నప్పుడే అల్గెజాండర్ సైన్య శిక్షణ తీసుకొని యుద్ధ నైపుణ్యంలో ఆరితేరాడు. ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ వద్ద అల్గెజాండర్ విద్యను అభ్యసించాడు. మంచి నాయక లక్షణాలున్న అల్గెజాండర్.. ముందుగా గ్రీస్ దేశమంతా ఆక్రమించుకొని.. ఆ తరువాత పర్షియా(ప్రస్తత ఇరాన్, గల్ఫ్ దేశాల)పై దండెయాత్రకు వెళ్లాడు. ఏడాదిపాటు యుద్దం చేసి 333 BCలో పర్షియా రాజు డేరియస్ 2ని ఓడించాడు.

ఆ తరువాత శక్తివంతమైన అకేమినిడ్ సామ్రాజ్యంతో భీకర యుద్ధం చేశాడు. అకేమినిడ్ సామ్రాజ్యంలో ప్రస్తుత ఇరాన్‌లో కొంతభాగం, ఈజిప్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ ప్రాంతాలు ఉండేవి. ఆ వెంటనే బాల్కన్ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. చివరికి భారతదేశంలో యుద్ధం చేయాలని బయలుదేరిన అతడికి తన సైన్యంలోనే చాలా మంది వ్యతిరేకించారు. 8 ఏళ్లు సుదీర్ఘంగా యుద్ధాలు చేసి అలసిపోయామని చెప్పారు. దీంతో అల్గెజాండర్ భారతదేశం జయించిన తరువాత ఇంటికి వెళదామని చెప్పాడు. కానీ భారతదేశంలో విపరీతమైన వర్షాలు, మలేరియా, అడవుల మార్గం వలన అతని సైన్యం బలహీనపడిపోయింది. అయినా అల్గెజాండర్ ముందుకు వెళ్లి తక్షశిలా రాజ్యాంపై యుద్ధానికి వెళ్లాడు. కానీ తక్షశిల రాజు అంబి.. అల్గెజాండర్‌కి దాసోహమయ్యాడు.

ఆ తరువాత అంబి రాజుకు శత్రువైన పంజాబ్ రాజు పోరస్‌తో యుద్ధం చేశాడు. పోరస్ యుద్ధం ఓడిపోయినా.. అతని పోరాటపటిమకు అభినందించి అల్గెజాండర్ అతనికి తిరిగి రాజ్యం అప్పిగించాడు. ఆ తరువాత అల్గెజాండర్ మగధ సామ్రాజ్యంపై యుద్ధం చేయాలని భావించినా అతని సైన్యం ఇక చాలు.. యుద్ధం చేయలేమని అతనికి తేల్చి చెప్పారు. తిరుగుప్రయాణంలో అల్గెజాండర్ సైన్యంలో చాలామంది చనిపోయారు. ఆ తరువాత పర్షియాలో అతని ప్రతినిధి, స్నేహితుడు హెపేస్టియాన్ చనిపోవడంతో అల్గెజాండర్ ధైర్యం కోల్పోయాడు. తన స్వదేశం మెసిడోనియాలో క్రీస్తు పూర్వం 323 BCలో అనారోగ్యంతో అల్గెజాండర్ కన్నుమూశాడు.

టాప్ 1 పరాక్రమవంతుడు చెంగీస్ ఖాన్

క్లిక్ చేయండి

Related News

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్ట్‌కి కేంద్రం ఏం చెప్పబోతోంది?

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Big Stories

×