EPAPER

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Air India Flight Tricky Situation| మరో నాలుగున్నర గంటలు… ఆకాశ మేఘాల్లో తేలిపోతూ షార్జా చేరుకోడానికి పట్టే సమయాన్ని ఊహించుకుంటూ నూటా నలభై ఒక్క మంది ఫ్లైట్ ఎక్కారు. అయితే, ఆ విమానం షార్జా చేరుకోలేదు. దాదాపు 2 గంటలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి, మళ్లీ ఎక్కిన చోటే దింపేసింది. ఈ మధ్యలో విమానంలో ఉన్నవాళ్లంతా ప్రయాణం సంగతి తర్వాత ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. ప్లైట్‌లోనే కాదు యావత్ దేశం ఆ రెండు గంటలు ఏ జరుగుతుందో అనే టెన్షన్‌లో ఊపిరిపీల్చుకోవడం కూడా మర్చిపోయారు. ఇంతకీ, ఆ 2 గంటల 25 నిమిషాలు ఏం జరిగింది..? తిరుచురాపల్లి విమానాశ్రయంలో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ ఎందుకు షార్జా చేరుకోలేదు?


చాలా మందికి దక్కని అవకాశం నాకు దక్కింది.. షార్జాలో ఉద్యోగాన్ని తలుచుకుంటూ ఫ్లైట్ ఎక్కాడు ఓ యువకుడు. తమ పిల్లల్ని చూసి చాలా కాలం అవుతోంది.. ఎలా ఉన్నారో ఏంటో… అనుకుంటూ పెద్ద వయసున్న జంట భయం భయంగానే విమానం సీటులో కూర్చున్నారు. షార్జా భలే ఉంటుంది… అక్కడ టూరిస్ట్ స్పాట్‌లు అన్నీ కవర్ చేయాలి… చాలా షాపింగ్ చేయాలి అనుకుంటూ ఇంకొందరు. ఆకాశాన్ని తాకుతున్నామనే ఆశతో చిన్నపిల్లలు సంతోషాన్ని పట్టలేకపోతున్నారు. ఇక, ఫ్లైట్‌లో మొదటిసారి ప్రయాణిస్తున్న మరి కొంతమంది ఓవర్ ఎగ్జైట్‌మెంట్‌‌తో ఫ్లైట్ జర్నీ ఊహించుకుంటున్నారు. ఆఫీస్ పనులనీ… ఇతరత్రా అవసరాల కోసం ఇంకొందరు ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా 141 మంది తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో బోర్డ్ అయి ఉన్నారు. వీరితో పాటు విమాన సిబ్బంది, కెప్టెన్, కో పైలెట్లు టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు ఎప్పుడూ చెప్పే మూగ సైగల జాగ్రత్తలు చెప్పేశారు. ఎవరికైనా ఇబ్బంది ఉందేమోనని అందర్నీ… ‘ఆర్ యూ కంఫర్టబుల్ మామ్’… ‘యూ నీడ్ ఎనీ హెల్ప్ సార్’… అనుకుంటూ తమ డ్యూటీని చేస్తున్నారు. ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్.. AXB 613 కాసేపట్లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది’ అనే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఫ్లేట్‌లో బోర్డైన ప్రయాణికులకు ఫోన్లు కాసేపు వాడొద్దనే విజ్ఞప్తి వచ్చింది.

Also Read: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!


రన్‌వే పైన నిదానంగా కదులుతూ… వేగం పెంచుకుంటుంది విమానం. అప్పటి వరకూ ఉన్న నిశబ్ధాన్ని బ్రేక్ చేస్తూ విమానం మోటార్ సౌండ్ చెవులకు హాయిగా వినిపించింది. కొందరు ఊపిరి బిగపట్టుకోగా… ఇంకొంత మంది హమ్మయ్యా మొత్తానికి బయలుదేరిందని అనుకున్నారు. సమయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలు… తిరుచురాపల్లి విమానాశ్రయం రన్‌వై పైన… బోయింగ్ 737-800 ఎయిర్ ఇండియా ఫ్లైట్ స్పీడ్ పెంచింది. మరో నాలుగున్నర గంటల్లో ఫ్లైట్ షార్జా చేరుకుంటుందని అంతా అనుకుంటున్నారు. రన్‌వే పై నుండి మసకబారుతున్న ఆకాశంలోకి ఎగిరింది. అంతా బానే ఉంది అనుకున్న టైమ్‌లో… అనుకోకుండా ఓ ప్రమాద హెచ్చరిక…. కెప్టెన్‌కు ఒక్క నిమిషం గుండె జారినంత పనయ్యింది. హఠాత్తుగా 141 మంది ప్రాణాలు కళ్లముందు కదిలాయి.

గాలిలో వేలాడుతున్న విమానంలో ఎమర్జెన్సీ పరిస్థితి. కిందకి దించడానికి లేదు… షార్జా చేరుకోడానికి లేదూ… ఏం చేయాలో అంతుబట్టని పరిస్థితి. విమానంలో ఎవ్వరికీ ఏం తెలియదు. అందరి ఊహల్లో షార్జా ఆలోచనలే నిండిపోయాయి. కానీ, సెకన్లు గడుస్తున్న కొద్దీ కెప్టెన్ గుండె పదింతల వేగం పెరుగుతోంది. విమాన సిబ్బంది ఒకొక్కరి చెవికీ ఈ వార్త చేరుతోంది. విన్నవారి కళ్లలో భయం స్పష్టంగా తెలుస్తోంది… ప్రాణాలు గుప్పెట్లోకి వచ్చాయి. క్షణం గడపడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. చేసేదేమీ లేదు. ప్రాణాలు దక్కే ఛాన్స్ చాలా తక్కువ. ఆశ పెట్టుకోవడం తప్ప ఇంకెలాంటి ఆధారం లేదు. విమానం గాల్లో చెక్కర్లు కొడుతోంది. ప్రయాణికులకు ఏం అర్థం కాలేదు. సిబ్బంది చెబుతుంది నిజమేనా? హైజాక్ అయ్యిందా…? టెక్నికల్ సమస్యా…? ఆకాశంలో ఎటు చూసినా మేఘాలు, చీకటి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ, సిబ్బందికి తెలుసు. ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఒక్క కెప్టెన్ మాత్రమే. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్ కూడా చేసేది ఏమీ లేదు. వెంటనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అసలేం జరుగుతోంది…? అందరి, కళ్లల్లో కనిపిస్తున్న ప్రశ్న…!

తమిళనాడులోని తిరుచురాపల్లి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లోని షార్జా సిటీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 737-800 విమానంలో సరిచేయలేని సాంకేతిక సమస్య వచ్చింది. గాలిలోకి ఎగిరిన తర్వాత, ల్యాండింగ్ గేర్ సాధారణంగానే ముడుచుకుంది. ల్యాండింగ్ గేర్‌గా చెప్పే అండర్ క్యారేజీని సక్సెస్ ఫుల్‌గానే ఉంచిన తర్వాత… సిస్టమ్‌లో లోపాన్ని చెప్పే కాక్‌పిట్ మాస్టర్ హెచ్చరికలు పంపింది. ఏదో సమస్య వచ్చిందంటూ రెడ్ లైట్ వెలిగింది. అంటే…. అండర్‌క్యారేజీని నియంత్రించే హైడ్రాలిక్ సిస్టమ్ నుండి ఆయిల్ బయటకు లీకవుతుందని సెన్సార్‌లు గుర్తించాయి. మిగిలి విమానమంతా బాగానే ఉంది. సాధారణంగానే ప్రయాణిస్తుంది. అయితే, విమానాన్ని దించితే మాత్రం ఒక్కసారిగా పేలిపోవడం ఖాయం. ఒక్కసారిగా 140 మందికి పైగా మనుషుల ప్రాణాలు… ఊహించుకుంటేనే చెమటలు పట్టేంత ఉత్కంఠత మధ్య ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. ఏం చేయాలనే సలహాలు పెరుగుతున్నాయి. నిజానికి, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి బోయింగ్ 737-800 హైడ్రాలిక్ సిస్టమ్‌లో రిడెండెన్సీలు ఉంటాయి. అయితే, ఇప్పుడు అవి పనిచేయట్లేదు.

మరోవైపు, తిరుచురాపల్లి ఎయిర్ పోర్ట్‌లో అందరిలోనూ ఆందోళన పెరిగింది. హ్యాపీ జర్నీ అని చెప్పిన ప్రయాణికులు బంధువులంతా ఏం జరుగుతుందో తెలియక కంగారుపడుతున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌లు, 18 ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. పది మంది డాక్టర్లను సిద్ధం చేశారు. ఎటు చూసినా సైరన్ మోతలు భయాన్ని మరింత పెంచుతున్నాయి. రెడ్ లైట్ల మధ్య ఆ ప్రాంతమంతా డెంజర్ సిగ్నల్స్ ఇస్తోంది. నల్లని చీకటి ఎర్రగా మారింది. పోలీస్ బాస్‌లు, అధికారులు బూట్ల శబ్ధాలు గుండె వేగాన్ని పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గాలిలో తిరుగుతున్న విమానాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. రన్ వే మొత్తాన్నీ ఖాళీ చేయించారు. ఏ విమానం ఇక్కడ దిగకుండా హెచ్చరికలు జారీ అయ్యాయి. రన్ వే దగ్గర్లోని ఆయిల్ ట్యాంకర్లన్నింటినీ తరలించారు. విశాలమైన రన్ వే అంతా నిర్మానుషంగా మారింది. ఇక, విమానాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా తిరిగి ఎయిర్ పోర్టులో దించడం తప్ప వేరే దారి లేదు. అయితే, ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందంటే పేలిపోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ప్రమాదాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించే అన్ని ప్రయత్నాలు చేసేశారు. ఇక విమానాన్ని ఎలా దించాలి…? ఇది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.

Related News

Hindupuram Municipality Politics: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు

Nellore Nominated Posts: నెల్లూరు జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల టెన్షన్.. సెకండ్ లిస్టుపై కూటమి నేతల చూపులు.

Kadapa Land Grabbing: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

BJP BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తా? నో.. నెవర్, హైడ్రా ఏమీ కొత్తదేం కాదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి

Big Stories

×