EPAPER

Hitech City Land Issue: మళ్లీ తెరపైకి.. 35 వేల కోట్ల స్కాం

Hitech City Land Issue: మళ్లీ తెరపైకి.. 35 వేల కోట్ల స్కాం
  • 50 ఏండ్లుగా కొనసాగుతున్న సివిల్ వివాదం
  • సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్సెస్‌లో తాజాగా కేసు
  • నిందితుడిగా ఫోన్ ట్యాపర్ భుజంగరావు?
  • తాజా ఫిర్యాదుతో అనేక అనుమానాలు
  • గ్రీన్ కో అనిల్‌తో పాటు, మాజీ సెక్రెటరీ శ్రీనివాసరావుపై కేసు
  • భాగ్యనగర్ సొసైటీకి ఫ్రైం ప్రాపర్టీస్‌కి ఎంతో కాలంగా పంచాయితీ
  • కోర్టులో మగ్గుతున్న పదుల పిటిషన్స్
  • సివిల్ కోర్టు టు సుప్రీంకోర్టు వరకు తీర్పులు
  • భాగ్యనగర్ సొసైటీ భూముల కథపై స్వేచ్ఛ – బిగ్ టీవీ స్పెషల్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: (Hitech City Land Issue): హైటెక్ సిటీ దగ్గర భూమి అంటే హాట్ కేక్‌లాంటిది. ధర మామూలుగా ఉండదు. అలాంటి ఏరియాకు ఆనుకుని 340 ఎకరాల భూమి చుట్టూ ఎన్నో ఏళ్లుగా వివాదం సాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదటి కన్ను పడేది ఆ ఖాళీ ప్రదేశం పైనే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికోసం చేయని ప్రయత్నం లేదు. ప్రైం ప్రాపర్టీస్ గ్రీన్ కో కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది. అలా ఎలా చేస్తారంటూ భాగ్యనగర్ సొసైటీ సభ్యులతో పాటు, ఆ భూమి తమదంటూ కొందరు మీడియా ముందుకొచ్చారు. కోర్టుల్లో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఆగని కురుక్షేత్ర యుద్దంలా ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది. ఆ భూములను ఆశగా చూపించి ఎంతోమంది డబ్బులు సొమ్ము చేసుకున్నారు కానీ, పరిష్కారం చూపించలేకపోయారు. పేపర్‌పై ఒకలా, పొజిషన్‌లో మరోలా ఉండటంతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గజం 3 లక్షలు పలికే భూమి కావడంతో అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. తాజాగా సైబరాబాద్‌లో తన తండ్రిని చిత్రహింసలు పెట్టి పేపర్లు రాయించుకున్నారని మీర్ అబ్బాస్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో భాగ్యనగర్ సొసైటీ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రైమ్ ప్రాపర్టీస్ బాగోతాన్ని ఈ సోసైటీలో పనిచేసిన మాజీ సెక్రెటరీ పొన్నగంటి శ్రీనివాసరావు నడిపిస్తుండటం, గ్రీన్ కో కంపెనీ యజమాని అనిల్ కుమార్ పెట్టుబడులు పెట్టడంతో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉంది ఈ వ్యవహారం. తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పుడు మళ్లీ ఆ భూములు ఎవరికి దక్కుతాయి. ప్రభుత్వంలోని పెద్దలు లేదా సన్నిహితులు ఎవరు తల దూర్చారనే చర్చ జోరందుకుంది.

గత చరిత్ర ఇదే.. స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్స్‌క్లూజివ్


నిజాంకి సన్నిహిత కుటుంబం అయిన నవాబ్ రయిజ్ యార్ జంగ్ బహదూర్‌కు కూకట్ పల్లిలోని సర్వే నెంబర్, 806, 1007, 1009, 1043 నుంచి 1065 వరకు మొత్తం 1500 ఎకరాలు ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇతను 1960లో చనిపోయాడు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తైలు ఉండేవారు. 1963లో 1117 ఎకరాల భూమిని హౌజింగ్ బోర్డు రూ.7,64,000 నష్ట పరిహారం చెల్లించి సేకరించింది. సీలింగ్ యాక్ట్‌లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఫజలత్ హుస్సేన్ 69 ఎకరాలు, బషీర్ ఉన్నీసా బేగం 75 ఎకరాలు, ఫకర్ జహాబ్ బేగం 64 ఎకరాలు, షాజహాన్ బేగం 64, బిల్క్సూస్ బేగంకి 28 ఎకరాలు ఇచ్చినట్లు క్లైమ్ చేసుకున్నారు.

Also Read: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

విలువైన భూమిలో ప్రైమ్ ప్రాపర్టీస్ వాదన?

నవాబ్ సాహేబ్ కుమారుడు నవాబ్ మహ్మద్ అలీ సాహేబ్ అకస్మాత్తుగా చనిపోయాడు. తన మనవడైన హసీం అలీకి అప్పటికి రెండు సంవత్సరాలు. అతనికి భూమి చెందాలని నవాబ్ రయిజ్ యార్ జంగ్ బహదూర్‌కి వలి మహ్మద్ నుంచి సెల్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. అదే సంవత్సరం అయిన 1952లో గిఫ్ట్ డీడ్ రూపంలో హసీం అలీకి బదిలీ చేయడంతో పాటు, పాటెర్నల్ గార్డియన్‌గా కూడా ఉన్నాడు. హాసీం అలీ మేజర్ అయిన తర్వాత 1972లో సహారా రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి. అందుకు గాను 80 మందికి హిబ్బా(గిఫ్ట్) ఇస్తున్నట్లు వారంతా సహారా గ్రూప్‌లో డైరెక్టర్స్‌గా చేరినట్లు చూపించారు. 1973లో సిటీ సివిల్ కోర్టులో ఈ ఆస్తిని రాయించేలా ఒరిజినల్ సూట్ (ఓఎస్ నెంబర్ 122/1973) ఫైల్ చేశారు. ఇందులో తన వారసత్వంగా రావాల్సిన భూ సేకరణ నష్టపరిహారం ఇవ్వలేదని అంతా ఫజలత్ హుస్సేన్ కుటుంబం తీసుకుందని పిటిషనర్ వాదన. ఈ కేసుతో కుటుంబ సభ్యులంతా అంగీకారానికి వచ్చారు. సర్వే నెంబర్ 806లోని 43 ఎకరాలు, 1007లో 340 ఎకరాలు హాసీం అలీకి ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీటి విలువ మొత్తం ఆనాడు 4 లక్షలుగా తెలిపారు. వీటన్నింటిని సహారాలో హిబ్బాతో తీసుకుని ఇచ్చారు. అయితే ఒరిజినల్ హిబ్బాలు లేవు. సెల్ డీడ్స్ లేకపోవడంతో అసలు హసీం అలీ లేకుండానే ఈ భూములు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సీలింగ్ యాక్ట్ రాకుండా హిబ్బా ఇచ్చారు

మహ్మద్ ఆర్పిద్దీన్, మహ్మద్ రషీదుద్దీన్, బేగం జైనబ్ షర్ఫీద్దీన్, అమీర్ మహ్మద్ ఖాన్, బేగం జహారా మహ్మద్ అలీ, బేగం కుల్సమ్ జైనీలబిద్దీన్, షేక్ అలీ, రెహ్మత్ బేగం హిబ్బా తీసుకున్నారు. 8 మందికి మనిషికి 49 ఎకరాల భూమి వచ్చేలా చేశారు. అంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కిందకు రాకుండా చేశారని ఆరోపణ. కొద్ది రోజులకే సహారా ప్రైం ప్రాపర్టీస్‌గా అంతా మారింది. ఆ తర్వాత డైరెక్టర్స్‌గా ఉన్న 8 మంది విత్ డ్రా అయ్యారు. ప్రైం ప్రాపర్టీస్ 1972లో డ్యాకుమెంట్లు సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సాధిక్ సయ్యద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి కీలకంగా మారినట్లు సమాచారం. 1972 నుంచి ఇప్పటి వరకు ప్రైం ప్రాపర్టీస్, హాసీం అలీ, హిబ్బా ఇచ్చిన వారి పేరుగాని రెవెన్యూ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఇలా 2004 తర్వాత తెరపైకి మాల్పాని, తేజో నారయణ్, దానం నాగేందర్, ఖాజీం అలీ, అవోపా సోసైటీ రవి ప్రసాద్, భాగ్యనగర్ సొసైటీ నుంచి పెద్దిరెడ్డి తన సోదరుడుతో పాటు ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఎంతోమంది ప్రముఖులకు అగ్రిమెంట్లు ఉన్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ సంపత్ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో దీనిపై రిపోర్టులు ఇచ్చారు. హైకోర్టు స్టేలు, సుప్రీంకోర్టు తీర్పులు, కింది కోర్టులో టైటిల్ డిసైడ్ చేసుకోవాలని ఎన్నో కేసులు ఉన్నాయి. కొంత మంది నకిలీ హసీం అలీని సృష్టించారని అతని కుమారుడే ఇప్పటి ఫిర్యాదుదారుడనే విమర్శలు ఉన్నాయి. ఇందులో సినీ నిర్మాత బుర్గులపల్లి శివరామకృష్ణ లాంటి వారి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. సుధాకర్ చారి, శైలజకు కూడా ఈ ప్రాపర్టీస్‌పై హక్కులు ఉన్నాయని పేపర్స్ చూపిస్తూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. భుజంగరావుపై కేసు నమోదు విషయంలో దర్యాప్తు లోతుగా చేస్తే అందరి పాత్ర బయటపడుతుంది.

ఇప్పుడు ఎందుకీ కేసులు

50 ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసుల్లో అనుకోకుండా ఏడేండ్ల క్రితం జరిగిన బెదిరింపుల కేసులో అప్పటి ఏసీపీ భుజంగరావుపై, ప్రైం ప్రాపర్టీస్‌తో పాటు అగ్రిమెంట్ చేసుకున్న గ్రీన్ కో కంపెనీపై కేసులు నమోదు అయ్యాయి. ఎవరో మరో బలమైన వ్యక్తి కన్ను ఈ భూములపై పడినట్లు అనుమానాలు వస్తున్నాయి. 2018లో కోర్టుకు అప్పటి ప్రభుత్వ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ అఫిడవిట్స్ ఇచ్చారు. ప్రైం ప్రాపర్టీస్‌కి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టు నుంచి సివిల్ కోర్టుకు టైటిల్ వివాదం చేరుకుంది. ఈ సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు కావడంతో 340 ఎకరాల వివాదంలో ప్రభుత్వ పెద్దలు ఎంట్రీ అయ్యారనే చర్చ జరుగుతోంది.

Related News

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Kejriwal Resign: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

Big Stories

×