Big Stories

KCR Reaction on Operation Akarsh : లీడర్లను లాగేస్తే గెలిచేస్తారా?.. కేసీఆర్ లాజిక్ మిస్సయ్యారా?

KCR Reaction on Operation Akarsh : టీఆర్ఎస్ ఫుల్ ఖుషీగా ఉంది. బీజేపీని దెబ్బకొట్టామని పండగ చేసుకుంటోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కమలదళంలో చేరినందుకు రివేంజ్ గా.. బీజేపీ నుంచి ముగ్గురు బడా నేతలను కారులోకి లాగేశారు గులాబీ బాస్. ఒక్క దెబ్బ కొడితే మూడు దెబ్బలు కొట్టామనే సంబరంలో ఉంది. కానీ…..

- Advertisement -

స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ లు బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరితే ఆ ప్రభావం మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుంది? ఆ ముగ్గురు నేతలను చూసి.. ఇప్పటికిప్పుడు మునుగోడు ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చేసుకుంటారా? వారి చేరికలు చూసి.. టీఆర్ఎస్ బలంగా ఉందని అనుకొని.. మునుగోడులో ఏకపక్ష తీర్పు ఇచ్చేస్తారా? స్వామి గౌడ్ కు చౌటుప్పల్ కు ఏం సంబంధం? శ్రవణ్ కు చండూరుకు లింక్ ఏంటి? జంపింగ్ జపాంగ్ ల ప్రభావం మునుగోడుపై ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు.

- Advertisement -

మునుగోడు ప్రజలు పక్కా క్లారిటీతో ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ ఇప్పటికీ అత్యంత బలంగా ఉంది. పైగా సిట్టింగ్ సీటు. పాల్వాయి స్రవంతి గెలుపును రేవంత్ రెడ్డి సవాల్ గా తీసుకున్నారు. స్థానికంగా మకాం వేసి.. ఫుల్ టైమ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. తన వాగ్దాటితో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ఇక, కాంగ్రెస్ ని వీడి, ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేయలేదనే చర్చ నడుస్తోంది. 18వేల కోట్ల ప్యాకేజీ కోసమే ఆయన బీజేపీలో చేరారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, అభిమానగణం భారీగా ఉన్న నేత కావడంతో.. వారంతా మళ్లీ తనకే ఓటు వేస్తారనే ధీమా ఆయనది. కానీ, గతంలో ఓటు వేసిన వారంతా మళ్లీ రాజగోపాల్ రెడ్డికే ఓటు వేస్తారనే గ్యారంటీ ఉండకపోవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఓటు బ్యాంక్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోవడం ఖాయం..అంటున్నారు.

ఇక, ఏ ఉప ఎన్నిక వచ్చినా ఓడిపోవడం టీఆర్ఎస్ కు ఇటీవల రివాజుగా మారింది. దుబ్బాక, హుజూరాబాద్ లో ఘోర అవమానం ఎదురైంది. గులాబీ పార్టీని బండకేసి కొట్టారు ఓటర్లు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు ఇది నిదర్శనం అంటున్నారు. మునుగోడులోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నారు. ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన అధికార పార్టీ.. పూర్తి స్థాయిలో తన బలగాన్ని మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఊరూరా దావత్ లతో ఊదరగొడుతోంది. మునుగోడులో మందు, విందు, డబ్బు.. ఏరులై పారుతోంది. అయినా, గెలుస్తామనే నమ్మకం కలగకపోవడంతో.. ఇప్పుడిలా పార్టీ ఫిరాయింపులతో తమదే బలమైన పార్టీ అని అనిపించేలా.. వాపును బలుపుగా చూపిస్తోందనేది విపక్షాల విమర్శ.

బూర నర్సయ్య గౌడ్ తో జరిగే నష్టాన్ని స్వామి గౌడ్ తో భర్తీ చేయాలనే ఆలోచన కావచ్చు. అయితే, ప్రగతి భవన్ లో గులాబీ కండువ కప్పుకున్న స్వామి గౌడ్ ను చూసి.. మునుగోడులోని గౌడ్స్ అంతా కారు గుర్తుకే ఓటేస్తారని ఎలా అనుకున్నారు? దాసోజు చేరిక మునుగోడు ఎన్నికను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇంత చిన్న లాజిక్ ను కేసీఆర్ ఎలా మిస్ అయ్యారు? అంటున్నారు విశ్లేషకులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News