EPAPER

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..
modi jagan

YSRCP: ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆమె పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ అధికార వైసీపీని ఏకిపారేస్తున్నారు. అవినీతి పాలనంటూ, అరాచక నేతలంటూ, రాష్ట్రం అధో:గతి అంటూ మాటల తూటాలు వదులుతున్నారు. అంతకుముందు బీజేసీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా లాంటి వాళ్లు ఏపీకి వచ్చి మరీ.. సభలు పెట్టి.. జగన్‌ను తిట్టి వెళ్లారు. అవినీతి పాలన అంతుచూస్తామని హెచ్చరించారు. వారి వార్నింగులపై సీఎం జగన్ సైతం రియాక్ట్ అయ్యారు. మీ జగనన్నకు ఎవరి సపోర్ట్ ఉండదని.. ఒంటరిగానే గెలుస్తానంటూ ఛాలెంజ్ చేశారు.


అప్పటినుంచి వైసీపీ వర్సెస్ బీజేపీ పోరు జోరుగా సాగుతుందని అనుకున్నారంతా. పురందేశ్వరి సైతం గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ, వైసీపీ నుంచి మాత్రం అటాక్ ఆగిపోయింది. దాడి కాదు కదా.. ఢిల్లీలో అడక్కుండానే మద్దతు కూడా ఇస్తున్నారు. తాజాగా లోక్‌సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నందున అవిశ్వాస తీర్మానానికి విలువ లేదన్నారు వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి. మణిపూర్‌లో జరిగిన ఘటనలు అత్యంత బాధాకరమని.. వీలైనంత త్వరగా ప్రజా శాంతిస్థాపన జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో కోరారు.

వైసీపీ తీరుతో.. బీజేపీతో బయటికి పోరాటం.. లోలోన ఆరాటం అన్నట్టు ఉందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలొచ్చి ఉత్తిత్తిగా తిట్టేసి వెళ్లిపోయారని.. ఎలక్షన్ సీజన్ కాబట్టి అలాంటి మాటలు కామనేనని అంటున్నారు. బీజేపీకి జనసేనతో పొత్తు ఉండటం.. టీడీపీనీ జట్టులో చేర్చుకోవాలని జనసేనాని ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీ ఉలిక్కిపడుతోంది. అందుకే, మేమున్నాక మళ్లీ టీడీపీ ఎందుకు అనేలా.. బీజేపీకి అడక్కుండానే పార్లమెంట్‌లో సపోర్ట్ చేస్తోందని చెబుతున్నారు. ఏపీలోని అన్నిపార్టీలూ బీజేపీకే జై కొడుతుండటం ఆసక్తికర రాజకీయం.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×