EPAPER

YSRCP Social Media: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే

YSRCP Social Media: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే

చిత్తూరు జిల్లాలో ఓ మైనార్ బాలిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ సోషల్ మీడియా పరువును బజారున పడేశాయి.. వైసీపీ నేతలు అందరూ రేప్ జరిగిందంటూ ఆందోళన బాట పడితే… తన కుమార్తె పై ఎలాంటి హత్యాచారం జరగలేదని.. అసత్య ప్రచారం చేయకండని మైనర్ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు .. మైనర్ బాలికపై ఎలాంటి హత్యాచారం జరగలేదని నిర్ధారించారు రుయా మెటర్నటి ఆసుపత్రి వైద్యులు.. ఇక రేప్ జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతామంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎస్పీ సుబ్బారాయుడు…

చంద్రగిరి నియోజకవర్గ ఎర్రవారిపాలెంలో ఓ మైనర్ బాలికపై హత్యాచారం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి సహా ఇతర నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో గందరగోళం నెలకుంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం లో స్కూల్ నుంచి వస్తున్న క్రమంలో మైనర్ బాలికపై ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. బాలిక చికిత్స పొందుతున్న మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైసిపి నేతల ఆందోళనతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అయితే ఘటనపై మైనర్‌ బాలిక తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. తన కుమార్తె పై ఎలాంటి అత్యాచారం జరగలేదని కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


తన కుమార్తెను కొంతమంది ప్రేమ పేరుతో వేధించాలని చూసారని, సమయానికి కొందరు వచ్చి ఆమెను రక్షించారని ఆయన వివరించారు .వెంటనే ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశామని, ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, తప్పుడు వార్తలు రాసి తమ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయొద్దని ఆయన వేడుకున్నారు. ఇక జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సైతం మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ పొలిటికల్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అలాంటి వారి మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పాపపై అత్యాచారం జరగకుండానే కొన్ని పొలిటికల్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, పోలీసులు, పాప తండ్రి సైతం ఎక్కడా అత్యాచారం జరిగిందని చెప్పలేదని, అయినా సరే జరిగినట్లు కొందరు చెప్పడం నేరమని ఎస్పీ హెచ్చరించారు. అయితే ఎర్రావారిపాలెం ఘటనలో నిజాలు బయటకు రాకుండా సీఎం చంద్రబాబు, లోకేశ్ తిరుపతి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని రోజా ఆరోపించారు. అత్యాచారం విషయం బయటకు రాకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే వైసిపి నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని‌‌‌. బాలిక పై అత్యాచారం జరగకపోయినా వైసిపి నేతలు పబ్లిసిటీ కోసం లేనిపోని అసత్య ప్రచారాలు చేశారన్నారు.చెవిరెడ్డి అపరిచితుడిలా ఒక మైనర్ బాలిక అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని కనీసం కనికరం లేకుండా వైసిపి సోషల్ మీడియాతో బాలికపై లేనిపోని ప్రచారాలు చేశారని ఫైర్ అయ్యారు.

Also Read: అంతర్మథనంలో వైసీపీ.. పార్టీ వీడుతున్న సీనియర్లు.. సైలెంట్ గా జగన్.. వాట్ నెక్స్ట్?

ఈ యావత్తు ఉదంతం చూస్తూ వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా పార్టీ మాజీలు రోడ్డెక్కడం, దాన్ని తమ సోషల్ మీడియా ఎక్స్‌పోజ్ చేయడంతో పార్టీకి ఉన్న కాస్త పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడో వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరగగా.. అదంతా జగన్ పనే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దానిపై వైఎస్ విజయమ్మ స్పందించినట్లు ఒక లెటర్ వెలుగు చూసింది. అందుో ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా తన కుమారుడు జగనే ఆ పని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఆ లెటర్‌పై టీడీపీ స్పందించింది. వైఎస్ విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ చేసింది. విజయమ్మ సంతకం కూడా వైసీపీ వాళ్లే పెట్టి విడుదల చేశారని టీడీపీ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం షర్మిల రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి.. ఇప్పుడు విడుదలైన లేఖలో సంతకానికి ఏ మాత్రం పొంతన లేదని విమర్శించింది. నిజానిజాలు విచారిస్తే
కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ రాసినట్లు చెప్తున్న లేఖ ఫేక్‌దని తేలింది. కాసేపటికి అది ఫేక్ లెటర్ అని తెలుసుకుని నాలుక్కర్చుకుని పోస్ట్ ను డిలీట్ చేసిన వైసీపీ పరువు పోగొట్టుకుంది

ఎర్రావారిపాలెంలో బాలికపై అత్యాచారం అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టులు పెట్టి నానా హడావుడి చేశారు. అదంతా నిజమే అనుకుని ప్రభుత్వాన్ని తిడుతూ వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టాయి. చివరికి అక్కడ అసలు అత్యాచారమే జరగలేదని తేలింది. ఈ ఎపిసోడ్లు చూసతూ వైసీపీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఫేక్ వార్తలను క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు పోగొట్టుకుంటున్నామని లబోదిబో మంటున్నారు

గతంలో సోషల్ మీడియాకు ఇన్ చార్జ్ గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తాలేకుండా పోయారు. జగనే అతన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించారన్న ప్రచారం జరుగుతుంది. మరి ఆయన స్థానంలో ఎవర్నైనా నియమించారో? లేదో? ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదంట. ఆ క్రమంలో అసలు వైసీపీ సోషల్ మీడియాకు ఇన్ చార్జ్ ఉన్నాడా లేడా అని వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది.

 

Related News

BRS Leaders on KTR: నువ్వు చెప్తే వినాలా? కేటీఆర్‌కి మాజీ ఎమ్మెల్యేల ఝలక్

Penukonda Politics: చంద్రబాబుకి తలనొప్పిగా మామా కోడళ్ల పంచాయితీ

Vemireddy Prabhakar Reddy: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Big Stories

×