తెలుగు దేశం పార్టీ నేతలపై, మరికొంత మంది వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్‌సీపీ కి సంబంధించిన వ్యక్తులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతోంది. తాజాగా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయంలో జగన్‌ను విమర్శించిన టీడీపీ నాయకులపైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారు. అంతేకాదు వివేకా హత్య కేసులో జగన్‌పైన, అవినాష్‌పైన ఎలక్షన్ టైమ్‌లో విమర్శలు చేసిన, షర్మిల, సునీతలపైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే.. చాలు ఏది చేయడానికైన సిద్ధమే అనేలా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో రవీందర్ రెడ్డి పోస్టులకు మనస్థాపానికు గురైన షర్మిల, సునీత, విజయమ్మ కలిసి ఇతనిపై గతంలోనే హైదారాబాద్, విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
Also Read: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే
ఇక తాజాగా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితలపై గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రవీందర్ రెడ్డి అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రవీందర్ రెడ్డిని బుధవారం సాయంత్రం పులివెందులో అరెస్ట్ చేసి, అతన్ని కడప పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతానికి కడపలో ఉన్న అతన్ని అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కి తీసుకొస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా అతనికి హెచ్చరికలు జారీ చేసింది.