EPAPER

YSRCP Politics: సొంత పార్టీలోనే బాలినేనికి వ్యతిరేకత.. వైసీపీ ఇరుకు పడుతుందా ?

YSRCP Politics: సొంత పార్టీలోనే బాలినేనికి వ్యతిరేకత.. వైసీపీ ఇరుకు పడుతుందా ?

YSRCP Politics: ఆయన వైసీపీలో సీనియర్ నేత.. సీఎం జగన్ కి దగ్గరి బంధువు .. మాజీ మంత్రిగా ఉన్న ఆయనకి సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురవుతోందా .. అంటే అవుననే సమాదానాలు వినపడుతున్నాయి.. గతంలో ఉమ్మడి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే చట్టంగా పార్టీలో హవా సాగింది. కానీ ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీఎం జగన్ ఆయనకి సహకరించడం లేదని తెగ ఫీలైపోతున్నారు. ప్రస్టేషన్ లో ఉన్న ఆ మాజీ మంత్రి చేస్తున్న పనులు కూడా వైసీపీని ఇరుకునపెడుతున్నాయి. ఎవరా మాజీ మంత్రి.


మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపి పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారారు. సీఎం జగన్ కి సమీప బంధువే అయినా.. వైసీపీలో అసంతృప్తి నేతగా బాలినేనికి ముద్రపడింది. వైసీపీ ఆవిర్భావం నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్నా.. సీఎం జగన్ షాక్ ఇవ్వడం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయింది. ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉంటే.. బాలినేనిని పక్కనపెట్టి ఆదిమూలపు సురేష్‌ని మంత్రిగా కొనసాగించారు.. సీఎం జగన్. అప్పటి నుంచి వైసీపీలో బాలినేని ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన తరువాత వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా బాలినేనికి పదవి కట్టబెట్టినా.. ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతల నుండి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించడం, ఆయనకు అసంతృప్తి కలిగించింది. సొంత జిల్లాపై పెత్తనం లేకుండా.. పక్క జిల్లాల రాజకీయాలతో తనకేం సంబంధం అంటూ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు.

ఇప్పటికే జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చిన జగన్‌.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను ఖారారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే గిద్దలూరు లేదా మార్కాపురం చూసుకోవాలని బాలినేనికి సీఎం జగన్ ఆప్షన్ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం సూచనలను బాలినేని ఒప్పుకొవటం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటి చేస్తానని బాలినేని తేల్చి చెప్పారని సమాచారం. టీడీపీ, జనసేన పొత్తులో ఒంగోలు నుంచి బాలినేని గెలుపు కష్టమని సర్వే రిపోర్ట్స్ రావడంతో.. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని బాలినేనికి వైసీపీ అధిష్టానం సంకేతాలు పంపినట్లు సమాచారం. తాను ఒంగోలు నుంచి బయటి నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తే.. తన తనయుడికి టికెట్‌ ఇవ్వాలని బాలినేని షరతు పెట్టినట్లు సమాచారం. బాలినేని ప్రణీత్‌కు అద్దంకి సీట్ కావాలనీ బాలినేని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


గిద్దలూరు నుంచి బాలినేనిని, ఒంగోలు నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘువరావు లేదా చీరాల ఎమ్మెల్యే కరణం బాలరాంను లేదు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒంగోలులో కరణం బాలరాం బరిలోకి దిగితే.. టీడీపీకి గట్టి పోటీనివ్వడంతో పాటు.. కమ్మ సామాజిక ఓట్లు భారీగా వైసీపీకి పడే అవకాశం ఉందనేది జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. శిద్దా, బలరాం కాదంటే.. మద్దిశెట్టి వేణుగోపాల్‌ను ఒంగోలు బరిలో దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. అలాగైతే కాపు ఓట్లు చీలి.. జనసేన-టీడీపీ కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోందంటున్నారు. ఈ విషయాలనే జగన్ స్పష్టంగా చెప్పడంతో, పొలిటికల్‌గా ఎలా ముందుకు సాగాలనే టెన్షన్‌లో ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్.. బాలినేనిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనుగుణంగానే హైదరాబాద్‌లోని బాలినేని ఇంటికి విజయసాయిరెడ్డిని పంపించారు. అధిష్టానం ఆలోచనలను విజయసాయిరెడ్డి బాలినేని ముందు ప్రతిపాదించారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఒంగోలులో బాలినేని గెలుపు సాధ్యం కాదు కాబట్టి.. మరో నియోజకవర్గానికి వెళ్లాలని ఆయనకు సూచినట్లు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కారణంగా.. 2014 ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ ఓడిపోయిన విషయాన్ని కూడా బాలినేని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 2024లో గిద్దలూరు నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి బాలినేనికి చెప్పారని తెలుస్తోంది.

ఇప్పటికే ఒంగోలులో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన తనయుడుని ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీకి నిలుపాలని ప్లాన్ చేస్తున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతుంది. జిల్లాలో జరుగుతున్న చర్చలు, పార్టీ సూచనలపై బాలినేని కొన్ని షరతులను విజయసాయిరెడ్డికి చెప్పారని సమాచారం. గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తూనే.. వైవీ సుబ్బారెడ్డి తనయుడికి టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధినాయకత్వానికి బాలినేని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాపై వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఉండకూడదనే షరతులకు అంగీకరిస్తేనే.. పార్టీకి సహకరిస్తానని బాలినేని తెగేసి చెప్పారని సమాచారం.

బాలినేని కొత్త డిమాండ్లపై సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారోనని వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ప్రకాశం జిల్లా ఇంచార్జ్‌లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కి చేదోడుగా నిలిచిన బాలినేని.. వచ్చే ఎన్నికల్లో ఎలా అడుగులు వేస్తారని జిల్లాలో చర్చ జరుగుతోంది.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×