EPAPER

Supremecourt reject Ysrcp Petition: వైసీపీకి ఝలక్, జోక్యం చేసుకోమని చెప్పేసిన సుప్రీం..

Supremecourt reject Ysrcp Petition: వైసీపీకి ఝలక్, జోక్యం చేసుకోమని చెప్పేసిన సుప్రీం..

Supremecourt reject Ysrcp Petition: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు.


కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఆ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా వ్యక్తి పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఓట్లు చెల్లు బాటు అవుతాయన్నది అందులోని సారాంశం.

ఆయా ఉత్తర్వులపై అధికార వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని అందులో వైసీపీ ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టంగా వెల్లడించింది.


ALSO READ:  పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం

ఇదే అంశానికి సంబందించి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. దీనిపై న్యాయస్థానం ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు తన వాదనలు కూడా వినాలని అందులో పేర్కొన్నారు.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×