EPAPER
Kirrak Couples Episode 1

YSRCP MP Transfer | జగన్ తీరుతో వైసీపీ సిట్టింగ్ ఎంపీల్లో అసహనం.. పార్టీ వీడే యోచనలో నేతలు!

YSRCP MP Transfer | కొందరికి ప్రమోషన్లు.. మరికొందరికీ డిమోషన్లు. ఇది ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు. ప్రమోషన్లు అంటే ఓకే కానీ.. డిమోషన్లు, ట్రాన్స్ ఫర్లు అంటే మాత్రం నయ్ చల్తా అంటున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు. ఈ విషయంలో తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నారు.

YSRCP MP Transfer | జగన్ తీరుతో వైసీపీ సిట్టింగ్ ఎంపీల్లో అసహనం.. పార్టీ వీడే యోచనలో నేతలు!

YSRCP MP Transfer | కొందరికి ప్రమోషన్లు.. మరికొందరికీ డిమోషన్లు. ఇది ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు. ప్రమోషన్లు అంటే ఓకే కానీ.. డిమోషన్లు, ట్రాన్స్ ఫర్లు అంటే మాత్రం నయ్ చల్తా అంటున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు. ఈ విషయంలో తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నారు.


ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కేవలం అసెంబ్లీ సీట్ల మార్పులతోనే సరిపుచ్చలేదు. లోక్ సభ స్థానాలపైనా ఆయన నజర్ పెట్టాడు. అందుకే కొందరినీ తప్పించి వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం.. కొన్నిచోట్ల స్థాన చలనం చేస్తున్నాడు. అయితే ఐదేళ్లు ఒకచోట ఉండి.. ఇప్పుడు మరోచోటుకు వెళ్లి కంటెస్ట్ చేయాలంటే సాధారణంగా ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కొత్తప్లేస్ లో మనల్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటారోనన్న ఆందోళన కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అదే ఆందోళనలో ఉన్నారు పలువురు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు.

వైసీపీలో అభ్యర్థుల మార్పుతో దుమారం అయితే రేగుతోంది. చాలామంది పార్టీ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా వైసీపీని వీడేందుకు ఇద్దరు ఎంపీలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు మాగుంట, లావు శ్రీకృష్ణదేవరాయులుకు టికెట్ విషయంలో హైకమాండ్ నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో పార్టీని వీటడమే శ్రేయస్కరమని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంపీలు టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. అందుకు జగన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ జగన్ వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఒంగోలు ఎంపీ సీటు తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి జగన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

సుబ్బారెడ్డి కాదంటే ఆయన కుమారుడు లేదంటే సిద్ధ రాఘవయ్య పేర్లు జగన్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు సైకిల్ దిగి ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా దాదాపు వైసీపీని వీడేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయులుకు.. సౌమ్యుడిగా పేరు ఉంది. రెండోసారి కచ్చితంగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని భావిస్తున్న కృష్ణదేవరాయకు జగన్ షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. అక్కడ బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నామంటూ .. కృష్ణదేవరాయను గుంటూరు ఎంపీగా పోటీ చేయాలి అని ఆదేశించారు. దానికి జగన్ ముఖం మీదే కుదరదని ఎంపీ తేల్చిచేప్పేశారు. అయితే అధినేత ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ఆయన ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇక అనంతపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తలారి రంగయ్యకు జగన్ ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన్ను.. కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆదేశించారట. ప్రస్తుతం అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉషాశ్రీచరణ్ జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆమెను.. పెనుగొండకు మార్చి.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అనంతపురం ఎంపీగా జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే నియోజకవర్గ మార్పుపై ఇక్కడ తలారి రంగయ్య, ఉషాశ్రీచరణ్ కు పడట్లేదు. ఈ విషయంలో తనకు ఎలాంటి టెన్షన్ లేదు అంటున్నారు రంగయ్య. అధిష్టానం ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందే అని చెబుతున్నారు.

మరోవైపు హిందూపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్కు జగన్ మొండిచేయి ఇచ్చారు. ఆయన స్థానంలో శాంత అనే మహిళకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ స్థానంలో వైసీపీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. హిందూపురం ఎంపీగా శంకర్ నారాయణను.. అనంతపురం ఎంపీగా శాంతను పోటీ చేయించాలని లోకల్గా డిమాంట్లు వినిపిస్తున్నాయి. అరకు ఎంపీని మార్చడంపైనా స్థానకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇక నెల్లూరు వైసీపీ లోక్ సభ సెగ్మెంట్ లో పంచాయి చల్లబడినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు కొందరు ఎమ్మెల్యేలను మారుస్తేనే పోటీ చేస్తానన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దానికి జగన్ నో చెప్పడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తేల్చేశారు. దీంతో నెల్లూరు లోక్ సభ స్థానంపై చిక్కుముడి వీడినట్టైంది. ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ ను నెల్లూరు రూరల్ అసెంబ్లీకి పంపారు.

ఇక విశాఖపట్నం ప్రస్తుతం ఎంపీగా ఉన్న MVV సత్యనారాయణను.. వైజాగ్ ఈస్ట్కు పంపారు జగన్. ఆ స్థానంలో బొత్స సత్యనారాయణ సతీమణిని.. ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. బొత్స ఝాన్సీ కూడా అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని చెబుతోంది.

Related News

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Big Stories

×