EPAPER

YSRCP loosing Ground | ఈసారి పరిస్థితి అంత ఈజీ కాదు.. వైసీపీకి ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్ కష్టమే!

YSRCP loosing Ground | 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యంగా కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లే కాదు. ఈ జిల్లాల్లో లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీదే హవా.

YSRCP loosing Ground | ఈసారి పరిస్థితి అంత ఈజీ కాదు.. వైసీపీకి ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్ కష్టమే!
YSRCP latest news today

YSRCP latest news today(AP politics):

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యంగా కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లే కాదు. ఈ జిల్లాల్లో లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీదే హవా.


కట్ చేస్తే.. మరో 2-3 నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఈ సారి కూడా వైసీపీ తన ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా? అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే 2019 పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి.

ముందు కడప జిల్లా రాజకీయాలు పరిశీలిద్దాం. ఇది ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. పార్లమెంటు సీట్లు కూడా వైసీపీకే దక్కాయి. కానీ 2024 ఎన్నికల్లో రాజంపేట, రైల్వేకోడూరు, కడప నియోజకవర్గాల్లో వైసీపీ విజయం అంత సులువుకాదని అర్థమవుతోంది. కడప జిల్లా విభజన తరువాత ఇక్కడ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనబడుతోంది. మరో ముఖ్యమైన కారణం వైఎస్ వివేకా హత్య కేసు. ఈ కేసులో వైసీపీ నాయకులే ప్రధాన నిందితులుగా ఉండడం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత వైఎస్ వివేకా పట్ల జిల్లా ప్రజల్లో గౌరవభావం ఉంది. అలాంటి సీనియర్ నాయకుడిని స్వయాన వైసీపీ నాయకులే హత్య చేయడం అనేది రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులు వైసీపీకి వ్యతిరేకంగా చేసింది. వీటికి తోడు టిడిపి నాయకుడు బిటెక్ రవిపై ఉన్న కేసులు.. టిడిపి పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కడపలో వైసీపీ ఈజీగా గెలుస్తుందని చెప్పలేం.


ఇక నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఉన్న బలం ఇప్పుడు కనబడడం లేదు. 2019లో నెల్లూరు వైసీపీ నాయకులు ఐక్యంగా ఉండి.. పార్టీకి విజయం సాధించుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి బలమైన లీడర్లు పార్టీ వీడి వెళ్లిపోయారు. విపక్షాల పట్ల దూకుడు వ్యవహరించే వైసీపీ నాయకులు ఇప్పుడు మౌనంగా కనుబడుతున్నారు. దీనికి కారణం పార్టీలో తమకు గుర్తింపు లభించడం లేదని. జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. పార్టీకి విపరీత ధోరణి ఉన్న నెల్లూరులో క్లీన్ స్వీప్ అనేది అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

క‌ర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట. 2019లో ఎన్నికల వేళ క‌ర్నూలు జిల్లాలో వైసీపీ సాధించిన విజయం ఒక అద్భుతమే. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో టిడిపి బలం బాగా పెరిగిపోయింది. మరోవైపు వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం కర్నూలుని న్యాయ రాజ‌ధాని అని ప్రకటించినా.. అభివృద్ధి మాత్రం లేక పోవ‌డంతో జిల్లా ఓట‌ర్లు ఈ సారి గంపగుత్త‌గా వైసీపీకి ఓట్లు వేస్తారనే నమ్మకం ఎవరికీ లేదు.

YSRCP loosing Ground, YSRCP, Jagan Mohan Reddy, Viveka Murder case, Kadapa, Kurnool, TDP, Nellore, districts

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×