EPAPER

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

వైసీపీ నుంచి వలసలు ఆటోమేటిక్ గా కూటమివైపు వస్తున్నాయి. అక్కడ గుడ్ బై చెబుతున్న వారు అయితే టీడీపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో గతంలో చాలా విబేధించిన వారైతే తమకు ఆప్షన్ గా జనసేనను చూస్తున్నారు. అటు జనసేన పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉన్నా.. పెద్ద స్థాయి నేతలు లేక ఎదగలేకపోతోంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లోనూ చాలా మంది చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో వచ్చి చేరిన వారే టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా జనసేనలో పెద్ద స్పేస్ కనిపిస్తోంది. ఇది వైసీపీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలకు ప్లస్ పాయింట్ గా మారింది.

ఒంగోలు కార్పొరేషన్‌ లో కార్పొరేటర్లలో చాలా మంది బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరి వారే ఉన్నారు. ఇటీవలే వారంతా టీడీపీలో చేరారు. ఒకవేళ బాలినేనికి జనసేనలో లైన్ క్లియర్ అయితే వారు అక్కడికి షిఫ్ట్ అవుతారా అన్నది కీలకంగా మారింది. ఇదే జరిగితే కూటమిలో కాస్త గడబిడ ఖాయమే అంటున్నారు. మరోవైపు పార్టీలోకి బయటి నుంచి ఒకరు వస్తుంటే అప్పటికే పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి సహజమే. ఇప్పటికే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సైతం సైలెంట్ అయిపోయారు. దీన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా టాకిల్ చేస్తారన్నది కీలకంగా మారింది.


వైసీపీ నుంచి జనసేనలోకి రావాలనుకుంటున్న లీడర్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కూటమిలోకి తప్పులు చేసిన వారు అక్కర్లేదని, కుళ్లిన కోడిగుడ్లు వద్దే వద్దంటున్నారు కూటమి నేతలు. మంచి వాళ్లనే ఆమోదిస్తామంటున్నారు.

Also Read: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

వైసీపీ నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. క్యాడర్, లీడర్ షిప్ అంతా నిరాశ నిస్పృహలతోనే వీడుతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ జగన్ వెంట తిరిగి వారే ఇక మీ వెంట నడవడం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. కొందరు అంటీ ముట్టనట్లుగా ఉంటే.. ఇంకొందరు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవలే వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. అటు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ వీడారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా గుడ్ బై చెప్పేశారు.

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వారిలో కిలారు రోశయ్య, మద్దాలి గిరి, పెండెం దొరబాబు, నూర్జహాన్ ఉన్నారు. ఇందులో నూర్జహాన్ ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ గా ఉన్నారు. ఆ దంపతులిద్దరూ జగన్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీలో ఇన్నాళ్లు కీలక వ్యవహరించిన మాజీ మంత్రులు, తాజా మాజీలు, వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతుండడం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఓడిపోయింది కాబట్టి నాయకులంతా వైసీపీని వీడుతున్నారని అనుకోవడానికి లేదంటున్నారు. తీవ్రమైన అసంతృప్తి, నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, 11 సీట్లకే పరిమితమై ప్రజాదరణ కోల్పోవడం, క్యాడర్ లో నిరాశ ఉండడం ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×