EPAPER
Kirrak Couples Episode 1

YSRCP Hindupur | పార్టీ లో చేరిన మూడు గంటలలోపే ఎంపీ టికెట్!.. ప్రజాబలం కాదు వైసీపీకి కులమే ప్రధానం

YSRCP Hindupur | కాలం కలసి రావడం కాదు..కులం కలసి రావడం అంటే ఇదేనేమో… సామాజిక సమీకరణాల నేపథ్యం లో పార్టీ లో చేరిన 3 గంటలకే ఎంపీ టికెట్ ఖాయం చేసుకుని … ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు కర్నాటకలో నివాసం ఏర్పరుచుకున్న ఓ రాయలసీమ నాయకురాలు

YSRCP Hindupur | పార్టీ లో చేరిన మూడు గంటలలోపే ఎంపీ టికెట్!.. ప్రజాబలం కాదు వైసీపీకి కులమే ప్రధానం

YSRCP Hindupur | కాలం కలసి రావడం కాదు..కులం కలసి రావడం అంటే ఇదేనేమో… సామాజిక సమీకరణాల నేపథ్యం లో పార్టీ లో చేరిన 3 గంటలకే ఎంపీ టికెట్ ఖాయం చేసుకుని … ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు కర్నాటకలో నివాసం ఏర్పరుచుకున్న ఓ రాయలసీమ నాయకురాలు .. కేవలం కాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఏపి రాజకీయాలలో తన లక్ ను చెక్ చేసుకోనున్నారు .. బళ్లారి వయా తాడేపల్లి మీదుగా హిందూపురం చేరుకున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరో ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో? తెలుసుకుందాం.


జొలదరాశి శాంత.. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా… రాష్ట్రంలోనే కాదు.. కనీసం అనంతపురం జిల్లాలో బాగా ఆరితేరిన రాజకీయ నేతలకు కూడా ఈ పేరు వినిఉండరు .. ఉమ్మడి అనంత రాజకీయాలను బాగా ఫాలో అయ్యేవారికి సైతం తెలియని పేరు… ఇప్పుడు ఈ పేరు ఉమ్మడి అనంత జిల్లా రాజకీయాల్లో మోతమోగి పోతోంది … తీరా ఆమె ఎవరా అని చూస్తే కర్ణాటక లో తలపండిన రాజకీయా నేత గాలి జనార్ధన రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరి.. ఈ శాంత … ఆమె ప్రొఫైల్ తెలిస్తే .. ఓహో ఆవిడా? అనుకుంటారు.. ఈమె పుట్టింది కర్ణాటక సరిహద్దు ప్రాంతం… ఆంధ్ర ప్రదేశ్ తో పెద్దగా సంబంధాలు లేవు… కానీ ఇవాళ సడెన్ గా వైసీపీ కండువా కప్పుకొని హిందూపురం ఎంపి సీట్ కూడా సాధించుకున్నారు.

వైసీపీ వై నాట్ 175 అంటున్న జగన్ .. సీట్లలో మార్పులు, చేర్పులు చేసేస్తున్నారు … నియోజక వర్గాల్లో ఇంఛార్జి లను మారుస్తూ కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తోంది వైసీపీ… దానిలో భాగంగా హిందుపురం ఎంపి స్థానం అభ్యర్ధిని కూడా మార్చింది… హిందూపురం సిట్టింగ్ ఎంపి గా ఉన్న గోరంట్ల మాధవ్ ని కాదని ఎక్కడో బళ్ళారి లో ఉన్న శాంతమ్మ కు పిలిచి మరి అవకాశం ఇచ్చారు… ముఖ్యంగా హిందూపురం గోరంట్ల మాధవ్ పై అనేక వివాదాలు ఉన్నాయి… ముఖ్యంగా అసభ్య వీడియోలు వ్యవహారం గోరంట్ల మాధవ్ కు ఎంపీ టికెట్ ని దూరం చేసిందంట … అదే కాక ఆయన వ్యవహార శైలి కూడా పార్టీనీ అనేక ఇబ్బందులు పెట్టింది… కియా కార్ల కంపెనీ వారికి బెదిరింపులు … అద్దెకు ఉన్న ఇంటి రెంట్ ఎగ్గుటడం దగ్గర నుంచి ఇటీవల భహిరంగ సభ లో చంద్రబాబు చస్తాడు అన్న వ్యాఖ్యల వరకు ఇలా ప్రతి అంశం కూడా హిందూపురం లో పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారంట …ఆ పోయిన ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం కొత్త వారికి .. అందులోనూ మహిళకు అయితే బాగుంటుంది అని వైసీపీ అధిష్టానం వెదుకులాట మొదలుపెట్టింది … సరిగ్గా అలాంటి కాండిడేట్ వైసీపీ కి జిల్లాల్లో ఎక్కడా లభించకపోవడంతో ఎక్కడో బళ్ళారి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.


ముఖ్యంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా బీసీల జనాభా అధికంగా ఉంటుంది .. అందులోని వాల్మీకులు, కురుబలు అధిక సంఖ్యలో ఉంటారు .. ఆయా సామాజిక వర్గాలకు టికెట్ కేటాయిస్తే గెలుపు ఈజీ అవుతుందని అన్ని పార్టీలు భావిస్తుంటాయి అందులో భాగంగా 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానం వాల్మీకిలకు, హిందూపురం ఎంపీ స్థానం కురుబ కులానికి కేటాయించారు … ఈసారి కూడా అదే ఫార్ములాతో అనంతపురం ఎంపీ స్థానాన్ని కురుబలకు , హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకిలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు … హిందూపురంలో అసెంబ్లీ సెగ్మెంట్ లో వాల్మీకి సామజిక వర్గం ఓట్లు ఎక్కువ …అది కలిసి వస్తుందని… ఎలాగూ ఆమెకున్న అంగ, అర్ధ బలం కూడా వైసీపీ ఈ ఎంపిక చేసిందంటున్నారు … ఈ టికెట్ కేటాయింపు లో గాలి జనార్ధన రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంది అని ప్రచారం జరుగుతోంది… ఇంకో విషయం ఏమంటే ఆమె కోసమే ఇన్నాళ్లు రెండో విడత జాబితా లేట్ అయిందన ప్రచారం జరుగుతోంది… ఆమె పార్టీ లో చేరిన కేవలం 2 గంటల్లోనే జాబితాలో ఆమె పేరు కనిపించడంతో …గాలి జనార్ధన రెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తొంది.

కానీ టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా గెలుపు సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు … ఆమె ఈ ప్రాంతానికి నాన్ లోకల్ అవ్వడం …సామాన్య కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆమె ఎవరో తెలియక పోవడం పెద్ద మైనస్ గా చెప్తున్నారు … మరి చూడాలి జగన్ నయా స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Related News

Bhimili red sand hills: భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశం

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Bigtv Free Medical Camp: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

AP Politics: ఢిల్లీలో జగన్ ప్లాన్ రివర్స్, ఎంపీ సీటు ఖాళీ.. బీజేపీకే ఛాన్స్!

Botsa satyanarayana: ఫ్యామిలీ విభేదాలా? బొత్సకు తమ్ముడు ఝలక్, జనసేనలోకి అడుగులు..

Roja: జగన్ పరువు తీసిన రోజా? తిరుమల లడ్డు వివాదంపై పోల్, రిజల్ట్ చూసి దెబ్బకు డిలీట్!

Big Stories

×