EPAPER

Gorantla Madhav: లోఫర్ సిక్స్.. జోకర్ సిక్స్ అంటూ రెచ్చిపోయి.. సూపర్ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ గోరంట్ల

Gorantla Madhav: లోఫర్ సిక్స్.. జోకర్ సిక్స్ అంటూ రెచ్చిపోయి.. సూపర్ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ గోరంట్ల

Gorantla Madhav: మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ పోలీస్ అధికారైన గోరంట్ల.. కాస్త ఘాటుగా విమర్శలు చేశారు. అది కూడా కూటమి సూపర్ సిక్స్ నినాదంతో అధికారం చేజిక్కించుకోగా.. గోరంట్ల సూపర్ సిక్స్ కి కొత్త అర్థం చెప్పారు.


కూటమి ప్రభుత్వంపై ఇటీవల వైసీపీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకో ఏమో కానీ ఉన్నట్టుండి కూటమిపై గరం అవుతున్నారు వైసీపీ నేతలు. ఏ విమర్శించేందుకు ఏ చిన్న సందర్భం దొరికినా.. సోషల్ మీడియా ద్వారా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ కూటమికి గట్టి షాక్ ఇస్తున్నారు.

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంపై గోరంట్ల చేసిన విమర్శలు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అదే హామీని నెరవేర్చాలని కోరుతూ ఇటీవల మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కానీ ఏవైతే సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వాటిని మరిచిపోయిందని మాజీ ఎంపీ గోరంట్ల అన్నారు.


హిందూపురంలో మీడియా సమావేశం నిర్వహించిన గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ అంటూ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఓట్లు వేసిన ప్రజలు ప్రస్తుతం.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైసీపీని గెలిపించేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఇక సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు లోఫర్ సిక్స్.. పవన్ కళ్యాణ్ జోకర్ సిక్స్ అంటూ పోల్చారు. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఆ స్థాయిలో గోరంట్ల విమర్శించడం ప్రస్తుతం పొలిటికల్ వేడిని పెంచిందని చెప్పవచ్చు.

Also Read: TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

అలాగే రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, అయితే అందులో ప్రజలకు ఇచ్చిన హామీలు కాకుండా వేరే విధంగా అమలు చేస్తుందన్నారు. మద్యం, మాఫియా, ఇసుక, రేప్ లు, మర్డర్లు, అక్రమ కేసులు, ఈ ఆరు పథకాలను కూటమి ప్రయోగిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోకర్ లా టిడిపి కి వంతు పాడుతున్నారన్న గోరంట్ల చేసిన విమర్శలు ఘాటెక్కగా.. మరి కూటమి నేతల రెస్పాండ్ ఎలా ఉంటుందో..!

Related News

Deputy CM Pawan Kalyan: ప్లీజ్ ఆ ఒక్క పని చేయవద్దు.. వైసీపీ వల్లే రోగాలు వస్తున్నాయ్.. డిప్యూటీ సీఎం పవన్

Sri Reddy On YCP: నన్ను దూరం పెట్టారు.. జగన్‌పై శ్రీరెడ్డి రుసరుస

Police Commemoration Day: ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి

Cyclone Dana :ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్

Jagan vs Sharmila: జగన్ రాయబారం సక్సెస్! చెల్లికి సగ భాగం ఇచ్చేందుకు ఓకేనా?

Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Big Stories

×