EPAPER
Kirrak Couples Episode 1

YSRCP Election Strategy | గెలుపుగుర్రాల అన్వేషణలో వైసీపీ.. జంప్ జిలానీ దెబ్బతో జగన్ ఉక్కిరిబిక్కిరి!

YSRCP Election Strategy | ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క. ఇది సినిమాలో డైలాగ్‌ అయినా… ప్రస్తుత రాజకీయాల్లో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఫ్యాన్ హవా మీద గెలిచేసిన వారంతా.. ఇప్పుడు మేకులుగా మారారని అధిష్టానమే చెబుతోంది.

YSRCP Election Strategy | గెలుపుగుర్రాల అన్వేషణలో వైసీపీ.. జంప్ జిలానీ దెబ్బతో జగన్ ఉక్కిరిబిక్కిరి!

YSRCP Election Strategy | ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క. ఇది సినిమాలో డైలాగ్‌ అయినా… ప్రస్తుత రాజకీయాల్లో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఫ్యాన్ హవా మీద గెలిచేసిన వారంతా.. ఇప్పుడు మేకులుగా మారారని అధిష్టానమే చెబుతోంది. టిక్కెట్ ఇస్తే ఓకే..లేకుండా జంప్‌ అన్నట్లుగా నేతల తీరు మారటంతో.. ఎంపిక కసరత్తు తలకు మించిన భారంగా మారింది.


గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు.. 22 మంది ఎంపీలు. ఎవరూ ఊహించిన మెజార్జీ.. ఓ రకంగా.. వైసీపీ అధిష్టానం కూడా ఊహించని సంఖ్యలవి. కానీ అదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. సర్వేలు, సామాజిక వర్గాల ఆధారంగా సీట్లు పంపిణీ రాగం ఎత్తుకున్న వైసీపీ అధిష్టానం.. అనుకున్నట్లే మార్పుచేర్పులు చేస్తోంది. ఇటు ఎమ్మెల్యేలు.. అటు ఎంపీలను ఖరారు చేయటంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది లాభమా.. నష్టమా అనే అంశాన్ని పక్కన పెడితే.. సీట్లు రాని కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సీట్ల మార్పు పైన కొందరు అభ్యర్దులతో సీఎం నేరుగా మాట్లాడుతున్నారు. కొందరు ఆమోదం చెప్పగా, మరి కొందరు తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. మరి కొందరు నిప్పులు చెరుగుతున్నారు.

వైనాట్‌ 175 నినాదం అందుకున్న సీఎం జగన్‌… వైసీపీ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 38 మంది ఇంఛార్జ్‌లను ఖరారు చేస్తూ.. అధికారికంగా రెండు జాబితాలను విడుదల చేశారు. మూడో జాబితా కూడా తుదిదశకు చేరుకుంది. మూడోజాబితాలో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను ఖరారు చేస్తూ లిస్టు విడుదల చేసే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. మలి విడత జాబితాలో అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో మార్పులకు సంబంధించి ఇప్పటికే ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.


మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు లోక్ సభ స్థానానికి మారుస్తారనే చర్చ జరుగుతోంది. ఆలూరు నుంచి ఒక బీసీ మహిళ బుజ్జమ్మకి అవకాశం ఇస్తారని వార్తలూ వినిపిస్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌.. ఇప్పటికే రెండు విడతలుగా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఆయన్నే అక్కడ కొనసాగిస్తారని చెబుతున్నా….తుది నిర్ణయంపై ఆసక్తి కొనసాగుతోంది. దర్శి సీటును.. ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. దీంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచారు. దీనిపైన ఆలోచన చేసి చెప్పాలని సూచించారు. ఒంగోలు ఎంపీ సీటు పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో నర్సరావుపేట సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకేననే సంకేతాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజంపేట స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి ఖరారు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే అందుకు ఆయన సిద్దంగా లేరు. తన లెక్కలు వేరు.. అధిష్టానం లెక్కలు వేరు అని ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సారి పోటీపై సందిగ్ధం ఏర్పడింది. నర్సరావుపేట లోక్ సభ టికెట్‌ను ఈసారి బీసీలకు కేటాయించాలని జగన్ భావిస్తుండగా.. లావుకే ఇవ్వాలని.. లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ఈ సారి టికెట్ లేదని తేల్చేయడంతో విప్‌ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ చేయబోయే మార్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది.

రేపోమాపో రానున్న జాబితా నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. కొందరు నేతలైతే..ఎక్కడ హాట్ స్ట్రోక్ వస్తుందోనని ఫ్యామిలీ డాక్టర్‌ని కూడా పక్కన పెట్టుకుంటున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. మరికొందరు నేతలు ఇప్పటికే పక్క పార్టీల్లో కర్చీఫ్ వేసుకునే పనిలో పడ్డారని లీకులు వినిపిస్తున్నాయి. ఇస్తే ఈ పార్టీ.. లేకుంటే వేరే పార్టీ అన్నట్లుగా నేతలు మారిపోవటంతో ఎంపిక కసరత్తు.. అన్ని పార్టీల అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. ఎవర్నీ వదులుకోలేక… అలాగని సీటు ఇవ్వలేక నానా తంటాలూ పడుతున్నారు. ఒకప్పటిలా నేతలు.. ఒక్క పార్టీకే కట్టుబడి ఉండే పరిస్థితి లేకపోవటం వల్ల.. జంప్‌జిలానీలపై దృష్టి సారిస్తూనే.. గెలుపుగుర్రాల అన్వేషణలో పడ్డారు.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×