EPAPER

Jagan Paper Ballot: దేశ రాజకీయాల్లో జగన్ చిచ్చు.. పేపర్ బ్యాలెట్ ఎన్నికల పాట పాడుతున్న వైసీపీ

Jagan Paper Ballot: దేశ రాజకీయాల్లో జగన్ చిచ్చు.. పేపర్ బ్యాలెట్ ఎన్నికల పాట పాడుతున్న వైసీపీ

Jagan Paper Ballot| వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అంటూ ఎన్డీయే ఒక వైపు పిలుపునిస్తున్న క్రమంలో.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కొత్తగా ఇప్పుడు మళ్లీ పాత పాటే పాడుతున్నారు. ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్ల పద్దతి ఫాలో అవ్వాలని మరోసారి కోరుతున్నారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. మిగిలిన పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే జగన్ వ్యాఖ్యలకు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు 2019 లో ఏం చేశారంటూ ప్రశ్నించారు. అధినేతల డైలాగ్ వార్ తో ఈ విషయం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.


వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మళ్లీ పాత పాటే పాడుతున్నారు. ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్ల పద్దతి ఫాలో అవ్వాలని మరోసారి గళం విప్పారు. ఇన్ డైరెక్ట్ గా ఈవీఎంల వ్యవహారంలో అనుమానాలను బయటపెడుతూ.. పలు పార్టీలను సైతం మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పలు దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ పద్దతిని కొనసాగిస్తున్నారని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడిపోయినప్పుడు ఒకలా.. మాట మార్చడం జగన్ కు అలవాటే అంటూ కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నేతల డైలాగ్ వార్ తో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు వైఎస్‌ జగన్‌. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని ట్వీట్ చేశారు.


Also Read: నారా లోకేష్ రెడ్ బుక్ Vs జగన్ గుడ్ బుక్.. ఏపీలో హాట్ టాపిక్ గా బుక్ ల వ్యవహారం

అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారని పేర్కొన్నారు జగన్. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు.. పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయన్నారు. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిది. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని కోరారు. తన ట్వీట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎస్పీ, ఆప్, AIDMK, శివసేన, బీఎస్పీ, ఆర్జేడీ, బీజేడీ, ఆకాళీదల్ తో పాటు అనేక పార్టీలకు తన ట్వీట్ ను జగన్ ట్యాగ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు జగన్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సర్వసాధరమణన్న జగన్.. కష్టాల నుంచే హీరోలు పుడతారన్నారు. అసలైన నాయకులు పుట్టేది కూడా ఇప్పుడేనని చెప్పుకొచ్చారు. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని అన్నారు జగన్.

జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు నేరుగా రియాక్ట్ అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన‌ప్పుడు.. ఇలా ఎందుకు డిమాండ్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. 2019లో ప్ర‌జాభిప్రాయం ప్ర‌కార‌మే ఫ‌లితం వ‌చ్చిందా? అని నిల‌దీశారు. చెత్త‌మాట‌లు మాట్లాడ‌డానికి సిగ్గుండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడితే.. విశ్వ‌స‌నీయత ఉండాలి. కానీ, వీరు నొరు విప్పితే అన్నీ బూతులే. ఇళ్ల‌పై దాడులు చేస్తే.. ఆఫీసుల‌పై దాడులు చేస్తే.. కేసులు పెట్ట‌కూడ‌దా. వీళ్ల అరాచ‌కాల‌ను, వైఖ‌రినీ ప్ర‌జ‌ల‌కు కూడా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నీ అరాచ‌కాలే క‌నిపిస్తున్నాయని చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

అలానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అందించిన సుపరిపాలన వల్లే.. వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీతో పాటు ప్రధాన నరేంద్ర మోదీపై నమ్మకంతో హర్యానా ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గతం కంటే బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయని, ఇది సుపరిపాలనకు దక్కిన ఫలితమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఫలితాలు వస్తాయని.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఎన్డీయే విధానానికి.. దేశం మొత్తం మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

పేపర్ బ్యాలెట్ అంటూ జగన్ చేసిన ట్వీట్ కి మిగిలిన పార్టీల నేతలు ఏవిధంగా స్పందిస్తారో అని చర్చ జరుగుతోంది. నోరు ఉంది కదా అని నచ్చినట్టు మాట్లాడ్డం సరికాదని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related News

AP BJP Leaders Viral Video: ఏపీ బీజేపీలో కలకలం.. నేతల బూతు వీడియోల వెనుక..

Jagan Good Book: నారా లోకేష్ రెడ్ బుక్ Vs జగన్ గుడ్ బుక్.. ఏపీలో హాట్ టాపిక్ గా బుక్ ల వ్యవహారం

Jammalamadugu: జమ్మలమడుగులో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం..

YS Jagan vs TDP: తొలిసారి నిజాలు చెప్పిన జగన్, అవే మాటలు.. కార్యకర్తలకు బోరు కొట్టకుండా..

Road Accidents in AP: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!

AP Cyclone warning: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

Big Stories

×