EPAPER

YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. ఆమంచికి షాక్!

YSRCP 7th List: వైసీపీ ఏడో జాబితా విడుదల.. ఆమంచికి షాక్!
YSRCP Party latest news

YSRCP 7th List Released: వైఎస్సార్సీపీ అధిష్ఠానం.. విడతల వారీగా నియోజకవర్గాల ఇన్ చార్జిలను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 6 జాబితాలను ప్రకటించిన అధిష్ఠానం.. తాజాగా ఏడవ జాబితాను రిలీజ్ చేసింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఇంచార్జిగా యడం బాలాజీని ప్రకటించింది. కందుకూరు ఇంచార్జిగా కటరీ అరవింద యాదవ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలలో.. 69 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు , 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అందులో 33 మంది సిట్టింగులకు మొండి చెయ్యి చూపించారు. తాజాగా విడుదల చేసిన ఏడో జాబితాలో.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు సీనియర్ నేతలకు జగన్ షాకిచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి, పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించి, ఆమంచి కృష్ణమోన్ కు టికెట్లు నిరాకరించారు.


తొలి నుంచీ ఇదే అనుకుంటున్నప్పటికీ.. శుక్రవారం రాత్రి పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటిచింది. ఇద్దరి పేర్లతో ఏడవ లిస్ట్ ను విడుదల చేయగా.. కందుకూరులో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ ను ఇన్ చార్జిగా నియమించారు. పరచూరు బాధ్యతల నుంచి ఆమంచిని తప్పించి.. చీరాలకు చెందిన యడం బాలాజీని ఇన్ చార్జిగా నియమించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాలాజీకి.. 2019లో పార్టీ టికెట్ అవ్వకపోవడంతో టీడీపీలో చేరారు.

Read More:  ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్


ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఆయనను సీఎం జగన్.. పిలిపించుకుని మరీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. ఆ వెంటనే పర్చూరు బాధ్యతలను అప్పగించారు. తనను పక్కనపెట్టి మరీ.. యడం బాలాజీకి బాధ్యతలు అప్పజెప్పడంతో.. ఆమంచి అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమంచిని పక్కనపెట్టడంపై వైసీపీలో ఉన్న నేతలే పెదవి విరుస్తున్నారు.

కాగా.. నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్చార్జిలను నియమించగా.. 2వ జాబితాలో 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలకు, మూడవ జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు, 4వ లిస్టులో 1 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలకు, 5వ జాబితాలో 3 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు, 6వ లిస్టులో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. తాజాగా 7వ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×