EPAPER

Jagan vs Sharmila: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం, చెల్లి 200 కోట్లు సరిపెట్టుకో.. చట్ట ప్రకారం కక్కిస్తానంటున్న షర్మిల

Jagan vs Sharmila: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం, చెల్లి 200 కోట్లు సరిపెట్టుకో.. చట్ట ప్రకారం కక్కిస్తానంటున్న షర్మిల

Jagan vs Sharmila: వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? ఆస్తుల పంపకాల వ్యవహారంపై అన్నా-చెల్లి మధ్య అసలేం జరిగింది? బయటకు తెలిసింది కొంత మాత్రమేనా? తెర వెనుక ఇంకా వుందా? హక్కు కోసం వైఎస్ షర్మిల న్యాయస్థాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారా? కేవలం 200 కోట్లు ఇచ్చి చెల్లిని జగన్ సరిపెట్టు కోమన్నాడా? వైఎస్ఆర్ చేసిన ప్రామిస్‌ను జగన్ ఎందుకు  తుంగలో తొక్కారు? ఇలా ప్రశ్నలు వైఎస్ఆర్ అభిమానులను వెంటాడుతున్నాయి.


వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తులను మనుమడు, మనుమరాళ్లకు సమాన వాటా ఇవ్వాలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా భారతి సిమెంట్స్, సాక్షి సంస్థల గురించే ప్రధాన ప్రస్తావన. జగన్‌తోపాటు షర్మిల కూడా తల్లి విజయమ్మ సాక్షిగా అంగీకరించారు. గత నెలలో షర్మిల తన అన్నకు రాసిన లేఖలో ముఖ్యమైన పాయింట్ ఇది.

రెండు నెలల కిందట జగన్-షర్మిల లేఖల రాకపోకలు సాగాయి. అయితే జగన్ రాసిన లేఖపై షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కిందట ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొద్దిపాటి ఆస్తులు మాత్రమే బదిలీ చేశామని ప్రస్తావించారామె.


భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాను జగన్ తన వద్దే ఉంటున్నారన్నది మరో పాయింట్. చట్ట బద్దంగా రావాల్సిన ఆస్తులు రాకుండా చేస్తున్నావని, నాన్న ఇచ్చిన ప్రామిస్‌కు విరుద్దంగా వెళ్తున్నావని రాసుకొచ్చారు. అమ్మతోపాటు తనపై కేసులు పెట్టి ఆస్తులు తీసుకోవాలని ప్లాన్ చేశామని పేర్కొన్నారు.

ALSO READ: మీరు ఈ తప్పులు చేస్తే.. దీపం పథకం వర్తించదు.. వివరాలన్నీ ఓసారి చెక్ చేసుకోండి!

తన వాటా సరస్వతి పవర్ కంపెనీ షేర్లు రాసిస్తానని మాట ఇచ్చావని, దానిపై నిలబడలేదని రాసుకొచ్చారు షర్మిల. సరస్వతి పవర్ షేర్లపై అమ్మకు పూర్తి హక్కులు ఇస్తున్నట్లు అమలు చేసి, వాటిపై ఫిర్యాదు చేయడం దేనికని ప్రశ్నించారు షర్మిల.

ఎంవోయూలో ప్రస్తావించకపోయినా, బెంగుళూరు ప్యాలస్‌లో తనకు వాటా ఉందని అమ్ము చెప్పినప్పుడు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారామె. నీకు, అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని చెప్పడం అసంబద్ధమన్నారు.

పొలిటికల్ లైఫ్ అనేది తన ఇష్టమని, వృత్తిలో ఎలా ఉండాలో నిర్థేశించే అధికారం లేదన్నది ఆమె కీలకమైన పాయింట్. చివరలో ఓ మాట ప్రస్తావించారు షర్మిల. జగనన్నా నైతికంగా దిగజారిపోయిన లోతుల్లో నుంచి బయటకు వచ్చి తండ్రి ఆశయాలను నెరవేరుస్తామని భావిస్తున్నారని తెలిపారు. లేదంటే చట్ట ప్రకారం వెళ్తానని హెచ్చిరించారు వైఎస్ షర్మిల.

గతంలోకి వెళ్తే.. పదేళ్ల కిందట జగన్, తన చెల్లికి కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదంతా ప్రేమ, ఆప్యాయతతో ఇచ్చానన్నది జగన్ వెర్షన్. ఇదంతా 2014లో జరిగిన వ్యవహారం. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆస్తుల విషయంలో అన్నా చెల్లి మధ్య ఎంవోయూ జరిగింది.

ఏపీలో అధికారం పోయిన మూడునెలలకు జగన్, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం జరిగిపోయింది. అమ్మ, చెల్లికి ఇచ్చిన షేర్లు తనకు అప్పగించాలని కోరారు. దీంతో ఆస్తుల వ్యవహారం ముదిరిపాకాన పడింది. అన్నాచెల్లి మధ్య లేఖ వ్యవహారం చూస్తుంటే.. న్యాయస్థానం వరకు వెళ్లే అవకాశముందన్నది కొందరు న్యాయ నిపుణుల మాట.

Related News

YS Sharmila vs YS Jagan: వైఎస్ఆర్‌కు, నీకు సంబంధం లేదు: షర్మిల

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Big Stories

×