EPAPER

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్లాన్ అంతా ఆ సినిమా చూసే చేశారా ?

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్లాన్ అంతా ఆ సినిమా చూసే చేశారా ?

YS Vivekananda Reddy Murder Case Latest  Update: మీరు 2017లో రిలీజైన్ విశాల్‌ “డిటెక్టివ్‌” సినిమా చూశారా? డెవిల్‌ గ్యాంగ్‌ చేసే హత్యలు, అందుకు ఫాలో అయ్యే ప్యాట్రన్‌ అంతా వేరేగా ఉంటుంది. హత్య తర్వాత క్లూ దొరకకుండా వారు ఏం చేయాలో అది చేస్తారు.  కానీ చివరకు దొరికిపోతారు. సేమ్‌ టు సేమ్‌ అలాంటి పద్దతినే వైఎస్‌ వివేకా హత్య తర్వాత అమలు చేశారా? ఇప్పుడిదే క్వశ్చన్‌ను రైజ్‌ చేస్తోంది టీడీపీ. మరి ఇప్పుడీ సందేహాలు ఎందుకు వస్తున్నాయి?


డెడ్లీ సైకిల్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ ఎలిమినేషన్‌.. అంటే సాక్ష్యాల లింకులను తెంచేయడం. ఒక హత్య తర్వాత.. ఆ కేసును ఛేదించాలంటే సాక్షులే కీలకం. వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుంది. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. హత్యలో పాల్గొన్న వారిని, సాక్షులను ఒక్కొక్కరిగా ఎలిమినేట్‌ చేస్తే కేసు ముందుకు కదలదు. ఇదే విషయాన్ని సూత్రధారులు పసిగట్టారు. చెయిన్‌లో ఉన్న లింకులను తెంచినట్టుగా సాక్షులను మాయం చేయడం వారి క్రిమినల్‌ విధానం. అప్పుడు పరిటాల రవి హత్య తర్వాత కూడా ఇదే ప్రొసిజర్‌ను ఫాలో అయ్యారని టాక్‌.

ఇంతకీ టీడీపీ నేతలకు ఈ డౌట్‌ ఎందుకు వచ్చింది. అవును  ఇప్పుడు దాని గురించి ఓసారి చర్చించుకుందాం. నాడు జగన్‌ మామ గంగిరెడ్డి.. నేడు అభిషేక్‌ రెడ్డి అని టీడీపీ ట్వీట్‌ చేసింది. అభిషేక్‌ రెడ్డి అంటే జగన్‌ వాళ్ల పెదనాన్న ప్రకాశ్‌రెడ్డి మనువడు. ఆయన ఇప్పుడు హైదరాబాద్‌లోని సిటీన్యూరో హాస్పిటల్‌లో కోమాలో ఉన్నాడు. అభిషేక్‌ రెడ్డిని లింక్‌ చేస్తూ టీడీపీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వివాదంగా మారింది. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తుందని టీడీపీ ఆరోపించింది. అంతే అక్కడి నుంచి టీడీపీ వైసీపీ మధ్య వివాదం షూరు అయింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా కొత్తగా అనుమానాలు సృష్టించేలా మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.


Also Read: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

జగన్‌కు కొడుకు వరుస అయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నా.. ఎందుకు జగన్ పరామర్శించలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపణలను YCP ట్విట్టర్‌ వేదికగా ఖండించింది. మామకు వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసు అని ట్వీట్‌ చేసింది. అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారని వివరించింది. ఇక వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అందులో ఒకరు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన శ్రీనివాసులరెడ్డి. ఈయన సూసైడ్‌ చేసుకున్నారు. ఇదే కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు. హత్య జరిగిన రోజు నలుగురిని చూసినట్లు సాక్ష్యం చెప్పిన వాచ్‌మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ఆసుపత్రిలో చేరాడు. ఆ విషయం మీడియాలో వచ్చేసరికి అతి కష్టం మీద కోలుకున్నాడు. వివేకా హత్య రోజు జగన్‌ కారు నడిపి, ఆ సమాచారం విన్న డ్రైవర్‌ నారాయణ మరణించాడు.

ఈసీ గంగిరెడ్డి కూడా ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో మృతిచెందాడు. అప్రూవర్ అయిన దస్తగిరి మీద కేసులు పెట్టి జైల్లోనే చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయని ఆయనే చెప్పాడు. సాక్ష్యాలు చెరిపేసిన ఘటనలో వాంగ్మూలం ఇచ్చిన అభిషేక్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. వివేకా హత్యపై కేసు పెట్టి పోరాడుతున్న సునీతకు సోషల్ మీడియాలో ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ఆమె ప్రాణహానీ ఉందని కడప ఎస్పీతో పాటు హోంమినిస్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేందుకు వివేకా హత్య కేసును విచారించిన సీబీఐ అధికారి రాంసింగ్ మీదే కేసు నమోదు చెయ్యడం కూడా అనేక డౌట్స్ ను రైజ్ చేస్తోంది. ఈ ఘటనలన్నీ చూస్తుంటే చెయిన్-లింక్ ఫెనామెనన్ పద్దతిలో డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్‌కు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజమన్నది దర్యాప్తు సంస్థలే తేల్చాయి.

Related News

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

CPI Narayana: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి బుడమేరును కాపాడాలి: సీపీఐ నారాయణ

kakinada GGH Rare Treatment: రోగికి “అదుర్స్” సినిమా చూపిస్తూ.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లు

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

CM Chandrababu Angry on Jagan: జగన్‌‌పై సీఎం ఆగ్రహం, మెడికల్ కాలేజీ సీట్లు.. ఆ జీవో సీక్రెట్..

Big Stories

×