YS Vijayamma: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే తెలిసే ఉంటుందిగా.. కానీ కొన్ని సార్లు ఎరుకై చేసిన తప్పిదంలో ఇరుక్కొని ఎంత తప్పించుకోవాలన్నా.. అది కుదరనే కుదరదు. సేమ్ టు సేమ్ అలాంటిదే ఇది అంటూ వైసీపీని ఉద్దేశించి టీడీపీ విమర్శిస్తోంది. ఏకంగా మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరిట ఫేక్ లెటర్ సృష్టించిన ఘనత వైసీపీకే దక్కుతుందని, వారెవ్వా అంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సోమవారం సాయంత్రం వైయస్ విజయమ్మ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలచి వేస్తోందని, లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే తీవ్ర మానసిక ఆవేదన కలుగుతున్నట్లు విజయమ్మ చెప్పినట్లుగా లేఖ ద్వారా వివరించారు.
అలాగే గతంలో జరిగిన తన కారు ప్రమాదంకు సంబంధించి, మాజీ సీఎం జగన్ పై దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుప్సాకరంగా ఉందని, అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే తప్పుగా చిత్రీకరించి, భయపడి విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని లేఖలో ప్రచురితమైంది. ఇకపై ఇటువంటి అసత్యాలను ప్రచారం చేస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదంటూ విజయమ్మ చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖను విడుదల చేసింది.
Also Read: Aghori In Kushna Palli: అఘోరీ నాగ సాధువు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వందల సంఖ్యలో అఘోరాలు రానున్నారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా లేఖను విడుదల చేసిన కొద్ది క్షణాలకే, టీడీపీ సైతం అదిరిపోయే ట్విస్ట్ వైసీపీకి ఇచ్చిందని చెప్పవచ్చు. గతంలో షర్మిళకు మద్దతుగా వైయస్ విజయమ్మ విడుదల చేసిన లేఖలోని సంతకం, సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లేఖలోని సంతకం ఒకటే కాదని, విజయమ్మ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించారంటూ టీడీపీ రివర్స్ ఎటాక్ ప్రారంభించింది.
వైఎస్ విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ
విజయమ్మ సంతకం కూడా వాళ్లే పెట్టి విడుదల చేశారన్న టీడీపీ
కొద్ది రోజుల క్రితం షర్మిల రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి.. ఈ రోజు విడుదలైన లేఖలో సంతకానికి ఏ మాత్రం కుదరని పొంతన@JaiTDP @iTDP_Official… https://t.co/Xa4PQKOxfT pic.twitter.com/V76xFymyou
— BIG TV Breaking News (@bigtvtelugu) November 4, 2024
రెండు సంతకాలు ఒకేలా లేవంటూ.. స్వయంగా జగన్ తల్లి పేరుతో ఫేక్ లెటర్ సృష్టించి విడుదల చేయడం వైసీపీకి చెల్లిందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ ప్రచారంపై మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించకపోవడం విశేషం. ఇంతకు వైసీపీ విడుదల చేసిన లెటర్ ఫేక్ అవునో, కాదో కానీ టీడీపీ ఇచ్చిన షాక్ మామూలుగా లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ స్పందించి ఈ లేఖపై క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తేలనుందని చెప్పవచ్చు.