EPAPER
Kirrak Couples Episode 1

YS Sharmila : షర్మిల ఎఫెక్ట్.. చతికిల పడ్డ కాంగ్రెస్‌లో కదలిక..

YS Sharmila : రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు జనరల్ ఎలక్షన్స్‌లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌లో.. వైఎస్ షర్మిల ఎంట్రీతోహడావుడి మొదలైంది.. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు.. ఏపీ కాంగ్రెస్‌లోకి ఆమె వస్తున్నారనగానే కనిపించింది.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాను షర్మిలతో కలసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు.. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా ఆమె రాకను స్వాగతించారు.. ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టగానే షర్మిల.. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు.. అంత వరకు బానే ఉన్నా కాంగ్రెస్‌కు దూరమైన ట్రెడిషనల్ ఓటు బ్యాంకును షర్మిల తిరిగి వెనక్కి రప్పించగలరా?… రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్లగలుగుతారా?

YS Sharmila : షర్మిల ఎఫెక్ట్.. చతికిల పడ్డ కాంగ్రెస్‌లో కదలిక..

YS Sharmila : రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు జనరల్ ఎలక్షన్స్‌లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌లో.. వైఎస్ షర్మిల ఎంట్రీతోహడావుడి మొదలైంది.. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు.. ఏపీ కాంగ్రెస్‌లోకి ఆమె వస్తున్నారనగానే కనిపించింది.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాను షర్మిలతో కలసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు.. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా ఆమె రాకను స్వాగతించారు.. ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టగానే షర్మిల.. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు.. అంత వరకు బానే ఉన్నా కాంగ్రెస్‌కు దూరమైన ట్రెడిషనల్ ఓటు బ్యాంకును షర్మిల తిరిగి వెనక్కి రప్పించగలరా?… రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్లగలుగుతారా?


ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత దారుణంగా దెబ్బతింది.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడనంత ఘోర పరాజయం ఆంధ్రాలో చవిచూసింది.. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోవడమే మానేశారు .. ఇక ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న బీజీపీపై కూడా ఏపీ వాసులకు అదే కోపం కనిపిస్తోంది.. ఆ ఎఫెక్ట్‌తో 2019లో దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలో లేనంత తక్కువ ఓట్లతో ఆ రెండు జాతీయ పార్టీలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది

అలాంటి రాజకీయ వాతావరణంలోనూ బీజేపీతో పోల్చిచూస్తే, కాంగ్రెస్ పరిస్థితే కాస్త మెరుగ్గా ఉందని లెక్కలు చెబుతున్నాయి.. 2019 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఆంధ్రప్రదేశ్‌లో 1.17 శాతం ఓట్లు వచ్చాయి.. అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే లక్ష ఓట్లు ఎక్కువ దక్కించుకోగలిగింది కాంగ్రెస్.. అప్పుడే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.31 శాతం ఓట్లు దక్కాయి.. ఏపీ కాంగ్రెస్ పరిస్థితి అంత దారుణంగా తయారైనా.. రఘువీరా రెడ్డి, కేవీపీ, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ వంటి నాయకులు పార్టీనాయకులు పార్టీని వీడలేదు.. ఇప్పుడు షర్మిల రాకతో మళ్లీ ఆంధ్రా కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుందని ఆ పార్టీ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


షర్మిల పీసీసీ ప్రెసిడెంట్‌ అవ్వడంతో తో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల మార్పుపై చర్చ మొదలైంది.. అటు జగన్‌తో పనిచేయలేక, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వంటి పార్టీల్లో చేరడం ఇష్టంలేక.. పార్టీలోనే ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులంతా షర్మిల రాకను మూకుమ్మడిగా స్వాగతిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీటు నిరాకరించడంతో ఏం చేయాలా అని ఆలోచినస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి.. షర్మిల – కాంగ్రెస్ కాంబినేషన్ కలసి వచ్చినట్లైంది. ఆయన తరహాలోనే వైసీపీలో ఉన్న అసంత‌ృప్తి నేతలు కాంగ్రెస్ బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌కు.. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అనామకంగా మారడం కలిసి వచ్చింది.. అప్పటి వరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న దళిత, రెడ్డి, ముస్లింలతో పాటూ ఇతర కులాల్లోని కాంగ్రెస్ సానుభూతిపరులు వేరే ఆల్టర్‌ నేటివ్ లేక జగన్‌ పక్షాన చేరారు. 2019 ఎన్నికల్లో జగన్ ఆ కాంబినేషన్‌ని మరింత బలపరచి, గతంలో కాంగ్రెస్‌కి ఎన్నడూ పనిచేయని బీసీ కులాలను కూడా తన వైపుకు తిప్పుకోగలిగారు.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆ నాటి పాత కాంగ్రెస్ ఓటర్లను తిరిగి ఆకర్షించే పడిలో పడ్డారు.

ఓటు బ్యాంకు అలా మళ్లే పరిస్థితి ఉందని తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచిన తెలంగాణ ముస్లింలు చాలా మంది, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయి అన్న ప్రచారం కాంగ్రెస్‌కు ప్లస్ అయి అక్కడ పవర్‌లోకి వచ్చింది. ఏపీలో కూడా అదే అస్త్రాన్ని షర్మిల సంధిస్తున్నారు.. ఏపీలో జగన్ ప్రభుత్వం, పత్రిపక్షాలు కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యాయని టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు.

దాంతో ఇంతకాలం వైసీపీకి మద్దతిచ్చిన.. బీజేపీని వ్యతిరేకించే వర్గాలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు.. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలో అన్నివిధాలా అండగా నిలిచారు. షర్మిల దంపతులు.. తెరవెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టడంలో షర్మిల భర్త అనిల్ కీలక పాత్ర పోషించారు.. అలాంటాయన జగన్ పగ్గాలు చేపట్టిన రెండున్నర ఏళ్లకు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో ఆయా వర్గాల నేతలతో ఆయన మీటింగులు కూడా పెట్టారు.. దాంతో అనిల్ ఏపీలో పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది.

వచ్చే ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కాంగ్రెస్‌కు ప్రచారం చేయడం ఖాయం. క్రైస్తవ మతప్రభోదకులైన ఆయన ఇంపాక్ట్ ఆ వర్గంపై ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రంలో క్రైస్తవుల ఓట్లు దాదాపు 20 శాతం ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే.. మణిపూర్‌లో చర్చిలపై దాడులు ఒక క్రైస్తవురాలిగా తనను బాధించాయని. ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ అయి ఉండి మణిపూర్ హింసమై మాట్లాడని జగన్ క్రైస్తవ వ్యతిరేకని ధ్వజమెత్తారు.

జగన్‌ క్రైస్తవుడే అయినా బీజేపీతో ఉన్న అనుబంధం మూలంగా ఒక్కసారి కూడా మణిపూర్ విషయంలో పెదవి విప్పలేదన్న విమర్శలున్నాయి.. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే.. జగన్ వైపు నిలిచిన ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంతో పాటు.. వైసీపీలో జగన్ వైఖరితో అసంతృప్తి ఉండి కూడా.. వేరేపార్టీలలో చేరలేని నాయకులను ఆకర్షించే పనిలో పడింది కాంగ్రెస్.. షర్మిల ఓటు బ్యాంకును తిరిగిరాబట్టే పనిలో ఉంటే.. ఆమెకు గాడ్ ఫాదర్స్ లాంటి కేవీపీ, రఘువీరారెడ్డి వంటి సీనియర్లు అటువంటి నేతలతో ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నారంట..

మొత్తమ్మీద షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో స్థబ్ధత తొలగిపోయి.. కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో అభ్యర్ధుల కోసం వెతుకున్న ఆ పార్టీ ఆ లోటు తీరిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తమ్మీద షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు ఖుషీ అవుతున్నట్లు కనిపిస్తుంటే.. వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు..

అందుకే వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. షర్మిల తన ప్రసంగంలో జగన్‌ని పేరుపెట్టి సంభోదించడంపై వైవీ సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తే.. సజ్జల వంటి నేతలు వైఎస్ షర్మిల పేరులో వైఎస్‌ని తీసేసి పలుకుతున్నారు.. ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. మొత్తానికి రేపు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏ పార్టీ కొంపముంచుతుందో కాని.. చతికిల పడిపోయిన కాంగ్రెస్.. చకచకా అడుగులు వేయం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×