EPAPER
Kirrak Couples Episode 1

YS Sharmila | షర్మిల చేరికతో కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టిన వైసీపీ.. రాష్ట్ర విభజనపై మళ్లీ పాలిటిక్స్

YS Sharmila | సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ.. మిగులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాముఖ్యం కోల్పోయింది. 2014లో విభజనను వ్యతిరేకించిన ఆంధ్రావాసుల మనోభావాలు దెబ్బతినడంతోనే ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజలు సుముఖంగా లేరు.

YS Sharmila | షర్మిల చేరికతో కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టిన వైసీపీ.. రాష్ట్ర విభజనపై మళ్లీ పాలిటిక్స్

YS Sharmila | సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ.. మిగులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాముఖ్యం కోల్పోయింది. 2014లో విభజనను వ్యతిరేకించిన ఆంధ్రావాసుల మనోభావాలు దెబ్బతినడంతోనే ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజలు సుముఖంగా లేరు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలహీనమైపోయింది.


నిజానికి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలనుకుంది. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, మోదీ నాయకత్వంలో బిజేపీ విజయం సాధించింది. అయినా విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు బిజేపీ కూడా సమర్థించింది. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఎన్నికల తరువాత మోదీ మాట తప్పారు. పైగా 2014లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదాపై ఎన్నికల ప్రచారం కూడా చేశారు. తీరా గెలిచాక ప్రత్యేక హోదాపై మోదీతో పోరాడే ధైర్యం తనకు లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.

కట్ చేస్తే.. ఇప్పుడు జననేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లీ ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. ఈ పరిణామంతో వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదు. విభజన జరిగినప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏ మాత్రం నోరు విప్పని వైసీపీ నేతలు ఇప్పడు ఒక్కసారిగా విమర్శలు మొదలుపెట్టారు.


షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకనే ఆమె వెంట ఇప్పటికే పలువురు వైసీపీ రెబల్ నేతలు క్యూకడుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుని తనవైపు తిప్పుకోగల సత్తా షర్మిలకు ఉందని గుర్తించిన వైసీపీ నాయకులలో ఇప్పటికే ఆందోళన కనిపిస్తోంది.

అందుకే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన గాయాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే.. ”జగన్‌ను జైలుకు పంపించారు. ఏపీని విభజించారు. ఏపీ హక్కులను పట్టించుకోలేదు, గాలికొదిలేశారు. జగన్‌కు క్షమాపణలు చెప్పాలి,” అని విమర్శలు చేయడం ప్రారంభించారు. షర్మిలపై నేరుగా విమర్శలు చేస్తే.. వైఎస్ఆర్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని.. కాంగ్రెస్ పార్టీని, సోనియా, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.

జగన్ జైలులో ఉన్న సమయంలో ఎంతో చాకచక్యంతో.. వైసీపీని కాపాడిన షర్మిలకు పార్టీలో అన్యాయం జరిగిందని ఏనాడూ మాట్లాడని ఈ నేతలు.. ఇప్పుడు ఏమీచేయలేక.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు.

మరోవైపు 2014లో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు గెలిచాక మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్ర ప్రజలకు మోసం చేసినా.. జగన్ రెడ్డి పార్టీ మాత్రం కేంద్రంలో బీజపీ ఆదేశాలను ”చిత్తం ప్రభూ” అంటూ శిరస్సు వంచి పాటిస్తుంది. ఇదీ వైసీపీ తీరు.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×