EPAPER

YS Sharmila : ఏపీలో ఇక షర్మిల వర్సెస్ జగన్.. కడప నుంచి పోటీ చేయనుందా?

YS Sharmila : షర్మిల పొలిటికల్ జర్నీపై తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చెల్లెలి రాక అన్న జగన్ పార్టీపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ ఓట్లు చీలుతాయన్న భయంలో వైసీపీ నేతలు ఉన్నారు. అదే సమయంలో షర్మిల ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆందోళనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మొత్తంగా షర్మిల రాక ఎవరికి కాక పుట్టిస్తుందోనన్న టెన్షన్ పెరుగుతోంది.

YS Sharmila : ఏపీలో ఇక షర్మిల వర్సెస్ జగన్.. కడప నుంచి పోటీ చేయనుందా?

YS Sharmila : షర్మిల పొలిటికల్ జర్నీపై తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చెల్లెలి రాక అన్న జగన్ పార్టీపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ ఓట్లు చీలుతాయన్న భయంలో వైసీపీ నేతలు ఉన్నారు. అదే సమయంలో షర్మిల ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆందోళనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మొత్తంగా షర్మిల రాక ఎవరికి కాక పుట్టిస్తుందోనన్న టెన్షన్ పెరుగుతోంది.


వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు. ఇప్పుడు ఇదే చర్చ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. రెండోసారి గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. ఈ సమయంలో షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అందులోనూ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే చాలా ప్రభావం పడుతుందని, వైఎస్ సానుభూతి ఓటర్లలో చీలిక వస్తుందన్న ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీలో టిక్కెట్లు దక్కని వారంతా, పక్క నియోజకవర్గాలకు వెళ్లడం ఇష్టం లేని వారంతా షర్మిల వెంట నడిచే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ వ్యవహారం మరెన్నో మలుపులకు కారణమవుతుదన్న చర్చ జరుగుతోంది. అసలే ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీకి రెడీ అవుతున్న టైంలో సీఎం జగన్ కు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ చాలా ఇబ్బందికర పరిస్థితులను తెస్తోంది.

ఏపీ రాజకీయాల్లో షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల రంగంలోకి దిగితే.. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయోనన్న ఆందోళనలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. అటు బీజేపీతోనూ పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో షర్మిల ప్రచారాలు చేస్తే.. జగన్ పై వ్యతిరేకంగా ఉన్న ఓటరు వర్గంలో చీలిక వచ్చి కొంత షర్మిల వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారు. అలా జరిగితే కొద్దో గొప్పో సీట్లలో ఎఫెక్ట్ ఉంటుందనుకుంటున్నారు. షర్మిల ఏపీ రాకపై అటు అధికార, ప్రతిపక్షాలు హైరానా పడడం చర్చనీయాంశమవుతోంది.


తెలంగాణ విజభన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచిస్తోంది. ఏ పదవి ఇవ్వాలన్నది రెండ్రోజుల్లో డిసైడ్ కానుంది. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ లోకి స్వాగతం అంటూ అక్కడి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, శైలజానాథ్ వంటి నాయకులు ఉన్నారు. షర్మిల వస్తే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అంటున్నారు. షర్మిల రాకపై తమకు హైకమాండ్ ఇప్పటికే సమాచారం అందించిందని గిడుగు రుద్రరాజు, సాకె శైలజానాథ్ చెప్పారు.

మొత్తంగా ఏపీలో అన్నకు వ్యతిరేకంగా ష‌ర్మిల రాజ‌కీయం ఎలా ఉండ‌బోతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో ష‌ర్మిల పొలిటికల్ జర్నీ హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆమె రాజ‌కీయ భవిష్యత్ పై చర్చ జరుగుతోంది. క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి ష‌ర్మిల పోటీ చేస్తార‌నే ప్రచారం కూడా స్థానికంగా జోరుగా సాగుతోంది. అదే జ‌రిగితే వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. అంటే అందరిదీ ఒకే కుటుంబం. మరి రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. షర్మిల చెబుతున్న విషయాల ప్రకారం ఖమ్మం, లేదంటే నల్గొండ పార్లమెంట్ పైనే ఫోకస్ పెడుతున్నారంటున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో ఎంట్రీకి ఒప్పుకుంటారా లేదా అన్నది కీలకంగా మారింది.

వైఎస్ కూతురిగా ఏపీ ప్రజల్లో జగన్ మాదిరే తనకూ క్రేజ్ ఉండొచ్చని షర్మిల అనుకుంటున్నారు. ఏపీ పుట్టినిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని గతంలో చెప్పిన షర్మిల తెలంగాణకే పరిమితం అవుతాననుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఏపీ రాజకీయాల్లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ తనయ అనే ట్యాగ్ లైన్ తో ఏపీ ప్రజలను షర్మిల ఎంత వరకు ఆకట్టుకుంటారన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ ను ఎలా ముందుకు నడిపిస్తారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

ys sharmila, confront, cm jagan, ysrcp, congress, ap politics, kadapa constituency, lok sabha elections,

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×