EPAPER

YS Sharmila | షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పు.. కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్!

YS Sharmila | వైఎస్ షర్మిల పొలిటికల్ రూట్ మ్యాప్ క్లియర్ అయింది. కాంగ్రెస్ లో జాయినింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. ఇప్పుడు షర్మిల ఎఫెక్ట్ ఏ రాష్ట్రంలో, ఏ పార్టీపై ఎక్కువగా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పెను మార్పు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ షర్మిల కొత్త పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది?

YS Sharmila | షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పు.. కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్!

YS Sharmila | వైఎస్ షర్మిల పొలిటికల్ రూట్ మ్యాప్ క్లియర్ అయింది. కాంగ్రెస్ లో జాయినింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. ఇప్పుడు షర్మిల ఎఫెక్ట్ ఏ రాష్ట్రంలో, ఏ పార్టీపై ఎక్కువగా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పెను మార్పు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ షర్మిల కొత్త పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది?


వైఎస్ షర్మిల రూట్ మార్చి పొలిటికల్ స్పీడ్ పెంచేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుని చాలా ప్రయత్నాలు చేశారు. పాదయాత్రలు చేశారు. నిరుద్యోగ దీక్షలు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం నాటి కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేశారు. అయితే ఎన్నికలు సమీపించినా ఆ పార్టీ పెద్దగా క్లిక్ కాలేదు. పేరున్న నేతలెవరూ జాయిన్ కాలేకపోయారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీకి దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. అప్పట్లోనే కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్న చర్చ జరిగింది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. షర్మిల రాజకీయ భవిష్యత్ పై క్లారిటీకి వచ్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు జనవరి 4 ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అంతేకాదు.. వైఎస్ఆర్ టీపీని విలీనం చేసేందుకు రెడీ అయ్యారు.

2024, జనవరి 4న ఢిల్లీలో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు వైఎస్ షర్మిల. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కూడా అందుకున్నారు షర్మిల. దీంతో అందుబాటులో ఉన్న నేతలతో లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్ లో షర్మిల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలీనంపై సంకేతాలు ఇచ్చేశారు. షర్మిల ప్రకటనతో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లైంది. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారని నాయకులు అంటున్నారు. ఇదొక విషయం అయితే.. భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పోషించబోయే పాత్ర ఏంటన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


తనతో మొదటి నుంచి ఉన్న నేతలతో వైఎస్ షర్మిల కొన్ని విషయాలపై కీలకంగా చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానని ప్రకటించారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందని, అదే సమయంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉండాలని అడిగారన్నారు. అయితే ఈ నిర్ణయాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు షర్మిల. భవిష్యత్ లో ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని అంటున్నారు. అదే సమయంలో అటు కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దిగే అంశంపైనా జోరుగా చర్చ సాగుతోంది.

ఈనెల 4న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత YS షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆమెకు ఏఐసీసీ లేదా ఏపీ పీసీసీ పదవి ఇస్తారని ప్రచారమైతే జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఫైనల్ గా ఏ పదవి ఇస్తారు.. షర్మిల ఏ పదవిలో ఉండేందుకు ఇష్టపడుతారన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

కాంగ్రెస్‌లో చేరికపై మీడియా ప్రశ్నకు సూటిగా షర్మిల రియాక్ట్ కాలేకపోయారు. అన్ని అంశాలపై రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తానన్నారు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పిన విషయంపై స్పందించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏపీలో మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అందులో భాగంగానే షర్మిలను పార్టీలోకి ఆహ్వానించింది. అక్కడ జగన్ కు చెక్ పెట్టడానికి షర్మిల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరిపినట్లు ప్రచారమైతే జరిగింది. షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడుకావడంతోనే కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించి, ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేసినట్లు గతంలోనూ చర్చ జరిగింది. నిజానికి ఇటీవలి కాలంలో షర్మిల ఒకటి రెండు సార్లు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో భేటీలు కూడా నిర్వహించారు. అవన్నీ ఇప్పుడు ఫలించాయి. మరి షర్మిల చేపట్టబోయే పదవి ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయన్నది కీలకంగా మారుతోంది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×