EPAPER

YS Sharmila : ‘జగన్ కేడీ’.. మాట ఇచ్చి తప్పారు..

YS Sharmila : తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా.. ఎంతటి త్యాగానికైనా.. పోరాటానికైనా సిద్ధం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్‌ఆర్‌, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు.

గాలేరు-నగరి ప్రాజెక్టులో మిగిలిన 50శాతం పనులు కూడా పూర్తి చేయలేదని వైసీపీ పాలనను షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని జగన్‌.. రాజశేఖర్‌రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.

వైసీపీని భుజాన వేసుకొని 3,200కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల పేర్కొన్నారు. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పులి కడుపున పులే పుడుతుంది.. ఎన్ని దాడులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారన్నారు. ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న జగన్‌ కూడా కేడీనేనని వ్యాఖ్యానించారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×