EPAPER

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో బయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చెడు సాంప్రదాయానికి సీఎం నాంది పలికారని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు.


దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని గుర్తించాలన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు 20 ఏళ్ల యువకుడిన దారుణంగా కొట్టారని అన్నారు. వైసీపీ నేత అజయ్‌పై దాడి చేయడం దారుణం అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని అన్నారు. అధికారం మారిన రోజు ఆ పాపాలే తనకు చుట్టుకుంటాయని గుర్తించాలన్నారు.

ఈ సంస్కృతి ఆపేయాలని చంద్రబాబును మరో సారి హెచ్చరిస్తున్నా.. ఇది సరైన పద్దతి కాదు అని చెప్పారు. వైసీపీపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వైసీపీ దాడులపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవు పలికారు.


Tags

Related News

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Big Stories

×