EPAPER

Andhra Pradesh : ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Andhra Pradesh : ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Andhra Pradesh : ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం జగన్‌. ఈ మేరకు ఇన్‌చార్జ్‌లను మార్చే ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలను మార్చడంతో నేతల్లో టెన్షన్‌ పట్టుకుంది. ఎవరిని ఉంచుతారో.. ఎవరిని ఊడబీకుతారోనన్న గుబులు మొదలైంది.


ఈ మేరకు విశాఖ వైసీపీ నేతలు టెన్షన్‌లో ఉన్నారు. విశాఖ జిల్లా అరకు, పాడేరు, అనకాపల్లి, పాయకరావుపేటలో మార్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇచ్ఛాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, చోడవరంపై కూడా కసరత్తు చేస్తోంది వైసీపీ.

అరకులో ఎంపీ మాధవి, పసుపులేటి బాలాజీ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పాడేరుకు విశ్వేశ్వర్‌రాజు, అనకాపల్లిలో బుడేటి సత్యవతి లేదా దాడి రత్నాకర్‌ను నియమించే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో మంత్రి అమర్‌నాథ్‌ను బరిలో దించే యోచనలో ఉంది. ఇచ్ఛాపురం ఇన్‌ఛార్జ్‌గా బీసీ వర్గానికి అవకాశమిచ్చే ఛాన్స్‌ ఉంది. పాతపట్నంలో రెడ్డి శాంతిని మార్చుతారని ప్రచారం సాగుతోంది.


అలాగే ఎచ్చెర్లలో చిన్న శ్రీను, బెల్లం చంద్రశేఖర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక చోడవరంలోనూ కొత్త ఇన్‌చార్జ్‌ నియామకానికి కసరత్తు చేస్తుండగా.. పాయకరావుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్ల బాబురావును మార్చే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×