EPAPER

YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

YS Jagan: మీకు పాలన చేతగాక మా కుటుంబ విభేదాలు తెరపైకి తెస్తున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉండే తతంగమే. మా ఫ్యామిలీని చూపిస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారంటూ తాజాగా మాజీ సీఎం జగన్, తమ కుటుంబ విభేధాలపై స్పందించారు.


విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్‌ జగన్ పరామర్శించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని జగన్ విమర్శించారు. అబద్దపుహామీలు గుప్పించి అధికారం చేపట్టిన కూటమి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాల మాటే మరచిపోయిందని, ప్రజల మదిలో పథకాల మాట వచ్చినప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు.

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి మరీ, ఇక్కడి స్థితిగతులను తెలుసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారన్నారు. గుర్లలో డయేరియా వ్యాధికి గురై, మృతి చెందిన ఘటనలు ఏనాడు జరగలేదని, ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. తాను మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందజేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులు చూస్తే భయం వేస్తుందని, మహిళలకు భద్రత ఉందా అనే రీతిలో సందేహం కలుగుతుందన్నారు.


ఇటీవల మాజీ సీఎం జగన్, ఆస్తులకు సంబంధించి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళపై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జగన్ స్పందిస్తూ.. ప్రతీ ఇంట్లో జరిగేదే తన ఇంట్లో జరిగిందని, కానీ ప్రతి సారి డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి పాల్పడుతుందన్నారు. అలాగే తన తల్లి, చెల్లి ఫోటోలను చూపిస్తూ టీడీపీ తెగ ఆనందం పడుతుందన్నారు. ముందు ప్రజా పరిపాలన సాగించండి.. అంతేగానీ ప్రక్క చూపులు మానండంటూ జగన్ హితవు పలికారు. ఎప్పుడూ మా కుటుంబంపై ఏడ్చే బదులు, రాష్ట్రంలోని అఘాయిత్యాలు, నేరాలు వీటిని అడ్డుకోండి అంటూ జగన్ అన్నారు.

తాను ఎక్కడ పర్యటనకు వెళుతున్నా ప్రభుత్వం భయపెడుతోందని, 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సమయంలో రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయని కూటమి, పక్కా ప్లాన్ తో తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు జగన్. ఇప్పుడు శాంతిభద్రతలు సన్నగిల్లిన సమయంలో, తన అనుకూల మీడియా ద్వారా తమ కుటుంబం గురించి పదే పదే టీవీలలో చూపిస్తూ, కూటమి నేతలు సంబరపడుతున్నట్లు తెలిపారు.

Also Read: Vivekam Movie : మిమ్మల్ని రోడ్డున నిలబెడతాడు.. షర్మిల, విజయమ్మతో వివేకా.. ఆ మూవీ డైలాగులే నిజమయ్యాయిగా!

ఇలా తొలిసారిగా తన కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించి జగన్ స్పందించగా,  హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మహిళలంటే జగన్ కు ఏమేరకు గౌరవం ఉందో, తల్లి చెల్లిపై కోర్టు మెట్లెక్కినప్పుడే అర్థమవుతుందన్నారు.

Tags

Related News

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Nara Lokesh US Tour: అమెరికా వెళ్లిన నారా లోకేష్.. వారం రోజులు అక్కడే.. టార్గెట్ మాత్రం అదే!

YS Vivekananda: డబ్బు మహా పాపిష్టిది.. జగన్ ఆస్తుల వివాదంపై వైఎస్ వివేకా ఆత్మ ట్వీట్, అదెలా సాధ్యం?

Big Stories

×