EPAPER

YS Jagan: జగన్ ఎందుకొచ్చారు? ఎందుకెళ్లారు?

YS Jagan: జగన్ ఎందుకొచ్చారు? ఎందుకెళ్లారు?

YS Jagan Criticism on Chandrababu Naidu: కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటించి బెంగళూరు వెళ్లిపోయారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దాటి పొలంలోకి దిగని ఆయన.. పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాల్లో మాత్రం హడావుడి చేసి వెళ్లారు. ముంపునకు గురైన ప్రాంతాలను చూడమని అక్కడి వారు అడిగినా ఆయన వెళ్లలేదు. ఇక ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  బెజవాడ తరహాలోనే ఏలేరు వరదలు కూడా.. మాన్ మేడ్ డిజాస్టర్ .. అని వ్యాఖ్యనించి విమర్శల పాలవుతున్నారు. అసలు ఆయన ఎందుకొచ్చారో? ఎందుకెళ్లారో? అని అక్కడ జనం చర్చించుకోవడం కనిపించింది.


కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్ట్ వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఆ వరదలు కూడా కూటమి సర్కారు వైఫల్యమేనని తేల్చేశారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పైపైన తిరగేసి వెళ్లిపోయిన ఆయన.. చంద్రాబాబుని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడా గట్టు దాటి పొలంలోకి దిగని ఆయన.. నెత్తిన చేతులు ఉంచుతూ, ముద్దులు పెడుతూ కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

ఈ సందర్భంగా తన ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధించుకునే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్‌ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండడం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టు వివరించారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేయాలంటే క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా నాడు వదిలేశామని విచిత్ర వాదన వినిపించారు.


ఏలేరు ఆధునికీకరణ చేయకపోవడం వల్లే వరద కాకినాడ జిల్లాను చాలావరకు ముంచేసింది. దానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విజయవాడ, ఏలేరు వరదలు మ్యాన్‌మేడ్‌ వరదలంటూ అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్.. వాస్తవానికిజగన్‌ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వాటిని రద్దు చేశారు. ఐదేళ్లూ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. అయితే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు.

Also Read: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్..

పంటనష్టాలను యాప్‌ సహాయంతో ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే, జగన్‌ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అక్కసును వెళ్లగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని, పవన్‌కల్యాణ్‌ సినిమా ఆర్టిస్ట్‌ అని విమర్శించారు.

బెజవాడలో రెండు సార్లు పర్యటించిన జగన్ పిఠాపురంలో ఒక సారి పర్యటించిన జగన్ వరదలను మ్యాన్ మేడ్ డిసాస్టర్‌ అనడాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ యద్దేవా చేశారు… గత అయిదేళ్లలో జగన్ పరిపాలనే రాష్ట్రానికి పెద్ద మాన్ మేడ్ డిసాస్టర్ అని విమర్శించారు.

జగన్ వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చడానికి.. కానీ, జగన్‌ కాకినాడ జిల్లా పర్యటనలో ఇవేవీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడింది లేదు. కారుదిగి రెండడుగులు కూడా నడవకుండానే రోడ్లపైనే వారితో పొడి పొడిగా మాట్లాడి మమ అనిపించేశారు. ఏలేరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం అతలాకుతలం కాగా.. నిరసనలు, నిలదీతల భయంతో ఆ మండలాన్ని కాదని ఆ పక్కనే ఓ మోస్తరు ముంపు ఉన్న పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపునకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

2022లో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు గొల్లప్రోలులో ఓ సభకు హాజరై ఏలేరు ఆధునీకరణ ఫేజ్‌1, ఫేజ్‌2 పనులకు 292 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి . ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు వస్తాయనే భయంతో పెద్దగా నష్టం లేని పర్యటించి వెళ్లారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పర్యటన పూర్తి చేసిన జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×