EPAPER

YS Family War in Kadapa: చీలిన వైఎస్ కుటుంబం.. కడప గడపలో న్యాయపోరాటం

YS Family War in Kadapa: చీలిన వైఎస్ కుటుంబం.. కడప గడపలో న్యాయపోరాటం
Family War in Kadapa
Family War in Kadapa

YS Avinash Reddy Vs YS Sunitha in Kadapa Constituency in AP Elections 2024 : పొలిటికల్‌గా అసలుసిసలు ఫ్యామిలీ వార్‌కు కడప వేదికైంది. వైఎస్ కుటుంబంలో అన్నదమ్ములపై యుద్దం ప్రకటించిన అక్కాచెల్లెళ్లు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యనే ఆయుధంగా మార్చుకున్నారు. సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావని సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల విరుచుకుపడుతున్నారు. వివేకాను హత్య చేసిన వారికే జగన్ మళ్లీ సీటిచ్చారని వైఎస్ సునీత డైరెక్ట్‌గా అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక కడప ఎంపీ అభ్యర్ధిగా ప్రచారం ప్రారంభించిన షర్మిల అటు ఫైర్‌బ్రాండ్‌గా చెలరేగిపోతూనే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తనలోని మరోకోణం చూపిస్తుండటం ఆసక్తి రేపుతోంది.


కడప ఎంపీగా అటు టీడీపీ నుంచో.. లేకపోతే ఇటు కాంగ్రెస్ నుంచో ఈ సారి దివంగత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఒక వేళ డాక్టర్ ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేకా కుటుంబం నుంచి ఎవరోఒకరు పోటీలో ఉంటే టీడీపీ, జనసేనలు మద్దతిస్తాయని భావించారు. అయితే అన్ని పార్టీ అభ్యర్ధుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీకి సిద్దమయ్యారు.

రాయలసీమలో.. అదీ వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం చీలిపోయింది. రెండు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి అటు జగన్‌తో పాటు అవినాష్ ఫ్యామిలీపై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిలను సీబీఐ నిందితుడిగా తేల్చిందని.. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెటిచ్చి ఓట్లు వేయాలని అడగటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.


Also Read: కాంట్రవర్సీల కంగనా.. తొలి ప్రధానినే మార్చేసిందిగా.. ఈమెకా ఎంపీ సీటు ?

కడప జిల్లా రాజకీయాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ప్రభావితం చేశారో.. వివేకా కూడా అంతే పాత్ర పోషించారు. వైఎస్ రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయం వివేకా కనుసన్నల్లోనే నడిచేది. సౌమ్యుడిగా అందరితో కలిసిపోయే నేతగా పేరున్న వివేకాకు కడప జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వివేకా కుమార్తె సునీత.. హంతకులకు ఓటేయవద్దని కోరడం ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. సునీత న్యాయపోరాటానికి మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల అవినాష్‌రెడ్డిపై పోటీకి దిగడంతో.. వైసీపీకి కడపలో కష్టకాలం స్టార్ట్ అయిందంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు జగన్‌ని.. ఇటు టీడీపీని కూడా వైఎస్ సునీత ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దిగిన ఆ ఫైర్‌బ్రాండ్. అవినాష్‌కు చెక్ పెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే.. జగన్ ఆమెకు టికెట్ ఇవ్వకుండా బాబాయ్ కొడుకు అవినాష్‌ను పోటీకి దించారు. 2019లో వివేకా ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పినా జగన్ పట్టించుకోలేదంట. ఇప్పుడు షర్మిల దానికి బదులుతీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా వైఎస్ సునీతను వెంటపెట్టుకుని కడపలో ప్రచారం మొదలుపెట్టిన షర్మిల ఎన్నికల ప్రచారంలో తనలోని మరోకోణం చూపిస్తున్నారు. బాబాయ్ హంతకులు ఓటు వేస్తారా అని అడుగుతూ.. సెంటిమెంట్ టచ్ ఇస్తున్నారు. తమను ఆశీర్వదించమని ఓటర్లను అడుగుతున్న తీరు ఆ సెంటిమెంట్‌ను పండిస్తున్నట్లే కనిపిస్తోంది.

Also Read: ఆమంచి రూటెటు?మొదటికే మోసం!

మరోవైపు వైఎస్ వివేకాను చంపిన వాళ్లకు, వైఎస్ బిడ్డ షర్మిలకు మధ్య పోటీ జరగుతుందని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు సునీత. తన తండ్రి చివరి కోరిక షర్మిలను ఎంపీగా చేయాలని.. ఆయన చివరి కోరికను నెరవేర్చాలని సునీత కోరుతున్నారు. వైసీపీ హంతకుల పార్టీ అంటూ ఆ అక్కాచెల్లెల్లు చేస్తున్న ప్రచారం అధికారపక్ష శ్రేణులను టెన్షన్ పెడుతుందంట. వారి ప్రచారానికి జనంలో వస్తున్న స్పందన వైసీపీ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందంటున్నారు. మొత్తమ్మీద వైఎస్ ఫ్యామిలీ వార్ ఈ ఎలక్షన్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×