EPAPER
Kirrak Couples Episode 1

YCP War of Words | వ్యతిరేకత జగన్‌పైన నేతలు మారుస్తే ఏమవుతుంది?.. వైసీపీతో టిడీపీ డైలాగ్ వార్

YCP War of Words | వైసీపీ నేతల నియోజకవర్గాల మార్పు టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ కు కారణమవుతోంది. ఓటమి భయంతోనే జగన్ అభ్యర్థుల్ని మార్చే పనిలో పడ్డారని కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు తమ పార్టీలో ఇంఛార్జులను మారిస్తే టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటని వైసీపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు పొత్తులతో అధికారం కోసం కుటుంబాలను చీల్చే కుట్రలు చాలా జరుగుతాయని సీఎం జగన్ అనడం కీలకంగా మారింది.

YCP War of Words | వ్యతిరేకత జగన్‌పైన నేతలు మారుస్తే ఏమవుతుంది?.. వైసీపీతో టిడీపీ డైలాగ్ వార్

YCP War of Words | వైసీపీ నేతల నియోజకవర్గాల మార్పు టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ కు కారణమవుతోంది. ఓటమి భయంతోనే జగన్ అభ్యర్థుల్ని మార్చే పనిలో పడ్డారని కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు తమ పార్టీలో ఇంఛార్జులను మారిస్తే టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటని వైసీపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు పొత్తులతో అధికారం కోసం కుటుంబాలను చీల్చే కుట్రలు చాలా జరుగుతాయని సీఎం జగన్ అనడం కీలకంగా మారింది.


ఏపీ రాజకీయాలు మరో లెవెల్ కు వెళ్తున్నాయి. ఎన్నికలు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే వేడి రాజుకుంది. ముఖ్యంగా వైసీపీ రెండోసారి అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయిలో ప్రయోగాలు చేస్తోంది. వస్తే బంపర్ మెజార్టీ లేదంటే లేదు అన్నట్లుగా నేతలను సెగ్మెంట్లు మారుస్తున్నారు. సిట్టింగ్ లను పక్కన పెడుతున్నారు. అయితే ఇదే విషయంపై ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేలపై కాదని, జగన్ పైనే జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను తప్పించడంపై ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. తమ అభ్యర్థుల్ని మారిస్తే టీడీపీకి వణుకు ఎందుకని కౌంటర్లు వేస్తున్నారు.

ఈ డైలాగ్ వార్ ఇలా కొనసాగుతుండగానే.. ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం, అధికారం కోసం రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని, కుటుంబాలను కూడా అడ్డగోలుగా చీలుస్తారంటూ మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పొత్తుల కోసం కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు. అంతేకాదు.. ఇంటికో కేజీ బంగారం, ఒక బెంజ్‌ కారు ఇస్తారమంటూ ఆఫర్లు కూడా చేస్తారన్నారు.


వైసీపీ అభ్యర్థులను మార్పుపై ఏపీ పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. కొంత మందిని పక్క నియోజవర్గాలకు మార్చుతుంటే.. మరి కొంతమందిని ఏకంగా జిల్లాలే మార్చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. దీనిపై టీడీపీ నేతలు అంతర్ రాష్ట్ర బదిలీలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. డబ్బు ఉన్నవారికే వైసీపీలో టికెట్లు ఇస్తున్నారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు.

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు జరుగుతుండడంతో పాటే.. అటు షర్మిల ఏపీ కాంగ్రెస్ లో అడుగు పెడుతుండడంతో చాలా మంది అసంతృప్తులు షర్మిల వెంట నడిచే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానే అన్నారు.

అయితే ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా… ఎత్తులు వేసినా… పార్టీలు మారినా, అసంతృప్తి పెరిగినా… ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ గెలిపిస్తాయని ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరి

Related News

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

Bhimili red sand hills: భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశం

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Bigtv Free Medical Camp: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

AP Politics: ఢిల్లీలో జగన్ ప్లాన్ రివర్స్, ఎంపీ సీటు ఖాళీ.. బీజేపీకే ఛాన్స్!

Big Stories

×