EPAPER
Kirrak Couples Episode 1

YCP Tension in AP | జగన్ నిర్ణయాలతో వైసీపీ నాయకులల్లో టెన్షన్.. ఒక్కసారిగా హీటెక్కిన ఏపీ పాలిటిక్స్!

YCP Tension in AP | అన్ని రోజులు ఒకలా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో. ఓవర్‌నైట్‌లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయి. ఒక రాష్ట్రంలో రూలింగ్ పార్టీకి వచ్చిన రిజల్ట్.. ఇంకో స్టేట్‌లో ఫలితాన్ని డిసైడ్ చేసింది. ఆ ఎఫెక్ట్ మరో రాష్ట్రంపై పడింది. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ ఏంటి? వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడ్డారు?

YCP Tension in AP | జగన్ నిర్ణయాలతో వైసీపీ నాయకులల్లో టెన్షన్.. ఒక్కసారిగా హీటెక్కిన ఏపీ పాలిటిక్స్!

YCP Tension in AP | అన్ని రోజులు ఒకలా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో. ఓవర్‌నైట్‌లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయి. ఒక రాష్ట్రంలో రూలింగ్ పార్టీకి వచ్చిన రిజల్ట్.. ఇంకో స్టేట్‌లో ఫలితాన్ని డిసైడ్ చేసింది. ఆ ఎఫెక్ట్ మరో రాష్ట్రంపై పడింది. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ ఏంటి? వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడ్డారు?


ఒక రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంలో ప్రభావం చూపిస్తాయా. అదేనండి పంచ్ ఇదర్ మారేగా… రీసౌండ్‌ ఉదర్‌ ఆగయా అన్నట్టుగా. ఈ కోట్‌ను ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ సరిగ్గా అర్థం చేసుకుంది. అందుకనే ముందుగా మేల్కొంది. డ్యామేజ్‌ జరగకముందే కంట్రోల్‌ చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా పార్టీలో ప్రక్షాళన మొదలెట్టింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నారు. సిట్టింగ్‌ల మీద ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇలాంటి ఫలితాలు ఎదురుకాకుండా సిట్టింగ్‌లను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. సుమారు 40 నుంచి 50 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా తొలిదశలో 11నియోజకవర్గాలలో ఇంఛార్జులను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం ద్వారా వారిపై ఉన్న ప్రజావ్యతిరేకతను తగ్గించవచ్చని ఆలోచిస్తున్నారు. అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత జగన్‌ ఎన్నికల వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది.


జస్ట్‌ త్రీ మంథ్స్‌. మరో మూడు నెలలు మాత్రమే సమయం. ఈలోగానే ఏం చేసినా చేయాలి. ఆ తర్వాత ఫలితాలు మన చేతుల్లో ఉండవు. అందుకే ఏపీలో అధికారపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ అలర్ట్‌ అయింది. గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తోంది వైసీపీ. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలనే టార్గెట్‌గా గ్రౌండ్‌వర్క్‌ మొదలుపెట్టింది. వాస్తవానికి వైసీపీ గత సంవత్సరకాలంగా ఎన్నికలకు పార్టీకేడర్‌ను సమాయత్తం చేస్తూనే ఉంది. కానీ తాజాగా పార్టీలో ప్రక్షాళన చేపట్టడంతో ఇక పూర్తిస్థాయిలో జగన్‌.. పార్టీపైనే ఫోకస్‌ పెట్టారని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. టీడీపీ పుంజుకునేలోగా చేయాల్సిన డ్యామేజ్‌ చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ కూడా వైసీపీ చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకుంటే సరిపోదు. ఇది ఆయనకు తెలియనది ఏం కాదు. సంక్షేమం ఒక్కటే తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించదని భావించిన జగన్ అనేక రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు పడాలి.. అనే ఆలోచనలో జగన్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడే అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత మాత్రం అంత తేలిగ్గా తీసిపారేయలేం. దీంతో పాటు నేతల మధ్య విభేదాలను కూడా పూర్తిగా తొలగించలేని పరిస్థితి. అట్లని తనను నమ్ముకున్న నేతలను వదులుకునేందుకు కూడా జగన్ సిద్ధంగా లేరు. వారికి స్థానాలు మార్చి అయినా సరే సీటు ఇవ్వాలన్న ధోరణితో జగన్‌ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. తన వెంట నడిచిన వారికి సీట్లు కేటయీస్తూనే రెండోసారి గెలవాలన్న లక్ష్యంతో జగన్‌ గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తున్నారని తెలిసిపోతోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది. గత ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో వైసీపీ జెండా ఎగరింది. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పాటు అప్పడు అధికారంలో లేకపోవడంతో అందరూ కలసి పనిచేశారు. కానీ ఈసారి అలా కాదు. అధికారంలో ఉండటంతో ఐదేళ్ల నుంచి నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలతో పాటు జనరల్ నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య విభేదాలు బాగానే ఉన్నాయి. అందుకోసమే ఎస్సీ నియోజకవర్గాల్లోని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే.. ప్రత్తిపాడు, కొండేపి, వేమూరు, తాడికొండ, సంతనూతలనాడు లాంటి ఎస్సీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌ లను మార్చేశాడు. ఇందుకు ప్రధాన కారణం.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో పాటు లోకల్ లీడర్స్ కూడా వారి పక్షాన నిలబడటం లేదని జగన్‌ కు సర్వే రిపోర్ట్‌స్‌ అందాయని తెలుస్తోంది. అలా మార్చడం వల్ల స్థానికంగా ఉన్న వ్యతిరేకత తొలిగిపోవడం, టికెట్‌ ఇవ్వలేదు అన్న అపవాదు కూడా ఉండదు.

గత కొద్దినెలలుగా వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది. 175 సీట్లే టార్గెట్‌గా.. క్లీన్‌ స్వీప్‌ దిశగా జగన్‌ ఎత్తుగడలతో ఎవరి సీటుకి ఎసరుపడుతుందోననే ఆందోళనతో వైసీసీ నేతలు టెన్షన్‌లో పడ్డారు. అయితే అంతా అనుకున్నట్టే.. జగన్ నిర్ణయాలతో ఏపీ రాజకీయాలు మాత్రం హీటెక్కాయని చెప్పుకోవాలి. మార్పులు చేర్పులతో జగన్‌ వ్యూహాలు రచిస్తుండటంతో వింటర్‌ సీజన్‌లోనూ వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఇక పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్.. సిట్టింగ్‌లను నమ్ముకుంటే కేసీఆర్‌లా నట్టేట మునగడం ఖాయమనుకున్నారో ఏమో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చే పనిలో పడ్డారు. ఈ ఎత్తుగడలో భాగంగానే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చారు జగన్‌. ఇది మంగళగిరితోనే మొదలు పెట్టారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో గంజి చిరంజీవిని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇదే విధానాన్ని అటు గాజువాకలోనూ అమలు చేశారు. గాజువాక ఇంచార్జ్ గావరికూటి రామచంద్రరావును నియమించారు. అయితే తనను తప్పించి ఓ కార్పొరేటర్ కు అవకాశం ఇవ్వడంపై ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి గుస్సా అయినట్టుగా ప్రచారం జరిగింది. ఆయన తనయుడు దేవన్ రెడ్డి.. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్పారు. కానీ రోజుమారగానే వాళ్ల స్వరం కూడా మారిపోయింది. తాము వైసీపీలోనే ఉంటామని, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తామంటూ వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు తండ్రి కుమారుడు. దీంతో గాజువాక ఇష్యూ అయితే సద్దుమనిగిందనే తెలుస్తోంది.

కేసీఆర్ లా ఏపీలో జ‌గ‌న్ ప‌దేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఐదేళ్లు మాత్ర‌మే పూర్త‌వ్వ‌బోతున్నాయి. అయిన‌ప్ప‌టికీ సిట్టింగుల మీద బ్లైండ్ గా వెళ్లిపోవ‌డానికి లేద‌ని జ‌గ‌న్ కు తెలంగాణ ఎన్నిక‌లు సందేశం ఇస్తున్నాయి. సిట్టింగుల ప‌నితీరు, నియోజ‌క‌వ‌ర్గంలో వారి ఇమేజ్, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను స‌ర్వేలుగా చేయించుకుని నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుకే ఈ షఫులింగ్స్. అంతా నేనే, నన్ను చూసే ఓటేస్తారు, సీఎం ఎవ‌ర‌నేది కొంత‌మంది ప్ర‌జ‌లు చూసే అంశ‌మే అయినా, స‌గం మంది ఎమ్మెల్యే ప‌నితీరును బ‌ట్టి కూడా నిర్ణ‌యం తీసుకుంటారు. దీన్ని విస్మ‌రించి కేసీఆర్ గ‌ట్టి దెబ్బ‌తిన్నారు. మ‌రోసారి అధికారాన్ని సంపాదించుకోవాలంటే జ‌గ‌న్ ఈ విష‌యాన్ని గ్ర‌హించి, వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల‌ను పక్కకు జరపాల్సిన సందేశాన్ని ఇస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. అందుకే జగన్ ప్రక్షాళన బాట పట్టారు. నిర్మోహమాటం లేకుండా పనితీరు బాగా లేని వారిని పీకిపడేస్తున్నారని రాజకీయవర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. ఇది ఆ పార్టీకి ఊహించని విజయాన్ని కట్టబెడుతుందా.. లేక ఘోరంగా డ్యామేజ్ చేస్తుందా అనేది మున్ముందు తెలుస్తుంది.

Related News

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Big Stories

×