EPAPER

Anchor Shyamala: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

Anchor Shyamala: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

Anchor Shyamala: జగన్ బాటలో అధికార ప్రతినిధులు వెళ్తున్నారా? మీడియాకు మసాలా ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారా? అధికారంలో ఉన్న పద్దతినే నేతలూ ఫాలో అవుతున్నారా? రోజా లాంటి ఫైరున్న నేతలను ఆ పార్టీ దూరంగా పెట్టిందా? కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కొత్త ప్లాన్ వేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏపీలో అధికార కోల్పోయాక వైసీపీ ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ఏదైనా అంశంపై  నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడేవారు ఆ పార్టీ నేతలు. వైసీపీలో ఆ పరిస్థితి మారింది. ఇప్పుడంతా స్టూడియోలో రికార్డు చేసి, ప్రెస్‌మీట్‌లను రిలీజ్ చేస్తున్నారు.

జగన్ మొదలు మంగళవారం యాంకర్ శ్యామల పెట్టిన ప్రెస్‌మీట్ కూడా ఈ కోవకి చెందినదే. మీడియాకు ఎలాంటి మసాలా ఇవ్వకుండా ప్రత్యర్థులను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా కనిపిస్తోంది. వైసీపీ కావాలనే యాంకర్ శ్యామలాను అధికార ప్రతినిధిగా నియమించింది. ప్లాన్ ప్రకారం ఆమెతో మీడియా సమావేశాలు పెట్టిస్తోంది.


కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారామె. జగన్ దగ్గర నుంచి శ్యామల వరకు మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి, వారు మాట్లాడే మాటలను ట్రోల్ చేస్తున్నారు టీడీపీ, జనసేన మద్దతుదారులు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది ఫ్యాన్ పార్టీ.

ALSO READ: ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

ఆ పార్టీలో మాట్లాడేందుకు చాలామంది నేతలున్నా, కేవలం యాంకర్ శ్యామలను ఎంచుకోవడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. ఆమెని పదేపదే ట్రోల్ చేయడంపై పోలీసులు పట్టించుకోలేదంటూ ప్రభుత్వంపై బురద జల్లించడమే ప్లాన్‌గా కనిపిస్తోంది.

శ్యామలాకు ఆ పదవి ఇచ్చినప్పుడే రాజకీయ విశ్లేషకులు టీడీపీ, జనసైనికులు ఆమె ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నదదే. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయన్నది ఆ పార్టీ నేతల అంతర్గత చర్చ. ఈ అంశాన్ని సినీ పరిశ్రమకు లింకు పెట్టే ప్రయత్నం చేశారామె.

చిత్ర సీమ నుంచి వస్తే అంత అలుసుగా చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు వైసీపీ శ్యామల. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ సినీ పరిశ్రమ నుండి రాలేదా? అంటూ గుర్తు చేశారు. రీసెంట్‌గా తెలంగాణలో జరిగిన పరిణామాలను గమనించిన వైసీపీ నేతలు, ఈ స్కెచ్ వేశారని అంటున్నారు.

శ్యామల మాటలపై కౌంటర్లు ఇచ్చేవాళ్లు లేకపోలేదు. రాజకీయాలంటే రాళ్లు, రప్పలు, వ్యక్తిగత ఆరోపణలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. టీడీపీలో జయప్రద లాంటి మహిళలు పని చేయలేదా? ఈ విషయంలో వైసీపీ తరపున  ఉద్యమం చేస్తామని, అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలో చూపిస్తామన్నది ఆమె (Shyamala) వెర్షన్.

 

Related News

BJP Leader Narendra Viral Video: నాడు అంబటి.. నేడు నరేంద్ర.. ఎవరీ సుకన్య?

Kamalapuram: కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్‌కు టీడీపీ ఝలక్

AP bullet train: ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

Viral News: ఆయన కొడుకు పేరు 1, 2, 6.. అనంతపురంవాసి వెరైటీ ఆలోచన, దాని అర్థం ఏమిటో తెలుసా?

Jagan: జనంలోకి జగన్.. దూరంగా సీనియర్లు, ఎందుకు?

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

×