EPAPER

Union Budget 2024: ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్

Union Budget 2024: ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్

YSRCP: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతికి రూ. 15 వేల కోట్లు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, చంద్రబాబు నాయుడు సారథ్యంపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ పరిణామంపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి చాలా మందిలో ఏర్పడింది. అసలు వైసీపీ ఈ పాజిటివ్ డెవలప్‌మెంట్ పై ఎలాంటి కామెంట్ చేయదనీ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వైసీపీ ట్విట్టర్ వేదికగా పెద్ద కామెంటే చేసింది.


2014-19 మధ్య ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా లాంటి హడావుడే చేశారని, ఇలాంటి ప్రచారాలు చేసుకునే డబ్బా కొట్టుకున్నారని వైసీపీ విమర్శించింది. ‘2016 సెప్టెంబరులో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక సహాయంకు అంగీకరించి చంద్రబాబు ఏపీ ప్రజలను దారుణంగా మోసంచేశారు. అర్థరాత్రి అద్భుత ప్రకటన అంటూ నానా హడావిడి చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం స్వర్గం అవుతుందా? అంటూ కామెంట్‌ చేసి రాష్ట్రం హక్కుపై ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన చేతులతో తానే నీళ్లు జల్లాడు చంద్రబాబు. ప్రత్యేక ఆర్థిక సహాయంతో రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్న భావనను కలిగించి, ఎల్లోమీడియాతో ఊదరగొట్టించి.. చివరకు ఏమీ జరగలేదన్నది ప్రజలకు తెలియంది కాదు. ఇవ్వాళ కూడా అలాంటి ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని వైసీపీ విమర్శలు చేసింది.

‘విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఇచ్చిన హామీలు, ఆ తర్వాత ప్రధానమంత్రి పార్లమెంటులో ఇచ్చిన హామీలు.. ఇవన్నీ రాష్ట్రానికి ఒక హక్కు కింద రావాల్సినవి. ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ప్రయోజనాలు ఏ ప్యాకేజీతో తీరుతాయి? ఏ సర్దుబాట్లతో భర్తీ అవుతాయి? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు సంబంధించి రూ.55,656.87 కోట్ల ఆమోదం అంశం పెండింగ్‌లో ఉంది. దీనికి ఓకే చెప్పి ఆ నిధులను తెప్పించుకోకపోతే పోలవరం పూర్తయ్యేది ఎలా? పోలవరంలో తక్షణ పనుల కోసం వైసీపీ ప్రభుత్వం పదేపదే ఒత్తిడి తెస్తే రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. ఆ నిధులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు’ అని ఆరోపణలు చేసింది.


Also Read: హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్

‘విభజన చట్టంలో వెనుకబడ్డ జిల్లాలకు ఏడాది రూ.50 కోట్లు చొప్పున ప్రతి ఏటా ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్‌ రూ. 2,100 కోట్లు సిఫార్సు చేస్తే కేంద్రం 2014-15 నుంచి మొదటి మూడేళ్లపాటు ఇచ్చింది రూ.1,050 కోట్లు. తర్వాత నిధులు విడుదల ఆపేసింది. మరి ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో అదనంగా వచ్చేది ఏముంది? ఇవ్వాల్సిన పెండింగ్‌ డబ్బులు ఇస్తారా? లేదా అంతకంటే ఎక్కవ ఇస్తారా? తాను గతంతో డిమాండ్‌ చేసినట్టుగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ తరహాలో చంద్రబాబు రూ.22వేల కోట్లు తెస్తారా?’ అని ప్రశ్నించింది.

‘ఇక రాజధాని విషయానికొస్తే.. రాజధానిలో కేవలం రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ లాంటి కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.1లక్ష కోట్లకు పైనే అవుతుందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి డీపీఆర్‌ సమర్పించింది. 2014-19 మధ్య ఖర్చు చేసింది కేవలం సుమారు రూ.5వేల కోట్లు. ఇప్పుడు రూ.15వేల కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చే కొన్నేళ్లలో ఇస్తామంటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే ఈ రూ.15 వేల కోట్లు అప్పుగా ఇస్తున్నారా? లేక గ్రాంటుగా ఇస్తున్నారా? అప్పుగా ఇస్తే అది రాష్ట్రానికి లాభం ఎలా అవుతుంది? చంద్రబాబు చెప్పింది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? మరి రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?’ అని వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ట్వీట్ పైనా విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం తెచ్చిందనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాలేదని, ఇప్పుడే అవన్నీ సాధించాల్సి ఉండేనా? అంటూ నిలదీస్తున్నారు. ఏమైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా నిధులు రాష్ట్రానికి విడుదల చేస్తే సంతోషం అని మరికొందరు కామెంట్లు చేశారు.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×