EPAPER
Kirrak Couples Episode 1

YCP Incharges Transfer : మార్పు మంచికేనా.. మొదటికే మోసం వస్తుందా?

YCP Incharges Transfer : వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సమన్వయ కర్తల మార్పు ప్లస్ అవుతుందా.. లేదంటే మొదటికే మోసం చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఒక్క విడతకే అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత అంటూ పలువురు సిట్టింగ్ లను సీఎం జగన్ పక్కన పెట్టేశారు. రెండు జాబితాలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్ లో వైసీపీ అభ్యర్థులుగా పోటీలో దిగబోతున్నారు. ఇంతకీ వైసీపీ ఫాలో అవుతున్న బదిలీల వ్యూహం వర్కవుట్ అవుతుందా?

YCP Incharges Transfer : మార్పు  మంచికేనా.. మొదటికే మోసం వస్తుందా?

YCP Incharges Transfer : వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సమన్వయ కర్తల మార్పు ప్లస్ అవుతుందా.. లేదంటే మొదటికే మోసం చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఒక్క విడతకే అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత అంటూ పలువురు సిట్టింగ్ లను సీఎం జగన్ పక్కన పెట్టేశారు. రెండు జాబితాలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్ లో వైసీపీ అభ్యర్థులుగా పోటీలో దిగబోతున్నారు. ఇంతకీ వైసీపీ ఫాలో అవుతున్న బదిలీల వ్యూహం వర్కవుట్ అవుతుందా?


ఏపీలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అటు టీడీపీ, జనసేన కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాయి. అయితే ఏపీలో ప్రతిపక్షాల కంటే ముందుగా రిలీజ్ అవుతున్న వైసీపీ లిస్టులతో ఆ పార్టీలో తీవ్రస్థాయి అసంతృప్తులు బయటికొస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ఉన్న సీఎం జగన్.. ఈ సారి ఊహకందని మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారమే చేస్తున్నారు. అయితే అభ్యర్థులను సెగ్మెంట్లు దాటిస్తున్నారు. ఇంకొందరినైతే జిల్లాలు కూడా మార్చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ లెక్కలు కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవి వర్కవుట్ అవుతాయా.. ద్వితియశ్రేణి నాయకత్వం ఆమోదిస్తుందా అన్నవి పట్టించుకోకుండా తన స్ట్రాటజీ వర్కవుట్ చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారు.

నిజానికి వైసీపీ అధినేత జగన్ వేస్తున్న ఎత్తులు ప్రతిపక్షాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఏ పార్టీలో అయినా టిక్కెట్ ఆశించే వారికి దక్కకపోతే అసంతృప్తి సహజమే. అయితే వైసీపీలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై అసంతృప్తులంతా తమ పార్టీల్లోకి వస్తారని టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నాయి. నిజానికి ఓ పదేళ్ల తర్వాత అభ్యర్థులపై వ్యతిరేకత పేరు చెప్పి మార్చితే ఓ అర్థం ఉండేదని, కానీ ఐదేళ్లకే తీవ్ర వ్యతిరేకత ఏంటన్నది ఇంఛార్జ్ పదవి దక్కని సిట్టింగ్ లు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సిట్టింగ్ లకే స్థాన చలనం ఎక్కువగా ఉండడంపై మరింతగా మండిపడుతున్న పరిస్థితి.


నిజానికి తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ సిట్టింగ్ లకే టిక్కెట్లు ఇచ్చారు. అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా మార్చలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అభ్యర్థుల్ని మార్చిన చోట బీఆర్ఎస్ గెలిచింది. ఈ ఫార్ములాను జగన్ పట్టుకున్నారు. మార్పు మంచికే అనుకుంటున్నారు. ఏపీలో ఓటర్లు ప్రతి ఐదేళ్లకు ఒకర్ని మార్చే సంప్రదాయం ఫాలో అవుతున్నారా అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. అయితే వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు సీఎం జగన్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ మార్పులు అంటున్నారు. డిసెంబర్ 11న 11 మంది ఇంఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు రెండో విడతలో మరో 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయ కర్తలను నియమించింది. దీంతో 175 సీట్లకు గానూ రెండు విడతల్లో మొత్తం 35 శాసనసభ, మూడు లోక్‌సభ సీట్లకు పార్టీ కొత్త కో ఆర్డినేటర్లను ఎంపిక చేసినట్లయింది.

సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట అని వైసీపీ ఎన్ని చెబుతున్నా… అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమకు ఇదేం శిక్ష అనుకుంటున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజలు చెప్పక ముందే ఇలా ముద్ర వేయడం ద్వారా జనంలో తీవ్ర వ్యతిరేకత పెంచేలా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 అసెంబ్లీ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలు, రెండు చోట్ల మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. 175కు 175 స్థానాల్లోనూ గెలవాలంటే ఇలాంటి తీవ్రస్థాయి మార్పులు తప్పవన్న ఆలోచనతో వైసీపీ అధినేత ఉన్నట్లుగా చెబుతున్నారు.

రెండో విడతలో కీలకమైన మార్పులు ఏం జరిగాయో ఓ సారి చూద్దాం. కురుబ సామాజిక వర్గానికి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈమె బళ్లారికి చెందిన శ్రీరాములు సోదరి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. లిస్టులో ముగ్గురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలో దింపబోతున్నారు. ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు పోటీ చేసేలా బదిలీ చేసేశారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ను పెనుకొండకు షిఫ్ట్ చేశారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించారు. మొత్తం నలుగురు వారసులు సెకండ్ లిస్ట్‌లో చాన్స్‌ దక్కించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్‌, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్‌ రెడ్డి కొడుకు భూమన అభినయ్‌ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఛాన్స్ వచ్చింది.

రెండు దఫాల్లో ప్రకటించిన 35 శాసనసభ స్థానాల సమన్వయకర్తల లిస్టు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లుగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 7 సెగ్మెంట్లలో అగ్రకులాల లీడర్లను కాదని మిగితా వారికి అప్పగించారు. మొత్తం లిస్టుల్లో ఐదు స్థానాల్లో మహిళా నేతలను సమన్వయకర్తలుగా నియమించారు. ఇక 10 స్థానాల్లో యువ నాయకులకు సమన్వయకర్తలుగా ఛాన్స్ ఇచ్చారు జగన్. మొత్తంగా 35 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 9 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 11 మంది, మైనార్టీలు ముగ్గురు, అగ్రవర్ణాలు 9 మంది చొప్పున ఉన్నారు. సర్వేల ఆధారంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

సంక్షేమ పథకాలు అందుకున్న వారు కచ్చితంగా ఓటు వేస్తారన్న గ్యారెంటీ ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఎవరు వచ్చినా ఇవే పథకాలు ఇస్తారన్న ఆలోచనతో ఉండే వారూ ఉంటారు. ప్రజలతో కలవకుండా వారి మనసు గెలిచేలా లేని వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిని పక్కన పెడుతున్నారు. అయితే ఏ ప్రాతిపదికన ఇలా చేస్తున్నారన్న ప్రశ్నలను టిక్కెట్ దక్కని వారు ప్రశ్నిస్తున్నారు. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిల లిస్టు తయారు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మండల, నియోజకవర్గ నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే లిస్టు రిలీజ్ చేశారమన్నారు. సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు, ఫైనల్ గా పార్టీ గెలుపే లక్ష్యంగా జాబితాను రూపొందించామన్నది వైసీపీ నేతల మాట.

వైసీపీ తరపున పోటీ చేసే అవకాశాలు దక్కని వారి సేవలను పార్టీపరంగానూ, ఇతరత్రా వినియోగించుకుంటామని, అవకాశాలు ఉంటాయని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు వైసీపీ హైకమాండ్. దీంతో ఆయన సీఎంవో చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఇదే హిందూపురం నుంచి శాంతికి అవకాశం దక్కింది.

అటు వైసీపీలో ఈ ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంతో పాటు కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం ఖాయమవడంతో షర్మిల ఎఫెక్ట్ ఏపీలో వైసీపీపై ఎంతలా పడుతుందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా తమకొచ్చే ఇబ్బందేమీ లేదంటూ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినా వైసీపీకి వచ్చే నష్టం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.

మొదటి లిస్టులో ఇంఛార్జ్ ల ప్రకటనతో వైసీపీలో తీవ్ర గందరగోళం, తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. కొందరు అసంతృప్తితో ఏకంగా పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. పాత వారిని తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వడం.. సీఎం జగన్‌కు కలిసి వస్తుందా? లేక వ్యూహం బెడిసి కొడుతుందా? అన్నది కీలకంగా మారింది.

Related News

AP Politics: ఢిల్లీలో జగన్ ప్లాన్ రివర్స్, ఎంపీ సీటు ఖాళీ.. బీజేపీకే ఛాన్స్!

Botsa satyanarayana: ఫ్యామిలీ విభేదాలా? బొత్సకు తమ్ముడు ఝలక్, జనసేనలోకి అడుగులు..

Roja: జగన్ పరువు తీసిన రోజా? తిరుమల లడ్డు వివాదంపై పోల్, రిజల్ట్ చూసి దెబ్బకు డిలీట్!

KA Paul: పవన్.. నోరు మూసుకో.. ఆ 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ ఏదీ? : కేఏ పాల్

KA Paul: కేఏ పాల్ అసలు పేరు ఇదేనట.. ‘అప్పట్లో మా నాన్న నన్ను తిరుపతి తీసుకెళ్లి…’

Kiraak RP: రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది.. కిర్రాక్ ఆర్పీ వ్యాఖ్యలు

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Big Stories

×