EPAPER

YCP Incharges : ఇన్‌ఛార్జీల మార్పుపై జగన్ కసరత్తు .. సీఎంవో నుంచి ఆ నేతలకు పిలుపు..

YCP Incharges : ఇన్‌ఛార్జీల మార్పుపై జగన్ కసరత్తు .. సీఎంవో నుంచి ఆ నేతలకు పిలుపు..

YCP Incharges : వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. మరికొందరి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. వీరిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు.


ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమైన వారితో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చర్చిస్తున్నారు.పోటీ చేసే స్థానాల మార్పులపై క్లారిటీ ఇస్తున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్‌ఛార్జీలను సీఎం జగన్‌ ఖరారు చేయనున్నారు. రెండు రోజుల్లో మార్చిన ఇన్ ఛార్జిలతో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ముందుకు ప్రకాశం జిల్లా పంచాయితీ వచ్చింది. మంత్రి మేరుగ నాగార్జున, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కొండెపి నియోజకవర్గ నేతలు హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హైకమాండ్ మార్పులు చేసింది. కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ అశోక్ బాబు స్థానంలో మంత్రి సురేష్ కు బాధ్యతలు అప్పగించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు ఛాన్స్ ఇవ్వలేదు. తాజా మార్పులపై పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని విజయసాయి రెడ్డి.. నేతలకు సూచనలు చేశారు.


Related News

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Big Stories

×