EPAPER

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం.. ఒక్కసారి కూడా వేరే పార్టీ కి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందర్నీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు .. అలాంటి సగ్మెంట్‌పై వైసీపీ కన్నేసిందిప్పుడు .. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది.. పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చేసి మరీ ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్ధితి ఉందా?.. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లెజెండ్ లాంటి లీడర్‌పై పరాయి రాష్ట్రం నుంచి ఆమె ఢీ కొట్టగలరా?

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో  సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం.. ఒక్కసారి కూడా వేరే పార్టీ కి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందర్నీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు .. అలాంటి సగ్మెంట్‌పై వైసీపీ కన్నేసిందిప్పుడు .. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది.. పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చేసి మరీ ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్ధితి ఉందా?.. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లెజెండ్ లాంటి లీడర్‌పై పరాయి రాష్ట్రం నుంచి ఆమె ఢీ కొట్టగలరా?


ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది .. ఇంకా పొత్తులు లెక్కలు తేలక టీడీపీ, జనసేనలు అభ్యర్ధులను ప్రకటించకపోయినా.. ప్రచార హడావుడి మాత్రం షూరూ చేశేసాయి. మరోవైపు వైసీపీ వివిధ నియోజకవర్గాల అభ్యర్ధులను మారుస్తూ..ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా అధికారపక్షం గత ఎన్నికల్లో ఓడిన స్థానాలతో పాటు ఈసారి టీడీపీకి పట్టు స్థానాల్లో గెలిచేందుకు తగిన విధంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూరంపై వైసీపీ కన్ను పడింది. ఈసారి ఎలాగైన అక్కడ గెలవాలని హిందూపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా టీ.ఎస్‌ దీపిక ను నియమించారు.

హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి హిందూపురం కంచుకోట. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు. 1983 నుంచి ఎన్టీఆర్ మూడు సార్లు, వెంకట్రాముడు ఒకసారి అబ్దుల్ ఘనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు.. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా ఎక్కడో బెంగుళూరులో వ్యాపారాలు చేసుకొనే దీపికని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి మరీ తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపారు.


ఈ సారి హిందూపురం కంచుకోటను బద్దలు కొట్టడానికి పక్కగా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ .. అందులో భాగంగ బీసీ మహిళా కార్డ్ ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ.. హిందూపురం నియోజకవర్గం లో ముస్లిం, బీసీ ల ఓట్లు అత్యధికం..హిందూపురం పట్టణంలోనూ ముస్లిం ఓట్లు, రూరల్ ప్రాంతాలలో బీసీ ల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. హిందూపురంలో మహిళా అభ్యర్థులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు.

ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళా అస్త్రం ప్రయోగించాలని వైసీపీ సిద్దమైంది..హిందూపురంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఓ మహిళకు టికెట్ ఇవ్వలేదని.. గెలిపించుకుంటే దీపికను మంత్రి పదవి కూడా ఇస్తారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ క్రమంలో హిందూపురం వైసీపీ కార్యక్రమాలు అక్కడ అభ్యర్ధిని కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అయితే టీడీపీ కంచుకోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. అందుకు కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎందుకంటే హిందూపురంలో ముస్లింలు, బీసీలే చాలా కీలకం.. ఈ నియోజకవర్గంలో 60 వేల ముస్లిం సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి.. ఇక 90 వేల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. సహజంగా టీడీపీకి బీసీల పార్టీ అన్న పేరుంది. హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వత బీసీ అభ్యర్ధులను బరిలోకి దింపింది. వారిని కూడా మంచి మెజార్టీ తో గెలిపించారు అక్కడ ఓటర్లు .. ఇప్పుడు ఆ గెలిచిన మాజీ ఎమ్మెల్యే లు టిడిపి తరపున బాలయ్య కు అండగా ఉన్నారు.

ఇక అక్కడ వైసీపీ గ్రూపు తగాదాల భారీ స్ధాయిలో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆ గ్రూపు లీడర్లు కూడా బలమైన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నవీన్ నిశ్చల్ గ్రూపు వైసీపీలో బలంగా ఉంది. రెండు సార్లు కొద్ది తేడాతో ఓడిపోవడంతో నియోజక వర్గంలో ఆయనపై సానుభూతి ఉంది. అయితే నవీన్‌ని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టడంతో ఇప్పుడు ఆయన పూర్తి స్ధాయిలో వైసీపీ కి పని చేయడం లేదు. మరో వర్గం నేత వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ముస్లీంలలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని అందరూ భావించారు.

అయితే ఇక్బాల్‌ని ఇన్‌చార్జ్‌గా తప్పించి.. దీపికను సీన్‌లోకి తెచ్చింది వైసీపీ.. దాంతో ఆయన కూడా తిరుగుబాటు బావుట ఎగురవేశారు… దీపికకు మద్దతుగా పనిచేసేదే లేదని. హిందూపురంలో పోటీ కూడా చేస్తానని ప్రకటించి పార్టీలో కలకలం రేపారు .అంతేనా తిరిగి హిందూపురం లో బాలకృష్ణ అత్యధిక మెజారిటీ తో గెలుస్తారని వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ జోస్యం కూడా చెప్పారు .. ఓ వైసీపీ నేత ఇలా చెప్పడంతో అందరూ ఖంగుతింటున్నారు. ఇలా హిందూపురం వైసీపీ లో గ్రూపుల గోల కొనసాగుతోంది.

మొత్తానికి కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటున్న పెద్దిరెడ్డి.. హిందూపురంలో బాలయ్యపై విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పేరుకి దీపిక అభ్యర్ధి అయినా హిందూపురంలో అన్నీ తానే అయి చూసుకుంటున్నారు పెద్దిరెడ్డి.. ఇటు బాలకృష్ణ, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు హేమాహేమీలు నియోజకవర్గం లో తిరుగుతూ రాజకీయం హీట్ పెంచుతున్నారు. అయితే హిందూపురంలో లెజెండ్ స్పీడ్‌కి వైసీపీ ఏ మాత్రం బ్రేకులు వేస్తుందో చూడాలి.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×