EPAPER

Amarnath on YCP Defeat : ఓటమిపై వైసీపీ భిన్నాభిప్రాయాలు.. సంక్షేమంపై కుట్ర.. కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదు..

Amarnath on YCP Defeat : ఓటమిపై వైసీపీ భిన్నాభిప్రాయాలు.. సంక్షేమంపై కుట్ర.. కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదు..

Amarnath on YCP Defeat(AP political news): ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. 2019 ఎన్నికలు రివర్స్ అయ్యాయి. కేవలం ఐదేళ్లనే వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. అయితే ఈ ఓటమిపై వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వలంటీర్ల వల్లే ఓడిపోయామని కొంతమంది నేతలు అంటుండగా.. మరికొంతమంది అధికారుల తీరు వల్ల ఓడిపోయామని అంటున్నారు. ట్యాపరింగ్ ఆరోపణలు చేస్తున్నారని, సంక్షేమంపై కుట్ర జరిగిందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వలంటీర్ల వ్యవస్థ ఓటమికి కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.


ప్రజలు దూరమయ్యారు

వలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీ ఓడిందని గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో చెప్పారు. ఈ వ్యవస్థతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రజలు దూరమయ్యారని, అందుకే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వం నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేవారని, వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు నాయకులు దూరమయ్యారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. విశాఖ విషయానికొస్తే.. ఇక్కడి ప్రజలకు అండగా ఉంటామన్నారు. అలాగే రామయ్యపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు చివరి దశకు వచ్చాయని, భోగాపురం ఎయిర్ పోర్టు పనులు కొత్త ప్రభుత్వం పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.


Also Read: ఆట మొదలు.. ఐఏఎస్, ఐపీఎస్ లకు చంద్రబాబు ఝలక్.. !

కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదు

వైసీపీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోవడంతోనే వైసీపీ ఓడిపోయిందని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో, మంత్రి హోదాలో ప్రచారం చేసే సమయంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఈ లోపం బయటపడిందన్నారు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులతో వైసీపీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం నా వ్యక్తిగతంగా ఈ లోపం కనిపించిందన్నారు.

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×