EPAPER

YCP 10th List : వైసీపీ 10వ జాబితా విడుదల.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరంటే..

YCP 10th List : వైసీపీ 10వ జాబితా విడుదల.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరంటే..

ysrcp latest news


YSRCP 10th List Released(AP election updates): విడతల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న అధికార వైసీపీ.. తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 1 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానానికి సమన్వయకర్తలను ప్రకటించింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేశ్ ను సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలిపింది.

తొలుత అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, మచిలీపట్నం ఎంపీ బరి నుంచి సింహాద్రి రమేశ్ ను బరిలోకి దించుతున్నట్లు వైసీపీ హై కమాండ్ నుంచి ప్రకటన వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత చూపడంతో అభ్యర్థులను మార్చింది అధిష్ఠానం. ఈ జాబితాపై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి చాలా సుపరిచితులని తెలిపారు. ఆయన తండ్రి దివంగత సింహాద్రి సత్యనారాయణరావు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. 1985 నుంచి 1999 మధ్య మూడుసార్లు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. సింహాద్రి చంద్రశేఖర్ ఇక్కడ ఎంపీగా గెలిస్తే.. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంచి జరుగుతుందని ఆకాంక్షిచారు.


Read More : పవన్ కల్యాణ్ వివాహ వ్యవస్థకే కళంకం : సీఎం జగన్

మొత్తం వైసీపీ 10 లిస్టులను పరిశీలిస్తే.. 75 అసెంబ్లీ స్థానాలకు, 22 పార్లమెంట్ స్థానాలకు ఇన్ ఛార్జిల జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 అసెంబ్లీ, సెకండ్ లిస్టులో 24 అసెంబ్లీ, 3 ఎంపీ, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ, నాలుగో జాబితాలో 1 ఎంపీ, 8 అసెంబ్లీ, 5వ లిస్ట్ లో 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు, ఆరవ జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు, ఏడవ లిస్ట్ లో 2 అసెంబ్లీ, 8వ లిస్టులో 2 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు, 9వ జాబితాలో 1 పార్లమెంట్, 2 అసెంబ్లీ స్థానాలకు, తాజాగా విడుదల చేసిన 10వ జాబితాలో 1 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించింది వైసీపీ.

Related News

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Big Stories

×