EPAPER

Wine shops bandh in Ap: ఏపీలో వైన్ షాపులు క్లోజ్, మళ్లీ ఆరున..

Wine shops bandh in Ap: ఏపీలో వైన్ షాపులు క్లోజ్, మళ్లీ ఆరున..

Wine shops bandh in Ap: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఊహించని కష్టాలు వచ్చాయి. ఏకంగా మూడు రోజులపాటు లిక్కర్ షాపులు క్లోజ్ అయ్యాయి. సోమవారం నుంచి బుధవారం మూసి వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో షాపులన్నీ బంద్ అయ్యాయి.


సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మూడురోజులపాటు మద్యం షాపులు మూతపడ్డాయి. జూన్ మూడు నుంచి ఐదు వరకు షాపులను మూసి ఉంచాలని ఈసీ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, ముఖ్యంగా అల్లర్లు చెలరేగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంది.

దీంతో ఆదివారం అర్థరాత్రి వరకు లిక్కర్ షాపుల్లో అమ్మకాలు సాగాయి. చాలామంది ముందుగానే తమకు కావాల్సిన బాటిళ్లలను కొనుగోలు చేసి స్టోరేజ్ చేసుకున్నారు. ముఖ్యంగా జూన్ ఫస్ట్ వీక్ కావడంతో చాలా మందికి ప్రభుత్వం వేసిన డబ్బులు అందలేదు. దీంతో అప్పులు చేసి మరీ కొందరు కొనుగోలు చేశారు.


ALSO READ: ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల అసహనం, కేవలం రెండేనట…

ఏపీలో ఆదివారం చాలా షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. అయితే అల్లర్లు జరిగే అవకాశముందని వార్తలు నేపథ్యంలో పోలీసులు, హోటళ్లు, లాడ్జీలు తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టాలని సూచన చేసింది. దీనికితోడు ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ అనుకూలంగా రాకపోవడంతో అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×