EPAPER

Chandrababu Naidu: మారిన బాబు.. పాలన కూడా మారుతుందా..?

Chandrababu Naidu: మారిన బాబు.. పాలన కూడా మారుతుందా..?

Will the Regime Shift Under Chandrababu Naidu in AP: నారా చంద్రబాబు నాయుడు అను నేను.. మరికొన్ని గంటల్లో ఈ పదం ఏపీలో మారు మోగిపోనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా.. నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టడానికి కొన్ని విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అది కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎదుటనే కుండబద్ధలు కొట్టారు. యస్.. చంద్రబాబుకు గెలుపు కొత్త కాదు.. పదవులు అంతకన్నా కొత్త కాదు. బట్ మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం ఆయన జీవితంలో చిరస్మరణీయం.. ఈ గెలుపు ఇచ్చిన బూస్ట్ మాములుది కాదు. ఈ గెలుపును ఆయన ఓ కొత్త కోణంలో చూస్తున్నారు. ఇది తమ ఒక్కరి ఘనత అనడం లేదు.. ఐక్యంగా పోరాడినదానికి ఫలితం అంటున్నారు. గత ప్రభుత్వంపై ప్రజల అయిష్టం, ద్వేషానికి సింబాలిక్‌గా చూస్తున్నారు చంద్రబాబు. అందుకే ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనేది ఆయన అభిమతం.


ప్రమాణస్వీకారం చేసేముందు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు చాలా విషయాలను మనసు విప్పి మాట్లాడారు. పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని.. ఇకపై ప్రజాభివృద్ధి పాలనను చూస్తారంటున్న చంద్రబాబు.. అంతేకాదు సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ఏపీ రాజధానిపై ఓ క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు..

సో.. ఏపీ ప్రజలారా ఇక ఫిక్స్‌ అయిపోండి.. ఏపీకి రాజధానిగా ఉండబోయేది కేవలం అమరావతి మాత్రమే. మూడు రాజధానుల జంజాటం ఉండబోవడం లేదు. చంద్రబాబు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో అమరావతి ప్రాంతంలో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే టీడీపీ గెలిచిన రోజే ఓసారి సంబరాలు చేసుకున్నారు అక్కడి ప్రాంత ప్రజలు ఎన్నికల కంటే ముందే అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు తాను ఇచ్చిన వాగ్ధానాన్ని నిజం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఓ విషయంలో భయపడ్డారట. కూటమి సీట్ల సంఖ్య తగ్గిపోతుందని కాస్త బాధ కూడా పడ్డారట.


Also Read: ఏపీ మంత్రి వర్గం ఖరారు.. 17మంది కొత్తవారే.. పవన్ కల్యాణ్‌కు ఆ శాఖ ?

చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుంది? కక్షాపూరిత రాజకీయాలు ఉంటాయా? దీనికి ఆన్సర్ అలాంటిదేం లేదంటున్నారు చంద్రబాబు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఎందుకంటే అలా వదిలేస్తే మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు కాబట్టి.. అంతేకాని గత ప్రభుత్వంలాగా తాము రివేంజ్ పాలిటిక్స్ చేయబోమంటున్నారు చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం శిథిలమైంది. అన్ని వర్గాలు, రంగాలు దెబ్బతిన్నాయి. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మళ్లీ ఆ తప్పు తాము చేయబోమని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు.. సింపుల్‌గా చంద్రబాబు ఓ మాట చెప్పారు. మనది ప్రజా ప్రభుత్వం.. ప్రజావేదికలాంటి కూల్చివేతలు ఉండవు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటలు ఉండవు. అమరావతి రాజధాని.. విశాఖే ఆర్థిక రాజధాని.. చెట్లు కొట్టేయడం.. రోడ్లు మూసేయడం.. పరదాలు కట్టడం ఇక ఉండవు. ఇది ఆయన చంద్రబాబు చెప్తున్న సందేశం.

ఇదంతా జరిగినది.. ఇక జరగబోయేది ఏంటో చూద్దాం.. చంద్రబాబు కేబినెట్‌లో ఎవరెవరికి కేబినెట్ హోదాలు దక్కనున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన అధినేత పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరెవరికి ఏ శాఖ దక్కుతుందన్న దానిపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.

Also Read: CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా? హోంశాఖ కూడా జనసేన హ్యాండోవర్‌లోనే ఉంటుందా? ఏడుసార్లు గెలిచిన అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావ్, బుచ్చయ్య చౌదరిలకు ఎలాంటి పదవులు దక్కుతాయి? గెలిచిన వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వస్తుందా? కేంద్రమంత్రి వర్గంలో పదవులు దక్కించుకున్న సామాజిక వర్గాలు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటుందా? లేదా? చంద్రబాబు అన్ని పార్టీలకు, అన్ని సామాజిక వర్గాలకు ఎలా న్యాయం చేయబోతున్నారు? వీటన్నింటికి సమాధానం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఏదేమైనా నాలుగోసారి సీఎంగా పాలన పగ్గాలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారికి బిగ్ టీవీ తరపున కంగ్రాట్స్ అండ్ ఆల్‌ ది బెస్ట్‌.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×