EPAPER
Kirrak Couples Episode 1

Sharmila : వైసీపీలో టెన్షన్.. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారా..?

Sharmila : షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా తన అన్నని.. జగన్‌రెడ్డి అని సంభోదిస్తూ విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇచ్చాపురం టూ ఇడుపులపాయ టూర్ పెట్టుకున్న షర్మిల మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నా.. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుండటం విశేషం.. ఆ క్రమంలో ఆ అన్నాచెల్లెల్ల సొంత జిల్లా కడప రాజకీయం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.. పొలిటికల్‌గా షర్మిల విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?.. వారి సొంత జిల్లాలో సమీకరణలు ఎలా మారతాయనేది చర్చనీయాంశమైంది.

Sharmila :  వైసీపీలో టెన్షన్..  కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారా..?

Sharmila : షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా తన అన్నని.. జగన్‌రెడ్డి అని సంభోదిస్తూ విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇచ్చాపురం టూ ఇడుపులపాయ టూర్ పెట్టుకున్న షర్మిల మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నా.. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుండటం విశేషం.. ఆ క్రమంలో ఆ అన్నాచెల్లెల్ల సొంత జిల్లా కడప రాజకీయం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.. పొలిటికల్‌గా షర్మిల విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?.. వారి సొంత జిల్లాలో సమీకరణలు ఎలా మారతాయనేది చర్చనీయాంశమైంది.


ఇప్పుడు రాష్ట్రమంతా కడప జిల్లా వైపే చూస్తోంది.. రాష్ట్ర ప్రజలు కడప ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు ఏలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా తయారైంది.. ముఖ్యంగా కడప పార్లమెంటు స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందిప్పుడు.. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా?.. ఒకవేళ షర్మిల పోటీ చేస్తే కడపలో అన్నాచెల్లెళ్ల మధ్య సమరం ఏ విధంగా ఉండబోతుంది? ఆ సవాల్‌ను ఇద్దరు ఎలా అధిగమిస్తారు అన్న అంశాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి.. ఒకవేళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తూ.. వైసీపీ నుంచి ఎవరు నిలబడతారు? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

కడప పార్లమెంటు నియోజకవర్గం ఒక రకంగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా అనే చెప్పాలి.. కడప ఎంపీగా వైఎస్ కుటుంబసభ్యులే గెలుస్తూ రావడం రివాజుగా మారింది. అక్కడ నుంచి దివంగత నేతలు వైఎస్, వివేకా, వారి తర్వాత ప్రస్తుత సీఎం జగన్ లోక్‌సభకు భారీ మెజార్టీలతో ఎన్నికయ్యారు.. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాశ్‌రెడ్డి కూడా ఆ కుటుంబసభ్యుడే .. 1989లో కడప నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపొందిన నాటి నుంచి అక్కడ వారికి ఓటమే లే కుండా పోయింది.


ఒక్క కడప ఎంపీ స్థానం పరిధిలోనే కాదు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. అటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా చీలిపోయింది . వివేకానంద రెడ్డి హత్య జరిగిన కొద్ది రోజులలోనే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి . సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యానికి జగనే కారణమన్న టాక్ ఉంది.. ఎందుకంటే జగన్‌కి తమ్ముడయ్యే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి ఆ హత్య కేసులో నిందితులు.. దాంతో వివేకా కూతురు జగన్‌తో విభేదించి న్యాయపోరాటానికి దిగారు.

ఇక ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా జగన్‌కు రాజకీయ శత్రువయ్యారు .. ముఖ్యంగా విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నారు .. ఇక వివేకా కుమార్తె సునీత కూడా కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం మొదలైంది. సునీత కాంగ్రెస్‌లో చేరకపోయినా.. జగన్‌పై వ్యతిరేకతతో షర్మిల పక్షాన చేరడం మాత్రం ఖాయమంటున్నారు ఏదేమైనా ఇప్పుడు సొంత జిల్లాలో జగన్ టీడీపీ, జనసేనలతో పాటు తల్లీచెల్లెళ్లను పొలిటికల్‌గా ఢీ కొట్టాల్సి ఉంది. దాంతో వైఎస్ ఫ్యామిలీ చీలిక ఎవరికి ప్లస్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా తయారైంది.

షర్మిల కాంగ్రెస్ నుంచి కడప లోక్‌సభ బరిలో నిలిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా కాకుండా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్‌రెడ్డి ఎంపీ సీటు నుంచి సైడ్ అయితే.. వైసీపీ నుంచిమరో వైఎస్ కుటుంబంలోని వారే బరిలో ఉంటారా? లేదా వేరే కొత్త వ్యక్తిని రంగంలోకి దించుతారా అన్న అంశంపై పెద్ద డిబేటే నడుస్తోంది జిల్లా వాసుల్లో.

ఒకవేళ కొత్త వ్యక్తిని గనుక బరిలో దింపితే .. వైఎస్ కుటుంబమంతా వన్ సైడ్‌గా షర్మిలకే సపోర్ట్ చేసే అవకాశముందంటున్నారు. అది జగన్‌కు తెలుసు కాబట్లే వైసీపీ నుంచి వైఎస్ బంధువునే బరిలోకి దించుతారంటున్నారు. అదే జరిగితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి .. వైఎస్ అభిమానుల్లోనూ చీలిక గ్యారెంటీ.. ఇప్పటికే తల్లి, చెల్లిని జగన్ పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలతో.. జనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు .. దానికి తోడు వివేకా హత్యతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ సునీతపై సానుభూతి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటుబ్యాంకుకు కోత పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ క్రమంలో షర్మిల కడప ఎన్నికల బరిలో ఉంటే రాజకీయంగా వైసీపీకి కొంత గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. ముఖ్యంగా వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో .. వారంతా ఇప్పటివరకు గత్యంతరం లేక వైసీపీ వెంట నడుస్తున్నారు .. ఇప్పుడు షర్మిల అన్నకు వ్యతిరేకంగా .. అందులోనూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మారడంతో .. వారంతా ఆమె వెంట నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం.. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మందికి షర్మిల ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఇలాంటి సమీకరణల మధ్య షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే.. ఆ సెగ్మెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ ఓటుబ్యాంకుకు కోత తప్పదన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .. గ్రౌండ్ లెవల్లో వైసీపీ శ్రేణుల్లో కూడా అదే టెన్షన్ కనిపిస్తోందిప్పుడు.

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×