EPAPER
Kirrak Couples Episode 1

Latest news on Chiranjeevi : పకోడి బ్రో.. చిరుకి చెక్ పెడుతున్నారా? భయపెడుతున్నారా?

Latest news on Chiranjeevi : పకోడి బ్రో.. చిరుకి చెక్ పెడుతున్నారా? భయపెడుతున్నారా?
Chiranjeevi latest news telugu

Chiranjeevi latest news telugu(Andhra Pradesh political news today):


మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌కు బిగ్ బ్రదర్. దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా చెలామణి అవుతున్నారు. కానీ, ఆయనెప్పుడూ తాను పెద్దన్న కాదు.. జస్ట్ అన్నయ్యనే అంటూ పెద్దరికానికి దూరంగానే ఉండేవారు. అయితే, సమస్య వచ్చినప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చేవారు. సినిమా టికెట్లను జగన్ సర్కారు తగ్గించినప్పుడు.. పరిశ్రమ తరఫున ముందుకొచ్చి.. తాడేపల్లి సీఎం ఇంట్లో విందు భోజనం చేసి.. చర్చలు జరిపి.. పెద్దరికాన్ని చాటుకున్నారు చిరంజీవి. అప్పటి నుంచీ చిరంజీవి.. జగన్‌కు సహచరుడంటూ ముద్ర పడిపోయింది. వైసీపీ తరఫున రాజ్యసభకు కూడా పంపిస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత అంతా సైలెంట్.

మళ్లీ ఇప్పుడు పొలిటికల్ న్యూస్‌‌కు బ్రేకింగ్‌గా మారారు చిరంజీవి. సహజంగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉండే చిరు.. ఈసారి మాత్రం యధాలాపంగా ఫ్లోలో ఓ డైలాగ్ వదిలేసి.. వివాదాల్లో ఇరుక్కుపోయారు. విభజన హామీ, ప్రాజెక్టులు, రోడ్లు అంటూ పరోక్షంగా వైసీపీకి తగిలేలా విమర్శలు చేశారు. పిచుకపై బ్రహ్మాస్త్రం అంటూ సినిమాలకు సపోర్ట్‌గా మాట్లాడారు. అయితే, బ్రో.. రచ్చ నడుస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఈ కామెంట్ చేయడంతో.. అధికార పార్టీ ఉలిక్కిపడింది. తమ్ముడు పవన్‌కు మద్దతుగానే ఆయన అలా అన్నారని.. ఎదురుదాడికి దిగింది.


మంత్రులు వరుసబెట్టి చిరంజీవిపై విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే పకోడి గాళ్ల సలహాలు అవసరం లేదంటూ.. చిరు స్థాయిని తక్కువ చేసి మాట్లాడారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి అన్యాయం జరిగిందని.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏ పార్టీలో ఉన్నారంటూ.. చిరు రాజకీయ చరిత్రలోని మరకలను ప్రస్తావిస్తున్నారు. వైసీపీ నుంచి ఈస్థాయి రియాక్షన్‌ను మెగాస్టార్ ఊహించి ఉండరు.

ఎందుకు? అధికార పార్టీ ఎందుకంతగా ఉలిక్కిపడుతోంది? అన్నయ్య.. ఆయన తమ్ముడికి సపోర్ట్ చేశారనే అక్కస్సా? రాష్ట్ర పరిస్థితిపై మాట్లాడి జగన్ సర్కారును ఇరకాటంలో పడేశారనే ఆగ్రహమా? అంటే రెండూ అనే అంటున్నారు. ఇప్పటి వరకూ జగన్‌తో సఖ్యతగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడిలా బహిరంగ వేదికపై విమర్శలు చేయడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతోంది. అసలే ఎన్నికల సీజన్. అసలే చిరంజీవికి ఫ్యాన్ బేస్ ఎక్కువ.. ఇలాంటి సమయంలో అలాంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళితే.. డ్యామేజీ పక్కా. అందుకే, ఏమాత్రం ఉపేక్షించకుండా ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం. చిన్న మాటనైనా.. పెద్ద కర్రతోనే కొట్టే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ జోలికొస్తే ఇలాంటి ప్రతిదాడి ఎదురవుతుందని చిరును భయపెట్టేలా చేయాలని చూస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కోసం జనసేనకు సపోర్ట్ చేయాలన్నా.. ముందుకు రాకుండా చేసేలా.. ఇప్పుడిలా విమర్శల సంకెళ్లతో చిరంజీవిని కట్టడి చేసే వ్యూహం వైసీపీ అమలు చేస్తోందని అంటున్నారు.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×