EPAPER

Swarupoonanda Swami: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

Swarupoonanda Swami: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

Swarupoonanda swami with jagan: శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ఎక్కడ? గడిచిన ఐదేళ్లు ఓ వెలుగు వెలిగిన ఆయన, ఎందుకు కనిపించడం మానేశారు? మకాం మార్చేశారా? హైదరాబాద్, బెంగుళూరు మధ్య చక్కర్లు కొడుతున్నారు? లెక్కల్లో తేడాలొచ్చాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగింది విశాఖలోని శారదా పీఠం. జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు స్వారూపానంద స్వామి చేయని ప్రయత్నాలు లేవు. ప్రతీ నెలా వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకునే వారు అప్పటి సీఎం జగన్. ఆ విషయం కాసేపు పక్కన బెడదాం.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకొచ్చారు స్వరూపానంద. ఆ తర్వాత ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కాకపోతే విశాఖ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చే ఆలోచన ఉన్నట్లు సూచన ప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ లెక్కన స్వామి విశాఖలో లేరన్నది కొందరి మాట.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారా? లేరా అన్న ప్రశ్నలు స్వామి భక్తులను వెంటాడుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో స్వామి గురించి మరో ఆసక్తికరమైన వార్త హంగామా చేస్తోంది. స్వరూపానంద స్వామి.. హైదరాబాద్ టు బెంగుళూరు మధ్య చక్కర్లు కొడుతున్నట్లు జోరుగా ప్రసారం సాగుతోంది. అందులో నిజమెంతో తెలీదు.

ALSO READ: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

వైసీపీ హయాంలో అందరి కంటే ఎక్కువగా లబ్ది పొందింది స్వరూపానందస్వామని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బలంగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు, మరి కొన్నింటిని లీజుకు తీసుకున్న సందర్భాలున్నాయని చెబుతున్నారు.

తిరుమలలో జీ 3 కి పర్మీషన్ తీసుకుని స్వరూపానంద.. భారీగా నిర్మాణాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది. లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చాక స్వరూపానందస్వామిని కొందరు మీడియా మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

చాతుర్మాస దీక్షలో ఉన్నానని, తాను ఇప్పుడు మాట్లాడలేనని తప్పించుకునే ప్రయత్నం చేశారట స్వరూపానంద. బయట ప్రచారం జరుగుతున్నట్లు స్వరూపానంద.. హైదరాబాద్ టు బెంగుళూరుకు ఎందుకు చక్కర్లు కొడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

గడిచిన ఐదేళ్లలో ప్రతీనెలా జగన్, శారదా పీఠం సందర్శించి లెక్కలు చూసుకునేవారని అంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి నుంచి యలహంకకు తిరేగస్తున్నారు జగన్. ఈ క్రమంలో జగన్‌ను బెంగుళూరులో స్వారూపానంద కలిసినట్టు వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. లెక్కలు తేల్చుకోవడం కోసమే వెళ్లారన్నది కొందరిమాట. మొత్తానికి స్వరూపానంద కనిపించకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Related News

Palle Panduga: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Hindupuram rape : హిందూపురం రేప్ ఘటనలో పురోగతి.. సీసీటీవీ ఫుటేజీ లభ్యం

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP CID : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ

Kakinada News: భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం, సంచలనం రేపిన ఘటన ఎక్కడ?

Big Stories

×