EPAPER

Amudalavalasa : మామాఅల్లుళ్ల పోరు.. బిగ్ టీవీ సర్వేలో విజయం ఎవరిది?

Amudalavalasa : మామాఅల్లుళ్ల పోరు.. బిగ్ టీవీ సర్వేలో విజయం ఎవరిది?

Amudalavalasa : మామా అళ్లుళ్ల సవాల్ కు సిద్ధమౌతోంది శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన అల్లుడు కూన రవికుమార్ మధ్య మరో పోరుకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలోని మరో ముఖ్యమైన నియోజకవర్గం ఆముదాల వలస.ఇక్కడ కళింగ సామాజికవర్గం బలంగా ఉంది. ఈ సెగ్మెంట్ లో మొత్తం జనాభాలో 40 శాతం ఈ కమ్యూనిటీనే ఉంది. ప్రస్తుతం ఏపీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారం ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ కళింగ సామాజికవర్గం నేతలనే రంగంలోకి దింపుతున్నాయి అన్ని పార్టీలు. 1978 నుంచి ఇప్పటిదాకా ఆముదాలవలసలో కళింగ కమ్యూనిటీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు ఇదే సామాజికవర్గానికి టిక్కెట్లు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాయి. ఇక్కడ పోటీలో ఉన్న తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ దగ్గరి బంధువులు. మరి వచ్చే ఎన్నికల్లో ఆముదాలవలస ఓటర్ నాడి ఎలా ఉండనుంది? బిగ్‌ టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం.. అంతకు ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
తమ్మినేని సీతారాం VS కూన రవి కుమార్

YCP 52%
TDP 43%
JANASENA 2%
OTHERS 3%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేశారు. 52 శాతం ఓట్ షేర్ తో తన సమీప ప్రత్యర్థి, టీడీపీ నుంచి పోటీ చేసిన కూన రవికుమార్ పై మంచి మెజార్టీతో గెలిచారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం, అలాగే దగ్గరి బంధుత్వం ఉన్నా.. జగన్ వేవ్, అలాగే తమ్మినేని ఇమేజ్ తో పైచేయి సాధించారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన కూన రవికుమార్ 43 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన అభ్యర్థి పోటీ చేసినా నామమాత్రంగా 2 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఇప్పుడు ఆముదాలవలసలో పొలిటికల్ సినారియో మారుతోంది. తమ్మినేని సీతారాంతో పాటే సువ్వారి గాంధీ పేరు కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో జగన్ టిక్కెట్ ఎవరికి కన్ఫామ్ చేస్తారో చూడాలి. అదే సమయంలో టీడీపీ నుంచి రవికుమార్ కే ఎక్కువ శాతం టిక్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం ఆముదాలవలస సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పరిశీలిద్దాం..


తమ్మినేని సీతారాం ( YCP ) ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గం అభివృద్ధి ఊపందుకోవడం
  • సంక్షేమ కార్యక్రమాలు జనం దగ్గరికి తీసుకెళ్లడం
  • పెన్షన్లు, ఇతర స్కీం డబ్బులు సకాలంలో అందడం
  • జనంలో తమ్మినేనికి ప్రత్యేక ఇమేజ్ ఉండడం

తమ్మినేని సీతారాం మైనస్ పాయింట్స్

  • సువ్వారి గాంధీతో పొలిటికల్ ఈక్వేషన్స్
  • సువ్వారికి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని ఇవ్వకపోవడం
  • నిర్ణయాలు తీసుకునేప్పుడు సీనియర్లను పట్టించుకోకపోవడం
  • అసెంబ్లీలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణ

సువ్వారి గాంధీ (YCP) ప్లస్ పాయింట్స్

  • యువనేతగా వైసీపీలో గుర్తింపు
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం

సువ్వారి గాంధీ మైనస్ పాయింట్స్

  • ప్రత్యర్థిని ఢీకొట్టే బలం ఉందా అన్న అనుమానాలు

కూన రవికుమార్ (TDP) ప్లస్ పాయింట్స్

  • టీడీపీపై ప్రజల్లో సానుకూలత పెరగడం
  • గత ఎన్నికల్లో రవికుమార్ ఓడిన సింపథీ
  • చంద్రబాబు, భువనేశ్వరి పర్యటనలు
  • టీడీపీకి స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ ఉండడం
  • కళింగ, తూర్పు కాపు మద్దతు ఉండడం

కూన రవికుమార్ మైనస్ పాయింట్స్

  • గ్రౌండ్ లెవెల్ లో ఇంకా స్పీడ్ పెంచకపోవడం

కులాల లెక్కలు..
కళింగ 40%
తూర్పు కాపు 30%
పొలినాటి వెలమ 12%
ఎస్సీ 10%

ఆముదాల వలసలో కళింగ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 40 శాతం ఉన్నారు. అభ్యర్థులు, పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్‌ టీవీ సర్వేలో ఆముదాల వలసలో జనం చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. కళింగ కమ్యూనిటీలో 40 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. అటు తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వారిలో 45 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు, 50 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక పొలినాటి వెలమ కమ్యూనిటికీ చెందిన వారిలో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు మద్దతు ఇస్తామన్నారు. ఎస్సీల్లో 60 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీ, 5 శాతం జనసేనకు మద్దతుగా ఉంటామని సర్వేలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

తమ్మినేని సీతారాం VS కూన రవికుమార్
YCP 44%
TDP 49%
OTHERS 7%

ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ్మినేని సీతారాంకు టిక్కెట్ కన్ఫామ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44 శాతం ఓట్లు రాబట్టనున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ 49 శాతం ఓట్ షేర్ సాధిస్తారని సర్వేలో జనం తమ అభిప్రాయాలు తెలిపారు. అంటే ఆముదాలవలసలో ఈసారి గెలిచే ఛాన్స్ టీడీపీకే ఎక్కువ ఉన్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తేలింది.

సువ్వారి గాంధీ VS కూన రవికుమార్
YCP 42%
TDP 51%
OTHERS 7%

ఇక వైసీపీ నుంచి సువ్వారి గాంధీ బరిలో దిగితే వైసీపీకి 42 శాతం ఓట్లు దక్కనున్నట్లు సర్వేలో తేలింది. అంటే తమ్మినేని సీతారాం అభ్యర్థత్వంతో పోలిస్తే 2 శాతం ఓట్లు తగ్గుతున్నాయి. టీడీపీ 51 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సమీకరణాల ఆధారంగా జనసేన మద్దతుతో టీడీపీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×