EPAPER

Will Ravindranath Reddy Get Hat Trick: జగన్ మేనమామ రవీంద్రనాథ్.. హ్యాట్రిక్ కొడతాడా..?

Will Ravindranath Reddy Get Hat Trick: జగన్ మేనమామ రవీంద్రనాథ్.. హ్యాట్రిక్ కొడతాడా..?

కడప జిల్లాలో జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. కమలాపురం సెగ్మెంట్ కూడా అదే రేంజ్లో ఫోకస్ అవుతుంది. ముందు నుంచి కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధులను ఆదరిస్తూ వచ్చిన కమలాపురం ఓటర్లు.. వైసీపీని వరుసగా రెండు సార్లు గెలిపించారు. ఆ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే గెలవగలిగింది. అలాంటి చోట రెండు సార్లు వరుసగా గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు .. ఆయన ముఖ్యమంత్రి జనన్‌ని స్వయానా మేనమామ కావడంతో జిల్లాలో కమలాపురానికి ప్రాధాన్యత పెరిగింది

గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ హయాంలో అమలు చేసినసంక్షేమ కార్యక్రమాలను ఫోకస్ చేసుకుంటూ రవీంద్రనాథ్ ప్రచారం నిర్వహించారు. అలాగే టీడీపీ అభ్యర్ధి వ్యతిరేకులను తనవైపు తిప్పుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారు. వైసీపీ ఈసారి కూడా నవరత్నాల హామీలతోనే ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఎంత మంత్రి లబ్దిదారులకు ఎంతెంత మొత్తాలు అందించామో? మళ్లీ గెలిస్తే ఎంత ఇస్తామో చెప్పుకుంటూ ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేశారు వైసీపీ అభ్యర్ధి.


Also Read: మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు?

కమలాపురం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతుంది. రవీంద్రనాథ్‌రెడ్డి మొదటి సారి గెలిచినప్పుడు వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ సానుభూతితో రెండోసారి గెలిపిస్తే.. అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ అభివృద్దికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. రవీంద్రనాథ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకాక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఇక సాయం కోసం తన దగ్గరకు వచ్చే వారిని కూడా ఆయన పట్టించుకోలేదని.. కేవలం తన సామాజికవర్గం వారికి మాత్రమే న్యాయం చేశారన్న విమర్శలు నియోజకవర్గవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే టికెట్‌పై నమ్మకంలో పుత్తా కుటుంబసభ్యులు నియోజకవర్గంలో ఓటర్లందరినీ కలుస్తూ ప్రచారం నిర్వహించారు. సెగ్మెంట్‌లోని ప్రతి ఇంటినీ ఒకటికి రెండు సార్లు టచ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసిన అవినీతిని ఎండగడుతూ.. అభివృద్ది విషయంలో ఎమ్మెల్యే వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు.

Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?

ఈ సారి కమలాపురంలో టీడీపీని మరింత బలోపేతం చేశామని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న ధీమా పూత్తా ఫ్యామిలీలో కనిపిస్తుంది. 2004 నుంచి తమ కుటుంబం టీడీపీకే లాయల్‌గా ఉండటం. తన తండ్రి పుత్తా నరసింహారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సానుభూతి .. ఈ సారి తన విజయానికి దోహదం చేస్తాయని చైతన్యరెడ్డి నమ్మకంతో ఉన్నారు. ఈసారి కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు.

పుత్తా చైతన్య రెడ్డి ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లి మర్రి మండలం, చింతకొమ్మ దిన్నె మండలం, చెన్నూరు మండలం వంటి మేజర్ మండలాలలో వైసీపీ శ్రేణలను టీడీపీలో చేర్చుకుంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ .. హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగింటి ఆడపడుచులకు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. యువనేత అయిన చైతన్యరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి అయినా.. తన తండ్రితో కలిసి ముందు నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేవారన్న గుడ్ విల్ ఉంది .. ఇచ్చిన మాట తప్పడు అని చైతన్య రెడ్డిపై మంచి అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉంది.

Also Read: పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..

మరోవైపు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కమలాపురం నియోజకవర్గ అభివృద్దికి సంబంధించి రవీంద్రనాథ్‌రెడ్డి తాని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి.. ఏళ్ల తరబడి కమలాపురం నియోజకవర్గ ప్రజల ఆశ అయిన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన రవీంద్రనాథ్‌రెడ్డి.. గెలిచాక ఆ విషయమే మర్చిపోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట.. ఆ క్రమాంలోఈసారి అధికార పార్టీ వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ తన వైపు తిప్పుకుని గెలుపు దిశగా గట్టిగానే పావులు కదిపింది.

గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చైతన్య రెడ్డి తండ్రి పుత్తా నరసింహారెడ్డి ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చారు .. రెండు సార్లు గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయారు .. ఆ లెక్కలతో ఈ సారి చైతన్యరెడ్డి పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని బూత్‌లను స్వయంగా పర్యవేక్షించారు.. ఆ క్రమంలో ఈ సారి 84.44 పోలింగ్ శాతం నమైదైందని.. గతం కంటే 20 వేల మంది ఓటర్లు పెరిగారని .. అదే తమ విజయానికి బాట వేస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి … ఈ సారి ఎన్నికల్లో ఓటుకు నోట్లు వెదజల్లిన వైసీపీ వర్గాలు సైతం అదే ధీమాతో కనిపిస్తున్నాయి .. మరి కమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags

Related News

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Big Stories

×